అన్వేషించండి

Bandi Sanjay: బండి సంజయ్ అరెస్టు, మునుగోడు వెళ్లకుండా అడ్డగింత - అర్ధరాత్రి ఉద్రిక్తతలు

మునుగోడు నియోజకవర్గానికి బుధవారం (నవంబరు 2) అర్ధరాత్రి బండి సంజయ్ బయలుదేరారు. దీంతో పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అర్ధరాత్రి వేళ హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. పోలింగ్ వేళ మునుగోడులోనే మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఉన్నా కూడా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదంటూ ఆయన ఆరోపించారు. అందుకోసం మునుగోడు నియోజకవర్గానికి బుధవారం (నవంబరు 2) అర్ధరాత్రి బయలుదేరారు. దీంతో పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ లో అరెస్టు చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంతకుముందు పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట, ఉద్రిక్తత జరిగింది. తొలుత మలక్‌పేట వద్ద అడ్డుకున్నారు. అయినా ఆయన ముందుకు వెళ్లడంతో వనస్థలిపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలు పోలీసులను అడ్డుకోవడంతో కాన్వాయ్‌ ముందుకు వెళ్లింది. చివరికి బండి సంజయ్‌ను అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద పోలీసులు ఆపారు. దీంతో అర్ధరాత్రి వేళ బీజేపీ కార్యకర్తలు ధర్నా చేశారు. దీంతో హైవేపై వాహనాలు భారీగా ఆగిపోయాయి.

అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ నుండి బండి సంజయ్ ని పోలీసు వాహనంలో తరలించారు. పోలీస్ కాన్వాయ్ ని బీజేపీ కార్యకర్తలు వెంబడించారు. అయితే, బండి సంజయ్ ను ఎక్కడికి తీసుకు వెళుతున్నారో పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. 

ముఖ్యమంత్రి వ్యవహారం, పోలీసుల, ఎన్నికల కమిషన్ తీరుపై నేడు ఉదయం బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంఓ నుండి వచ్చిన ఆదేశాలకు భయపడి టీఆర్ఎస్ దౌర్జన్యాలకు భయపడి నిన్న రాత్రి జరిగిన అరాచకాలకు సంబంధించిన వార్తలను కూడా కొన్ని మీడియా సంస్థలు ప్రసారం, ప్రచురణ చేయలేదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన మీడియా సంస్థలే సీఎం చెప్పు చేతల్లో ఉండటం అత్యంత బాధాకరమని అన్నారు. కేసీఆర్ రాక్షస పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని బండి సంజయ్ పిలుపు ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి ఖూనీ చేస్తున్నారని, రాక్షస పాలన అంతం కావాలంటే టీఆర్ఎస్‌కు రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపు ఇచ్చారు.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై ! పీర్జాదిగూడలో సంచలనం
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై ! పీర్జాదిగూడలో సంచలనం
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Embed widget