అన్వేషించండి

Governor Tamilisai: ఉత్కంఠకు తెర! ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై గ్రీన్ సిగ్నల్, కాసేపట్లో సభలోకి బిల్లు

నేడు గవర్నర్‌తో తెలంగాణ ఆర్ అండ్ బీ అధికారులు సమావేశం అయిన సంగతి తెలిసిందే. వారి వివరణ అనంతరం ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు.

రెండు రోజులుగా ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదిస్తారా లేదా అనే ఉత్కంఠకు తెరపడింది. నేడు గవర్నర్‌తో తెలంగాణ ఆర్ అండ్ బీ అధికారులు సమావేశం అయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తరఫున రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా గవర్నర్ తో భేటీ అయ్యారు. వారి వివరణ అనంతరం ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. అయితే, కొన్ని సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి గవర్నర్ ఆమోదం తెలపడంతో ఆర్టీసీ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి మార్గం సుగమం అయింది.

అసెంబ్లీ సమావేశాల పొడిగింపునకు అవకాశం?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను రెండు రోజులపాటు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ బిల్లు నేపథ్యంలో చర్చకు సమయం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బిల్లుపై చర్చకు ఈ ఒక్కరోజు సమయం సరిపోదని విపక్షాలు కోరడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.  

ముందు గవర్నర్ వద్దకు ఎందుకంటే?

తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడంలో భాగంగా సంబంధిత ఆర్టీసీ బిల్లును గవర్నర్‌కు పంపించారు. మామూలుగా అయితే ముందు అసెంబ్లీలో ప్రవేశపెట్టి అక్కడ పాసైన బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం పంపుతారు. కానీ ఆర్థిక బిల్లులకు మాత్రం ముందుగానే గవర్నర్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్టీసీ విలీనం ఆర్థిక బిల్లు కిందికి వస్తుండడం వల్ల గవర్నర్ వద్దకు వెళ్లింది.

గవర్నర్ లేవనెత్తిన అంశాలు ఇవే

తొలుత ప్రభుత్వం పంపిన వివరణతో సంతృప్తి చెందని ఆమె 6 అంశాలపై వివరణలు కోరారు. 
1. కేంద్ర వాటా 30 శాతం ఉన్నందున కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరమా కాదా? 
2. ఆర్టీసీ శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల వివరాలు సమర్పించాలి. 
3. తాత్కాలిక ఉద్యోగుల ప్రయోజనాల రక్షణకు తీసుకున్న చర్యలేంటి? 
4. ఆర్టీసీ స్థిర, చరాస్తుల వివరాలు తెలపాలి. ఆర్టీసీ స్థలాలు, భవనాలను ప్రభుత్వం తీసుకుంటుందా?  
5. బస్సులు, ఉద్యోగుల నిర్వహణను ఎవరు చూస్తారు? సిబ్బంది ప్రయోజనాల రక్షణలో కార్పొరేషన్ పాత్ర ఎలా ఉంటుంది? 
6. ఆర్టీసీ ఉద్యోగులు డిప్యుటేషన్ పై సంస్థలోనే పనిచేస్తారా? అని ఆరు అంశాలపై ప్రభుత్వాన్ని వివరణ కోరారు.

తాను ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, భవిష్యత్ కోసమే ప్రభుత్వాన్ని కొన్ని విషయాలపై స్పష్టత అడుగుతున్నానని, బిల్లును అడ్డుకునే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని తమిళిసై నిన్న కార్మికులతో వీడియో కాన్ఫరెన్స్ లో స్పష్టం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi: దేశంలో ఫాసిస్టులు ఆగడాలు పెరిగిపోయాయ్.. భారత్ సమ్మిట్‌లో కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
దేశంలో ఫాసిస్టులు ఆగడాలు పెరిగిపోయాయ్.. భారత్ సమ్మిట్‌లో కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
N Ramchander Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 
Rahul Gandhi Gig Workers Rally: గిగ్ వ‌ర్క‌ర్ల‌తో క‌లిసి బైక్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి
గిగ్ వ‌ర్క‌ర్ల‌తో క‌లిసి బైక్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
N Ramchander Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 
Cricketer Suicide: ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
Small Cars: మీ ఇంటి దగ్గర రోడ్డు చాలా ఇరుకా? పార్కింగ్‌కు సరైన స్థలం లేదా? ఈ 8 కార్లు మీకు మంచి ఎంపిక
చిన్న సందులు, ఇరుకైన అపార్ట్‌మెంట్ పార్కింగ్‌లకు సులభంగా సరిపోయే 8 కార్లు ఇవే!
15-11-2026 ఆదివారం రాశిఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీనం వారికి గ్రహాల శుభ ప్రభావంతో అదృష్టం!
15-11-2026 ఆదివారం రాశిఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీనం వారికి గ్రహాల శుభ ప్రభావంతో అదృష్టం!
Embed widget