Hemant Soren Meets CM KCR : సీఎం కేసీఆర్ తో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ భేటీ
Hemant Soren Meets CM KCR : సీఎం కేసీఆర్ తో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి, సమకాలీన అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించినట్లు సమాచారం.

Hemant Soren Meets CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ గురువారం రాత్రి భేటీ అయ్యాయి. సీఎం హేమంత్ సొరేన్ ఇవాళ ఉదయమే హైదరాబాద్ చేరుకున్నారు. హేమంత్ సొరేన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తి గత కారణాలతో హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రాత్రి ప్రగతి భవన్ కు వచ్చిన ఆయన సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. గతంలో ఒకసారి హేమంత్ సొరెన్ హైదరాబాద్ లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఇటీవల సీఎం కేసీఆర్ కూడా రాంచీ వెళ్లి హేమంత్ సొరేన్‌తో సమావేశమయ్యారు. దేశ రాజకీయాలతో కేంద్ర ప్రభుత్వ వైఖరి సహా సమకాలీన అంశాలపై చర్చించారు. ఇరువురు భేటీ కావడంతో రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రకటించిన తర్వాత ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.






















