అన్వేషించండి

Harish Rao : ఆ ఇద్దరు నేతల వల్లే ఏపీకి కష్టాలు - మరోసారి హరీష్ వ్యాఖ్యలు !

ఇద్దరు నేతల వల్లనే ఏపీ బొక్క బోర్లా పడిందని హరీష్ రావు అన్నారు. వారిద్దరికీ ప్రచారం ఎక్కువ.. పని తక్కువ అన్నారు.


Harish Rao : తెలంగాణ అభివృద్దిని ప్రచారం చేసుకునే క్రమంలో తరచూ ఏపీ రాజకీయ నేతలను తెలంగాణ నేతలు విమర్శిస్తూ ఉంటారు. తాజాగా మరోసారి అలాంటి విమర్శలే చేశారు. అయితే హరీష్ రావు గతంలో  జగన్ పాలనను మాత్రమే విమర్శించేవారు. ఇప్పుడు చంద్రబాబు పాలనను కూడా విమర్శించారు.  ఇద్దరు నేతల వల్ల ఏపీ బొక్కబోర్లా పడిందని.. వాళ్ళది ప్రచారం ఎక్కువ.. మనది పని ఎక్కువ అని అన్నారు. పేర్లు చెప్పకపోయిన వారిద్దరూ చంద్రబాబు , జగన ్అని సులువుగానే చెప్పవచ్చు. గతంలో ఒకరు హైటెక్ పాలన అంటూ హడావుడి చేశారని... ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు.                                

నెల్లూరులో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి - లైన్ క్లియర్ !

సంగారెడ్డిలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సుపరిపాలన దినోత్సవంలో మంత్రి పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లి చూస్తే తెలంగాణ గొప్పతనం తెలుస్తుందన్నారు. కేసీఆర్  తెలంగాణ సమాజం తల ఎత్తుకునేలా పరిపాలన  చేశారని ప్రశసించారు.  కొత్త రాష్ట్రం అయినా సుపరిపాలన అందించారన్నారు. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని తెలిపారు. కేంద్ర, అన్ని రాష్ట్రాల ఉద్యోగుల వేతనాల కంటే ఎక్కువ వేతనాలు పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులే అని పేర్కొన్నారు. తెలంగాణ చేస్తున్న మంచి పనులు చూసి కేంద్రం తట్టుకోలేకపోతుందని మంత్రి విమర్శించారు.                

అహంకారం వల్లే ఓడిపోయాం - దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు !

తెలంగాణలో సర్పంచులు అందరూ ఓ బస్సులో గుజరాత్, మహారాష్ట్ర వెళ్లి అక్కడ అభివృద్ధి ఎలా ఉందో చూడాలన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ పనితనానికి.. బీఆర్‌ఎస్ మోడల్ సర్కార్ పనితనానికి తేడా తెలుస్తుందన్నారు. అస్సాం ముఖ్యమంత్రి స్వయంగా కరెంట్ సరిపోవట్లేదు కరెంట్ పొదుపుగా వాడాలని చెప్పారని గుర్తు చేశారు.  మనకి ఢిల్లీలో అవార్డులు ఇస్తారు.. గల్లీలో తిడుతారు. ధరణి వల్లే రైతుల సమస్య పరిష్కారం అయ్యింది. ధరణి రాకముందు రైతుల కష్టం అంతా ఇంతా కాదు. ధరణి తీసేయాలని కాంగ్రెస్ చెబుతుంది. ధరణి తీసేస్తే.. కాంగ్రెస్ కార్యకర్తలకే రైతు బంధు ఇస్తారని హెచ్చరించారు.                               

కాంగ్రెస్ వాళ్లు మళ్ళీ వస్తే దళారీ వ్యవస్థ రాజ్యామేలుతుంది. తెలంగాణ దేశానికి దిక్సుచిగా నిలవాలంటే మూడోసారి కేసీఆర్ రావాలని్నారు  రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన లక్షా 30 వేల కోట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు.  తెలంగాణ వస్తే నక్షలైట్ల రాజ్యం వస్తుందని.. హైదరాబాద్‌లో కర్ఫ్యూ ఉంటుందని.. అంతా చీకటేనని చాలా మంది చెప్పారని గుర్తుచేశారు. ఈ 9 ఏళ్లలో అది నిజం కాదని కేసీఆర్ చేసి చూపెట్టారన్నారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందని.. కేంద్రమే తెలంగాణకి అవార్డులు ఇస్తుందన్నారు. రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న వ్యతిరేక శక్తులకు ఇది చెంపపెట్టన్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం
నేడు కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం
Telangana Breakfast Scheme: ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా
ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా
Telangana Food Safety Raids: సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
Rains in Andhra Pradesh and Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Food Safety Raids: సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
Pawan Kalyan Home Minister Portfolio: పవన్ కల్యాణ్ ఆఫీసులో సోషల్ మీడియా కేసులపై స్పెషల్ టాస్క్ ఫోర్స్.. హోంశాఖ బాధ్యతలకు ఇది సంకేతమా?
పవన్ కల్యాణ్ ఆఫీసులో సోషల్ మీడియా కేసులపై స్పెషల్ టాస్క్ ఫోర్స్.. హోంశాఖ బాధ్యతలకు ఇది సంకేతమా?
Nara Lokesh: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
Tata Sierra EV vs Curvv EV: ఎక్కువ రేంజ్‌, కంఫర్ట్, మంచి స్పేస్‌ కోసం ఏ EV కొనాలి?
రూ.20 లక్షల బడ్జెట్‌లో Tata Sierra EV లేదా Curvv EV - ఏది బెస్ట్ ఛాయిస్?
Sanju Samson Under Pressure: సంజూ శాంసన్ కు పెరిగిపోతున్న కౌంట్‌డౌన్..  టెక్నికల్ లోపాలతో స‌త‌మ‌తం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి లైన్ క్లియర్!
సంజూ శాంసన్ కు పెరిగిపోతున్న కౌంట్‌డౌన్..  టెక్నికల్ లోపాలతో స‌త‌మ‌తం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి లైన్ క్లియర్!
Rains in Andhra Pradesh and Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్
Sri Sathya Sai District Solar Plant Farmers Issue: కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
Yashasvi Jaiswal In FIFA World Cup : ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
ఫిఫా ప్రపంచకప్ లో ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
Embed widget