అన్వేషించండి

Formula E Race : ఫార్ములా ఈ-రేసింగ్ లో గందరగోళం, ట్రాక్ పైకి దూసుకొచ్చిన వాహనదారులు- ప్రాక్టీస్ రేసులో ప్రమాదం

Formula E Race : ఫార్ములా ఈ-రేసింగ్ ట్రాక్ వద్ద గందరగోళం నెలకొంది. ట్రాక్ మీదకు వాహనాలు వచ్చేశాయి. దీంతో ప్రాక్టీస్ రేస్ ఆలస్యం అయింది.

Formula E Race : హైదరాబాద్ ఫార్ములా ఈ-రేసింగ్ ట్రాక్ మీద గందరగోళం నెలకొంది. ఒక్కసారిగా ట్రాక్ మీదకు వాహనదారులు దూసుకొచ్చారు. దీంతో ప్రాక్టీస్ రేస్ నిర్వాహణలో ఆలస్యం అయింది. ట్రాక్ మీదకు స్థానికులు వాహనాలు ఎలా వచ్చాయని రేసింగ్ నిర్వాహకులు ఆందోళన పడుతున్నారు. ట్రాక్  పైకి  వాహనాలు అనుమతించిన కానిస్టేబుళ్లపై చర్యలు చేపట్టారు అధికారులు. కానిస్టేబుళ్లను  అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ప్రాక్టీస్ రేస్ వల్ల వాహనాలను దారిమళ్లించారు పోలీసులు. ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లను తోసుకుని ట్రాక్ పైకి వచ్చారని తెలుస్తోంది. 

రేసింగ్ ట్రాక్ పై ప్రమాదం 

రేసింగ్ ట్రాక్ పై ప్రమాదం జరిగింది. ప్రాక్టీస్ రేస్ మొదలైన కొద్దిసేపటికే సైడ్ వాల్ ను రేసింగ్ కారు ఢీకొట్టింది. మలుపులో కారు అదుపు తప్పి వాల్ ను ఢీకొట్టింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో కారు ఎగిరిపడింది.  ప్రమాద ప్రాంతానికి రెస్క్యూ టీమ్ చేరుకుంది. ప్రాక్టీస్ రేస్ మొదలైన కొద్దిసేపటికే ప్రమాదం జరిగింది. దీంతో రేస్ కు బ్రేక్ ఇచ్చారు.  

Formula E Race : ఫార్ములా ఈ-రేసింగ్ లో గందరగోళం, ట్రాక్ పైకి దూసుకొచ్చిన వాహనదారులు- ప్రాక్టీస్ రేసులో ప్రమాదం

హుస్సేన్ సాగర్ వద్ద రేసింగ్ 

హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన రేపటి(శనివారం) నుంచి రయ్ రయ్ మంటూ స్పోర్ట్స్ కార్లు దూసుకెళ్లనున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ గార్డెన్ నుంచి ఐమ్యాక్స్ మీదుగా 2.8 కిలోమీటర్లు దీనికోసం సర్క్యూట్ ను తీర్చిదిద్దారు. ఫిబ్రవరి 11వ జరగనున్న ఈ రేస్ లో 11 ప్రముఖ ఆటో మొబైల్ సంస్థలకు చెందిన ఎలక్ట్రికల్ కార్లు ఈ రేసులో పాల్గొననున్నాయి. 22 మంది డ్రైవర్లు తమ సత్తా చాబోతున్నారు. 208 కిలోమీటర్లలో మొత్తం 18 మలుపులు ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సందర్శకుల కోసం 11 స్టాండ్లు, 7 గేట్లను కూడా ఏర్పాటు చేశారు.

వారం రోజుల ముందు నుంచే ఆంక్షలు

ఈ రేస్ లో పాల్గొనబోయే కార్లు గంటకు 280 కిలో మీటర్ల గరిష్టవేగంతో ప్రయాణించగలమని... 250 కేవీ పవన్ ద్వారా 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 2.8 సెకన్లలోనే అందుకుంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు. మన దేశంలో నిర్వహించబోయే మొట్టమొదటి ఫార్ములా ఈ రేసింగ్ కు ఏర్పాట్లు చురుగ్గా పూర్తి చేశారు. వారం రోజుల ముందు నుంచే ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. స్ట్రీట్ సర్క్యూట్ కు రెండు వైపులా భారీ ఎత్తున బారికేడ్లు, ప్రేక్షకుల కోసం గ్యాలరీలు సిద్ధం చేశారు. ఐమాక్స్ పక్కన కార్ల షెడ్లతో పాటు వీఐపీల గ్యాలరీల నిర్మాణాలను చేపట్టారు. ఇప్పటికే బుక్ మై షోలో ఈ రేస్ ఫార్ములాకు సంబంధించిన టికెట్లు అమ్మకానికి పెట్టారు. పోటీలకు తరలివచ్చే దేశ, విదేశీ పర్యాటకుల కోసం హుస్సేన్ సాగర్ చుట్టూ సరికొత్త హంగులు తీసుకొస్తున్నారు. 

చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఫ్యాన్లతో వేదిక ఏర్పాటు

ఫార్ములా ఆ రేస్ సందర్భంగా ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. ఈ కార్లలో ఫిట్టింగ్ తో  పాటు వాటి నిర్వహణ తదితర అంశాలను ఇంజినీర్లతో కలిసి పర్యవేక్షించారు. భద్రత దృష్ట్యా ఇతరులను కార్ల విడి భాగాల ప్రదేశాన్ని సందర్శించడానికి అనుమతిని నిరాకరించారు. పీపుల్‌ ప్లాజాలో చిన్నారుల కోసం ఫ్యాన్ విలేజీ వేదికను ఏర్పాటు చేసారు. ఈ రేసింగ్ చూసేందుకు వచ్చే చిన్నారులు, విద్యార్థులు, యువత కోసం ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు నిర్వాకులు చెప్పారు. వినోదాత్మక కార్యక్రమాలతో ఈ వేదిక ద్వారా చిన్నారులు ఉత్సాహంగా గడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఓ వేదికను ఏర్పాటు చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
Telangana Heatwave: వ‌డ‌గాల్పుల‌తో 16 మంది మృతి.. రూ.4 ల‌క్షల ఆర్ధిక సాయం.. 3 రోజులు మరింత తీవ్రంగా హీట్ వేవ్
వ‌డ‌గాల్పుల‌తో 16 మంది మృతి.. రూ.4 ల‌క్షల ఆర్ధిక సాయం.. 3 రోజులు మరింత తీవ్రంగా హీట్ వేవ్
Breaking News: భారతీయులను చూసి సభ్యత, సంస్కారం నేర్చుకోండి: అమెరికాకు ఇరాన్ కౌంటర్
భారతీయులను చూసి సభ్యత, సంస్కారం నేర్చుకోండి: అమెరికాకు ఇరాన్ కౌంటర్
Telangana Cabinet Decisions: తెలంగాణ కేబినెట్ వరాల జల్లు - జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం.. పుష్కరాలకు రూ.1,000 కోట్లు!
తెలంగాణ కేబినెట్ వరాల జల్లు - జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం.. పుష్కరాలకు రూ.1,000 కోట్లు!

వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా
Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Heatwave Heart Care : వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
Film Development Corporation : AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
Hyderabad News: క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
Sachin About Arjun Tendulkar: చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
Peddi: 'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
White House Gun Fire: వైట్ హౌస్ వద్ద కాల్పులు.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతం, ట్రంప్ సేఫ్
వైట్ హౌస్ వద్ద కాల్పులు.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతం, ట్రంప్ సేఫ్
IPL 2026 Playoff Race: రేసు రసవత్తరం...Playoff మహత్తరం
రేసు రసవత్తరం... Playoff మహత్తరం
Ram Charan : పెద్ది నా కెరీర్‌లోనే నెం.1 మూవీ - హార్ట్ టచింగ్ ఎమోషనల్ స్టోరీ... స్పెషల్ సాంగ్ ఈవెంట్‌లో రామ్ చరణ్
పెద్ది నా కెరీర్‌లోనే నెం.1 మూవీ - హార్ట్ టచింగ్ ఎమోషనల్ స్టోరీ... స్పెషల్ సాంగ్ ఈవెంట్‌లో రామ్ చరణ్
Embed widget