అన్వేషించండి

TSRTC Good News: టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త - అందుబాటులోకి ఆర్థిక భారం తగ్గించే టీ9-30 టికెట్ 

TSRTC Good News: ఆర్టీసీ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు టీ9-30 టికెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

TSRTC Good News: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వల్ప దూరం ప్రయాణించే వారి కోసం టీఎస్ ఆర్టీసీ మరో రాయితీ పథకాన్ని ప్రకటించింది. పల్లె వెలుగు బస్సు ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా ‘టి9-30 టికెట్’ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే టి9-60 వాడకంలో ఉండగా.. ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తాజాగా టి9-30 టికెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని బస్ భవన్ లో బుధవారం ‘టి9-30 టికెట్’ పోస్టర్ ను టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆవిష్కరించారు. ఈ టికెట్‌ కు రూ.50 చెల్లిస్తే 30 కిలో మీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించే వెసులుబాటును ప్రయాణికులకు కల్పించినట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఈ టికెట్‌ చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. ఈ నెల 27(గురువారం) నుంచి ఈ టికెట్ అమల్లోకి వస్తుందని, పల్లె వెలుగు బస్సు కండక్టర్ల వద్ద టికెట్‌ అందుబాటులో ఉంటుందన్నారు. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ ను వారు ఇస్తారని వెల్లడించారు. 

“పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సాధారణ ప్రయాణికులందరికీ ఈ రాయితీ పథకం వర్తిస్తుంది. స్వల్ప దూరం ప్రయాణించే ఉద్యోగులు, వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులకు టి9-30 టికెట్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ టికెట్ తో 30 కిలో మీటర్ల పరిధిలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలో రానూపోను ప్రయాణం చేయొచ్చు. 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇతర రాష్ట్రాలకు ఈ టికెట్ వర్తిస్తుంది. ఈ టికెట్ ద్వారా ఒక్కొక్కరికి రూ.10 నుంచి రూ.30  వరకు ఆదా అవుతుంది. ఈ టికెట్‌ తీసుకున్న ప్రయాణికులు తిరుగు ప్రయాణంలో రూ.20 కాంబి టికెట్ తీసుకుని ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లోనూ ప్రయాణించవచ్చు. ఒక నెల పాటు ఈ టికెట్ అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ప్రయాణికుల స్పందనను బట్టి పొడిగించడం జరుగుతుంది.” అని సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు. 

అందరికీ ‘టి9-60 టికెట్’ వర్తింపు

ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన టి9-60 టికెట్ ను పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణించే వారందరికీ వర్తింపజేస్తున్నట్లు చైర్మన్, ఎండీ ప్రకటించారు. మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం తీసుకువచ్చిన ఈ టికెట్ ను.. ఈ నెల 27 (గురువారం) నుంచి పురుషులకు కూడా వర్తింపజేస్తూ సంస్థ నిర్ణయం తీసుకుందని వారు వెల్లడించారు. రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించే ఈ టికెట్ కు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే టి9-30 టికెట్ కు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. పల్లె వెలుగు బస్సుల్లో ప్రతి రోజు సగటున 15  లక్షల మంది ప్రయాణిస్తున్నారని, వారందరికీ ఆర్ధిక భారం తగ్గంచాలనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా ఈ టికెట్లను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికులు ఈ రాయితీ పథకాలను వినియోగించుకుని సంస్థను ఆదరించాలని కోరారు. టి9-30 టికెట్ కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. 

‘టి9-30టికెట్’ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)లు పీవీ ముని శేఖర్, పురుషోత్తం, కృష్ణ కాంత్, సీటీఎం జీవన్ ప్ర‌సాద్‌, చీఫ్ మేనేజర్ ప్రాజెక్ట్స్ విజయ్ కుమార్, సీఎంఈ రఘునాథరావు, సీఈఐటీ రాజశేఖర్ లతో పాటు వర్చువల్ గా ఈడీలు, ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్ఎంలు, డీఎంలు పాల్గొన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Trainee IPS Uday Krishna Reddy Remand: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Lafoot Gang Producer : 2 కోట్ల గోల్డ్ స్కామ్ - టాలీవుడ్ నిర్మాత అరెస్ట్... 14 రోజుల రిమాండ్
2 కోట్ల గోల్డ్ స్కామ్ - టాలీవుడ్ నిర్మాత అరెస్ట్... 14 రోజుల రిమాండ్

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Bhuma Akhila Priya: అహోబిలం వివాదంపై అఖిలప్రియకు పల్లా వార్నింగ్ - పార్టీ వ్యవహారాల్లో భర్త జోక్యం ఉండకూడదని ఆదేశాలు!
అహోబిలం వివాదంపై అఖిలప్రియకు పల్లా వార్నింగ్ - పార్టీ వ్యవహారాల్లో భర్త జోక్యం ఉండకూడదని ఆదేశాలు!
Amaravati Mega Metropolitan Region: అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
Shubman Gill Reclaims No1 ODI Rank: వన్డేల్లో నంబర్ వన్ ను తిరిగి దక్కించుకున్న‌ గిల్.. భారీగా జంప్ చేసిన‌ వైభవ్ సూర్యవంశీ 
వన్డేల్లో నంబర్ వన్ ను తిరిగి దక్కించుకున్న‌ గిల్.. Rankingsలో భారీగా జంప్ చేసిన‌ వైభవ్ సూర్యవంశీ 
Srinivasa Mangapuram Twitter Review - శ్రీనివాస మంగాపురం ట్విట్టర్ రివ్యూ: మహేష్ అన్న కొడుక్కి మొదటి సినిమాతో ఫ్లాప్ తప్పదా?
శ్రీనివాస మంగాపురం ట్విట్టర్ రివ్యూ: మహేష్ అన్న కొడుక్కి మొదటి సినిమాతో ఫ్లాప్ తప్పదా?
Embed widget