అన్వేషించండి

CM KCR : రెండు నెలల్లో వస్తా, అందమైన నిజామాబాద్ ను తీర్చిదిద్దాలె - సీఎం కేసీఆర్

CM KCR : నిజామాబాద్ ను మరింత అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

CM KCR : ప్రగతి పథంలో దూసుకుపోతున్న నిజామాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రెండున్నర నెలల్లో ప్రణాళికాబద్ధంగా పనులను పూర్తిచేయాలనీ, తాను పర్యటించి పనులను పరిశీలిస్తానని తెలిపారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, మున్సిపల్ శాఖ, తదితర అన్ని శాఖలు సమన్వయంతో నిజామాబాద్ అభివృద్ధి పనులను పూర్తి చేసేలా పనుల్లో నిమగ్నం కావాలన్నారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే గణేశ్ బిగాలను సీఎం ఆదేశించారు. నిజామాబాద్ అభివృద్ధికి నిధుల కొరత లేదని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే విడుదలైన నిధులతో పాటు  నిజామాబాద్ నగరాభివృద్ధికి అవసరమైన మరిన్ని నిధులను విడుదల చేయాలని ఫైనాన్స్ సెక్రటరీకి సమావేశం నుంచే సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ఆదేశించారు.

ఖమ్మం రూట్ లో 

 ‘‘గందరగోళంగా ఉన్న ఖమ్మం నగరం ప్రభుత్వ కృషితో నేడు సుందరనగరంగా మారింది. ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దినట్టు నిజామాబాద్ ను కూడా తీర్చిదిద్దాలె. మీరంతా కలిసి ఖమ్మం టూర్ వెళ్లండి అక్కడ జరిగిన అభివృద్ధిని పరిశీలించి రాండి.’’ అని నిజామాబాద్ అధికారులను, ఎమ్మెల్యేను సీఎం ఆదేశించారు. నిజామాబాద్ నగరంలో రోడ్లు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో అంచనా వేయాలన్నారు. గ్రావెల్ రోడ్లను బీటీ రోడ్లుగా మార్చాలని చెప్పారు. స్మశాన వాటికలు, బరీయల్ గ్రౌండ్లు ఎన్ని కావాల్సి ఉంది.? సమీకృత మార్కెట్లు ఎన్ని కావాల్సి ఉన్నాయి? కమ్యునిటీ హాల్స్,  డంప్ యార్డులు, వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు, అన్నింటి పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. నిజామాబాద్ లో మొత్తం దోభీ గాట్లు, సెలూన్లను అంచనా వేసి మోడ్రన్ దోభీఘాట్లను సెలూన్లను నిర్మించాలన్నారు. నిజామాబాద్ నగరంలో గార్డెన్ల పరిస్థితిని సీఎం అడిగి తెలసుకున్నారు. పబ్లిక్ గార్డెన్లను తక్షణమే మెరుగుపరచాలన్నారు. తాను చిన్నప్పుడు తిలక్ గార్డెన్ లో వెళ్లి కూర్చేనే వాడినని సీఎం గుర్తుచేసుకున్నారు. తిలక్ గార్డెన్ ను పునరుద్ధరించాలన్నారు. మొక్కలను నాటడం పచ్చదనం పెంచే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ను సుందరీకరించాలని సీఎం ఆధికారులను ఆదేశించారు.

నగర సుందరీకరణ 

నిజామాబాద్ నగరంలో మొత్తం ఉన్న ప్రభుత్వ భూములెన్ని వాటిల్లో ప్రజావసరాల కోసం వినియోగించుకోడానికి ఎన్ని అనువుగా ఉన్నాయో ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. సమీకృత కలెక్టరేట్ నిర్మాణం తర్వాత పలు శాఖల కార్యాలయాలను ఖాళీ అయ్యాయని, ఆయా శాఖల భవనాల పరిస్థితి ఏంది..వాటి స్థలాలను, కార్యాలయ భవనాలను ప్రజావసరాలకు  ఏ విధంగా వినియోగించుకోవచ్చో ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. నిజామాబాద్ పట్టణాభివృద్ధి కోసం అనుసరించాల్సిన పద్దతులను ఈ సందర్భంగా సీఎం అధికారులకు వివరించారు. పౌరులకు కల్పించాల్సిన సౌకర్యాలను రూపొందించుకుని వాటికోసం చేపట్టాల్సిన నిర్మాణాత్మక పనుల ప్రణాళికలను సిద్దం చేసుకోవాలన్నారు. దాంతో పాటు నగరాన్ని సుందరీకరించే అంశాలేమిటో పరిశీలించి అందుకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అలంకారాలేమిటి అనే ప్రణాళికలను సిద్దం చేసుకోవాల్సి ఉందని సీఎం తెలిపారు. 

రెండు నెలల్లో వస్తా 

‘‘ నేను రెండు నెలల్లో నిజామాబాద్ వస్తా. మీరు చేసిన పనులను పరిశీలిస్తా. అందమైన నిజామాబాద్ ను తీర్చిదిద్దాలె’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ సీఎంకు వివరించారు. దేశంలోనే ఆదర్శవంతమైన పట్టణాలను తీర్చిదిద్దడంలో మున్సిపల్ శాఖ కృషిని వివరించారు. నిజామాబాద్ నగరంలో ఆడిటోరియం నిర్మాణానికి సంబంధించిన వివరాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీఎంకు వివరించారు. నిజామాబాద్ నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్సీ కవిత సీఎంను అభ్యర్థించారు. నగరంలో బస్టాండ్ నిర్మాణానికి విశాలమైన స్థలం, పిల్లలు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణ నిర్మాణానికి సంబంధించి ఎమ్మెల్సీ కవిత సీఎంకు వివరించారు. హజ్ భవన్ నిర్మాణం చేపట్టాలని సీఎంను కోరారు. 
 

టాప్ హెడ్ లైన్స్

Kaleshwaram Project Politics: కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Telangana Man Buys Bike With 10 Rupee Coins: చిల్లర కాదు బాస్.. ‘కాయిన్’ పవర్! రూ.1.10 లక్షల బైక్‌ను రూ.10 నాణేలతో కొనేసిన తెలంగాణ యువకుడు!
చిల్లర కాదు బాస్.. ‘కాయిన్’ పవర్! రూ.1.10 లక్షల బైక్‌ను రూ.10 నాణేలతో కొనేసిన తెలంగాణ యువకుడు!
Harish Rao Irrigation Department Challenge: 3 నెలలు ఇరిగేషన్ శాఖ అప్పగించు నీళ్లు ఎలా తేవాలో చూపిస్తా - సీఎం రేవంత్‌కు హరీష్ రావు సవాల్
3 నెలలు ఇరిగేషన్ శాఖ అప్పగించు నీళ్లు ఎలా తేవాలో చూపిస్తా - సీఎం రేవంత్‌కు హరీష్ రావు సవాల్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitin Gadkari on E20 Fuel: E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
Kaleshwaram Project Politics: కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
వంట నుంచి సైన్స్  కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!
వంట నుంచి సైన్స్  కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!
Peddi OTT : ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ పెద్ది - 4 భాషల్లో స్ట్రీమింగ్... రన్ టైం ఎంతంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ పెద్ది - 4 భాషల్లో స్ట్రీమింగ్... రన్ టైం ఎంతంటే?
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Plug-in Hybrid SUV: 1200 కిలోమీటర్ల రేంజ్‌తో అదిరిపోయే ఫీచర్స్‌తో వస్తున్న SUVలు!
1200 కిలోమీటర్ల రేంజ్‌తో అదిరిపోయే ఫీచర్స్‌తో వస్తున్న SUVలు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
కేతన్ కేసు: 27 గుణాలు సరిపోలినా బంధం ఎందుకు ఫెయిలైంది! పూణే ఉదంతంపై ఎన్నో ప్రశ్నలు - కేవలం గుణాల ఆధారంగా వివాహాన్ని నిర్ణయించాలా?
కేతన్ కేసు: 27 గుణాలు సరిపోలినా బంధం ఎందుకు ఫెయిలైంది! పూణే ఉదంతంపై ఎన్నో ప్రశ్నలు - కేవలం గుణాల ఆధారంగా వివాహాన్ని నిర్ణయించాలా?
Embed widget