అన్వేషించండి

Telangana Rains: తెలంగాణకు అలెర్ట్, నేడు అతి భారీ వర్షాలు

Telangana Rains: తెలంగాణలోని పలు జిల్లాలో మంగళవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Telangana Rains: తెలంగాణలోని పలు జిల్లాలో మంగళవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 11 జిల్లాలకు ఆరెంజ్‌ వార్నింగ్, 18 జిల్లాలకు ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరం అయితేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.

ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసిన జిల్లాల్లో  మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ ఉన్నాయి. ఎల్లో హెచ్చరికలు జారీ అయిన జిల్లాల్లో హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్‌ ఉన్నాయి. 

మరో పక్క రాష్ట్ర వ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి ప్రారంభమై సోమవారం అంతా పడుతూనే ఉన్నాయి. ఆదివారం రాత్రి కురిసిన వర్షాలకు పలు జిల్లాల్లో కుండపోతగా కురిశాయి. నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం మంచిప్పలో 15.7 సెం.మీ. వర్షం కురిసింది. నిజామాబాద్‌ జిల్లాలో చాలా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి.  రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో 15 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. 

ఉమ్మడి రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లోనూ భారీగా వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌ నగరంలోనూ ఏకధాటిగా వర్షం పడింది. కామారెడ్డి జిల్లా గాంధారిలో సోమవారం 10 సెం.మీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌లో 8.9, కొండాపూర్‌లో 8.8, వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేటలో 7.7, మెదక్‌ జిల్లా చిలిప్‌చేడ్‌ 7.6 సెంటీమీటర్లు చొప్పున వాన పడింది. 

స్తంభించిన జనజీవనం
సోమవారం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌, ఇందల్వాయి, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, సిరికొండలలో కుండపోత వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కప్పలవాగు ఉద్ధృతంగా ప్రవహించింది. ముందస్తు చర్యల్లో భాగంగా కొన్ని మండలాల్లో వంతెనలపై నుంచి ప్రజలు, వాహనాల రాకపోకలను నిలిపివేశారు. 

కామారెడ్డి జిల్లా గాంధారి, మాచారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, బీబీపేట, రాజంపేటలలో భారీ వర్షాలు కురిశాయి. పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. గాంధారిలోని తిప్పారం వాగు ఉద్ధృతికి మహిళా సంఘం సభ్యురాలు సుకన్యకు చెందిన ఫిష్‌ పాండ్‌ కట్ట తెగి రూ.లక్ష విలువైన చేపలు వరదలో కొట్టుకుపోయాయి. మాతుసంగెం గ్రామానికి చెందిన రైతు గౌరీ సంగయ్య వరదలో చిక్కుకుపోగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ అధికారులతో మాట్లాడి బాధితుడిని రక్షించారు.
 
ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు సోమవారం 50 వేల క్యూసెక్కులకు పైగా వరద ప్రారంభమయ్యింది. అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా మధ్యాహ్నం సమయంలో నాలుగు గేట్లు తెరిచారు. కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు 33 వేల క్యూసెక్కుల వరద రావడంతో గేట్లు తెరిచి దిగువకు వదిలారు. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలకు మానేరు, ఇతర స్థానిక వాగులనుంచి ప్రవాహం వస్తోంది. దీంతో మేడిగడ్డ నుంచి దిగువకు 1.66 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరిలో 36.81 మీటర్ల మట్టం నమోదవ్వగా, నదిలో 78,663 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది.

ప్రాజెక్టుల్లో నీటి వివరాలు
సింగూరు ప్రాజెక్టు నీటి సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా ప్రస్తుతం 27.18 టీఎంసీల నీరు ఉంది. ఇన్ ఫ్లో 3,200 క్యూసెక్కుల నీరు వస్తోంది. అలాగే నిజాం సాగర్‌లో 16.50 టీఎంసీలు ఉండగా 35,000 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో 89.75 టీఎంసీల నీరు ఉంది. ఇన్ ఫ్లో 51,000 క్యూసెక్కులు ఉండగా దిగువకు 12,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టులో 6.62 నిల్వ ఉండగా 33,244 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. అలాగే 43,485 క్యూసెక్కులు కిందకు వదులుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో 18.98 టీఎంసీలు ఉండగా 42,538 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తోంది. 43,120 క్యూసెక్కులు ఔట్ ఫ్లో ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
Work From Park: వర్క్ ఫ్రమ్ హోమ్‌కు గుడ్‌బై.. ఇక వర్క్‌ ఫ్రమ్ పార్కు.. సైబరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ సరికొత్త ఆలోచన!
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు గుడ్‌బై.. ఇక వర్క్‌ ఫ్రమ్ పార్కు.. సైబరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ సరికొత్త ఆలోచన!
Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Gym Beginner Guide : జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
Petrol Saving Tips: మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
Mahasakthi Movie OTT : ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget