అన్వేషించండి

Telagana Elections 2023 : వచ్చే ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య మంత్రిగా ఉంటా - కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

Telagana Elections 2023 : కేసీఆర్ హ్యాట్రిక్ విజయం ఖాయమని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మూడో సర్కారులో తాను వైద్య ఆరోగ్య మంత్రిగాఉంటానన్నారు.

Telagana Elections 2023 Harish Rao :  హైదరాబాద్ : తెలంగాణ రాష్టంలో సీఎం కేసీఆర్ ను ( KCR (  మ్యాచ్ చేసే లీడర్ లేనే లేడని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.  దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ సీఎం గా కేసీఆర్ రికార్డ్ కొట్టబోతున్నారని జోస్యం చెప్పారు.  హైదరాబాద్ ( Hyderabad ) లో మీడియా  ప్రతినిధులు నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో పలు అంశాలపై మాట్లాడారు.   విద్య అంటే చాలా మంది స్కూళ్లు, విద్యా శాఖ బడ్జెట్ మాత్రమే చూస్తారు. కానీ.. వైద్య శాఖ ద్వారా మెడికల్ కాలేజీలు, ఫారెస్ట్ యూనివర్సిటీ, హర్టికల్ యూనివర్సిటీ, ఫిషరీస్ యూనివర్సిటీ వంటివి కూడా విద్య కు చేసే ఖర్చుగా చూడాల్సి ఉందన్నారు.  వైద్య రంగాన్ని బలోపేతం చేశామని... అన్ని స్థాయిల దవాఖానల్లో సదుపాయాలు కల్పించామమన్నారు.  జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తెచ్చామని గుర్తు చేశారు  

మూడో సారి గెలిచిన తర్వాత ప్రత్యేక లక్ష్యాలు

హ్యాట్రిక్ విజయం తర్వాత   వైద్య, విద్య రంగాలను మరింత బలోపేతం చేయడంతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని భావిస్తున్నామని హరీష్ రావుతెలిపారు.  తెలంగాణ ఉద్యమ నినాదంలో  నీళ్ళు.. తెలంగాణ గడ్డ మీదికి నీళ్ళు మళ్లించామన్నరాు.  నిధులు.. మన నిధులు మనం వాడుకుంటున్నాము కాబట్టే సంక్షేమం అమలు చేయగలుగుతున్నామన్నారు.  నియామకాలు.. మొదటి విడతలో 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఈసారి 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలు పెట్టాం. కరోనా రావడం, రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కోసం ఏడాదిన్నర ఎదురు చూడాల్సి రావడంతో రెండో విడతలో కాస్త ఆలస్యం జరిగిందన్నారు.   ప్రైవేట్ పరంగా ఇండస్ట్రీలో 24 లక్షల ఉద్యోగాలు, 6 లక్షల ఉద్యోగాలు ఐటీ లో వచ్చాయని గుర్తు చేశారు.  ఐటీ ఉత్పత్తుల్లో, ఐటీ ఉద్యోగాల కల్పనలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ప్రభుత్వ విధానాల వల్లే ఇది సాధ్యమైందన్నాు.

కేసీఆర్ పాలనలో కరవు , కర్ఫ్యూ లేదు! 
. 
పదేళ్ల కేసిఆర్ పాలనలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు. కులం, మతం, ప్రాంత వివక్ష తెలంగాణలో లేదు.  వాటర్ ట్యాంకర్లు లేవు, జనరేటర్ల చప్పుళ్లు లేవన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మూడు బరాజులు మాత్రమే కాదు. పంప్ హౌస్ లో టన్నెల్ కాలువలు రిజర్వాయర్లు.. ఇలా కాళేశ్వరం అంటే ఒక పెద్ద వ్యవస్థ. ఈ విషయం తెలియక ప్రతిపక్షాలు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు హంగామా చేస్తున్నారని విమర్శించారు.  పాజిటివ్ ఓటింగ్ తో మళ్ళీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.  ప్రతిపక్షాలకు ఎజెండా లేదు. గతంలో తాగునీటిపై, విద్యుత్ పై చర్చ జరిగింది. ఇప్పుడు మేము వాటిని పరిష్కరించాం. కాబట్టే మమల్ని వ్యక్తిగతంగా తిడుతున్నారని విమర్శించారు. 

బూతులు మాట్లాడే నాయకులకు పోలింగ్ బూత్‌లలో సమాధానం చెప్పాలి ! 

BRS నేతలను చెప్పుతో కొట్టాలి అని నిన్న ఒక నేత అన్నడు. మేమూ మాట్లాడగలం. బూటుతో కొట్టాలి అని నేను కూడా అనగలను. కానీ ప్రజలకు బూతులు మాట్లాడే నాయకులు కాదు..  భవిష్యత్తు కోరే నాయకులు కావాలన్నారు.   బూతులు మాట్లాడే నాయకులకు.. ప్రజలకు పోలింగ్ బూతుల్లోనే సమాధానం చెప్తారన్నారు.  తెలంగాణకు కాంగ్రెస్, బిజెపి ఒక్కటి అయ్యాయి. దుబ్బాక, మునుగొడులో కాంగ్రెస్ పార్టీ సరెండర్ అయింది. ఇప్పుడు బిజెపి లొంగిపోయిందన్నారు.  7 మండలాలు బిల్లు తెచ్చింది బిజెపి, మద్దతు ఇచ్చింది కాంగ్రెస్. సీలేరు పవర్ ప్రాజెక్ట్ బిల్లు తెచ్చింది బిజెపి.. మద్దతు ఇచ్చింది కాంగ్రెస్. నూకలు బుక్కుమని కేంద్ర మంత్రి అవమానిస్తే మేము ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తే.. కాంగ్రెస్ కనీసం ఖండించలేదని గుర్తు చేశారు.  ఊరికి ఇద్దరు పైరవికారులకు మేలు కలగాలంటే కాంగ్రెస్ కు ఓటేయండి.. ఊరంతా మేలు కలగాలి అంటే  బీఆర్ఎస్‌కు ఓటు వేయాలన్నారు. 

మైనార్టీ ఓట్ల కోసమే బీఆర్ఎస్ పై తప్పుడు ప్రచారం

 మైనార్టీల ఓట్ల కోసమే బిఆర్ఎస్, బిజెపి ఒక్కటే అని కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు.  బిజెపి, BRS ఒక్కటే అయితే గవర్నర్ మాకు సహకరించే వారు. ఆర్టీసీ బిల్లు అంతా సిద్ధంగా ఉంది. గవర్నర్ ఆలస్యం చేయడం వల్ల ఆగిపోయింది. ఇప్పుడైనా ఇసి ఒప్పుకుంటే ప్రభుత్వంలో కలిపేస్తాం. లేదా మళ్ళీ ప్రభుత్వం ఏర్పడగానే విలీనం చేస్తామన్నారు   బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టలేదని 35 వేల కోట్లు కేంద్రం ఆపిందని..   బిజెపి పై మేము పోరాటం చేస్తున్నాం, కేంద్రం మా మీద కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నదన్నారు.   కాంగ్రెస్ మా మేనిఫెస్టో కాపీ కొట్టింది. మా పథకాలకు కొంత కలిపి ఎక్కువ ఇస్తామని చెప్పిందన్నారు.   కాంగ్రెస్ ది ఎగవేసే చరిత్ర.. మాది ఇచ్చిన హామీ నెరవేర్చిన ఘనత అన్నారు.  

వచ్చే ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటా ! 

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కర్ణాటక లో రాహుల్ చెప్పారు. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదని గుర్తు చేశారు.  నేను సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పనిచేసే కార్యకర్తను. పార్టీ నాకు ఏ బాధ్యత అప్పగించినా చేస్తాను.  రాబోయే ప్రభుత్వంలో మరోసారి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవి చేపట్టాలని ఉంది. ప్రజలకు ఎక్కువ సేవ చేసే అవకాశం ఆత్మసంతృప్తి ఆ శాఖలో ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad PRT: హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Revanth Reddy Governance Criticisms: రాజకీయాల్లో దూకుడు - పథకాల అమల్లో ఆలస్యం - రేవంత్ పాలనలో వెనుకబడుతున్నారా?
రాజకీయాల్లో దూకుడు - పథకాల అమల్లో ఆలస్యం - రేవంత్ పాలనలో వెనుకబడుతున్నారా?
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Embed widget