అన్వేషించండి

Harish Rao Meets Kavitha : తీహార్ జైల్లో కవితతో హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ

Kavitha : తీహార్ జైల్లో కవితను హరీష్ రావు కలిశారు. లిక్కర్ కేసులో జరుగుతున్న పరిణామాలు, బెయిల్ పిటిషన్లపై విచారణ వంటి విషయాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ధైర్యంగా ఉండాలని కోరినట్లుగా తెలుస్తోంది.

Harish Rao met Kavitha in Tihar Jail :  ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయి తీహార్ జైలులో ఉన్న‌ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీశ్‌ రావు శుక్ర‌వారం ములాఖత్ అయ్యారు.  ఈ ములాఖాత్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. బెయిల్ పిటిషన్లపై విచారణతో పాటు కుటుంబానికి చెందిన పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.  ఇటీవ‌లే మాజీ మంత్రులు స‌త్య‌వ‌తి రాథోడ్, స‌బితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ క‌విత‌ను కలిశారు.  ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌ కేసులో రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని ఇటీవల కోర్టు మరోసారి పొడిగించింది.  జులై 5వ తేదీ వరకు ఆమె కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీ రౌస్‌ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. 

మార్చి 15న కవితను అరెస్టు  చేసిన ఈడీ 

లిక్కర్‌ స్కాం కేసులో మార్చి 15వ తేదీన ఈడీ హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అరెస్ట్‌ చేసింది. అప్పటి నుంచి రిమాండ్‌ మీద ఆమె తీహార్‌ జైల్లో ఉన్నారు. ఇక.. ఈ కేసులో ఈడీ, సీబీఐ వేర్వేరుగా ఆమెను అరెస్ట్‌ చేయగా.. బెయిల్‌ కోసం ఆమె కూడా విడివిడిగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ప్రస్తుతం వాటిపై విచారణ జరుగుతోంది. మొదట ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు లోనే బెయిల్‌ పిటిషన్లు వేశారు. ఇది రాజకీయ కక్షతోనే జరిగిన అరెస్టుగా ఆమె వాదించారు. అయితే.. ఆమె బయటకు వస్తే కేసును ప్రభావితం చేస్తారని దర్యాప్తు సంస్థల వాదనలో కోర్టు ఏకీభవించింది. ఆమె బెయిల్‌ పిటిషన్లను తోసిపుచ్చింది. తర్వాత ఉన్నత న్యాయస్థానాల్లో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. 

లిక్కర్ స్కాంలో కవితపై ఇవే అభియోగాలు

 లిక్కర్ కేసులో కవితపై ఈడీ పలు అభియోగాలు మోపింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మొత్తంగా రూ.1100 కోట్ల నేరం జరిగిందని ఈడీ పేర్కొంది. అందులో.. 192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ పొందిందని తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు ఇచ్చినట్లు చెప్పింది. అంతేకాకుండా.. 292 కోట్ల నేరంలో కవిత పాత్ర ఉందని ఈడీ ఆరోపించింది. మరోవైపు.. కవిత డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేసిందని కూడా ఈడీ పేర్కొంది.  ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఏం చేశారో ఈడి, సిబిఐ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.ఎమ్మెల్సీ కవిత సాక్షులను బెదిరించడం తో పాటు, సాక్ష్యాలను జరిపి వేసే ప్రయత్నం చేశారని అందువల్ల ఆమెకు బెయిల్ ఇవ్వకూడదని ఈడీ, సిబిఐ తరపు న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టుకు వివరించారు. కవితకు ఈ డి సమన్లు జారీ చేసిన రెండు రోజుల్లోనే ఆమె నాలుగు ఫోన్లను ఫార్మాట్ చేశారని పేర్కొన్నారు.

కవితకు బెయిల్ ఇవ్వొద్దని వాదిస్తున్న ఈడీ 

కవిత సాధారణ మహిళ కాదని పేర్కొన్న ఈడి రాజకీయ శక్తిసామర్ధ్యాలు ఉన్న వ్యక్తని, ఒక రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన వ్యక్తి కూతురని పేర్కొన్నారు. విదేశాలలో ఫైనాన్స్ లో మాస్టర్స్ చేసి వచ్చి, రాజకీయాలలో ఉన్నత స్థానాలను చేపట్టిన వ్యక్తి అని గుర్తు చేశారు. ఈ కేసులో బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై లను బెదిరించి తనకు వ్యతిరేకంగా ఇచ్చిన వాంగ్మూలాలను ఉపసంహరించుకునేలా కవిత ఒత్తిడి చేశారని ఈడి కోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది.

టాప్ హెడ్ లైన్స్

Soyam Bapu Rao: ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Bandi Sanjay: పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget