అన్వేషించండి

Gaddar Daughter: 'కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధం' - నాన్న ఆశయం నెరవేర్చేందుకు పాటు పడతానన్న గద్దర్ కుమార్తె

Gaddar Daughter: కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే వచ్చే ఎన్నికల్లో తాను కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తానని ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల అన్నారు. తండ్రి ఆశయ సాధన కోసమే ఈ నిర్ణయమని వెల్లడించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల ప్రకటించారు. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగానే ఎన్నికల బరిలో నిలవనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. 'కాంగ్రెస్ అవకాశం ఇస్తే కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తాను. టికెట్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ కోసం పని చేస్తాను. ఎన్నికల్లో పోటీ చేసేందుకు మేం సిద్ధం. కొన్ని రోజులుగా మీడియాలో మా పేరు వస్తోంది. కంటోన్మెంట్ సీటు ఇస్తే అక్కడి కాంగ్రెస్ నాయకులను కలుపుకొని పని చేస్తా. నాన్న గద్దర్ చివర్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. ఆయన ఆశయాలు నెరవేర్చేందుకే రాజకీయాల్లోకి వస్తున్నా.' అని తెలిపారు.

కాంగ్రెస్ నుంచే ఎందుకు.?

కాంగ్రెస్ నుంచే ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నాననేది వెన్నెల స్పష్టం చేశారు. తన తండ్రి గద్దర్ ను కాంగ్రెస్ చేరదీసిందని, అండగా ఉంటామని చెప్పిందని, అందుకే ఈ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని ఆమె చెప్పారు. సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని, రాహుల్ గాంధీ పేదలను అక్కున చేర్చుకుంటున్నారని అన్నారు. గద్దర్ జీవితాంతం సమ సమాజం కోసం తపన పడ్డారని, భారత రాజ్యాంగం అమలు పరచాలని కోరుకునే వారని చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తితో పని చేస్తామని కాంగ్రెస్ అంటోందని, అందుకే ఆ పార్టీ నుంచే బరిలో నిలవాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

గద్దర్ త్యాగాల మేరకు తమ కుటుంబానికి కాంగ్రెస్ టికెట్ ఇస్తుందని భావిస్తున్నామని వెన్నెల ఆశాభావం వ్యక్తం చేశారు. గత 10 రోజులుగా కంటోన్మెంట్లో పని చేస్తున్నానని, అయినా కాంగ్రెస్ లో తనకు సభ్యత్వం లేదని, కానీ కాంగ్రెస్ సానుభూతి పరులమని చెప్పారు. కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఓకే, లేకుంటే టికెట్ ఇవ్వకపోయినా ఎన్నికల్లో నిలవాలని భావిస్తున్నట్లు చెప్పారు. 

గద్దర్ భార్య ఏమన్నారంటే.?

'కాంగ్రెస్ పార్టీ తన బిడ్డకు టికెట్ ఇస్తామని ఆలోచిస్తున్నట్లు మీడియాలో వస్తుంది. నా బిడ్డకు టికెట్ ఇస్తే ఆమె తరఫున ప్రచారం చేస్తా. వెన్నెలకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని కోరుతున్నా.' అని గద్దర్ భార్య విమల విజ్ఞప్తి చేశారు. మరి దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

 

 

 

 

టాప్ హెడ్ లైన్స్

Villa Orchids Security Failure: కౌకూర్ విల్లా ఆర్కిడ్స్ దారుణం - 5 ఏళ్ల అరేలియా హత్య - గేటెడ్ కమ్యూనిటీల భద్రత ఎంత?
కౌకూర్ విల్లా ఆర్కిడ్స్ దారుణం - 5 ఏళ్ల అరేలియా హత్య - గేటెడ్ కమ్యూనిటీల భద్రత ఎంత?
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Director Maruthi: రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Embed widget