అన్వేషించండి

FiR on Raghunandan Rao : బీఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు - రఘునందన్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదు

Telangana News : బీజేపీ నేత రఘునందన్ రావుపై ఎఫ్ఐఆర్‌ నమోదు అయింది. మెదక్ బీఆర్ఎస్ నేతలపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.

FIR has been registered against BJP Leader Raghunandan Rao :   మెదక్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదయింది. బీఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసు నమోదయింది. మాజీ మంత్రి హరీశ్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు. ఈ మేరకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని ఈసీ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
 
ఇటీవల సంగారెడ్డిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయ‌న.. తన పేరు తీస్తే గుడ్డలూడదీసి కొడతానంటూ మాజీ మంత్రి హరీష్‌, కొత్త ప్రభాకర్ రెడ్డి,  వెంకట్రామిరెడ్డిలనునుద్దేశించి కామెంట్ చేశారు. సంగారెడ్డి అంబేద్కర్ చౌరస్తాలో పండబెట్టి తొక్కుతానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికలయ్యేంత వరకు రఘునందన్ అనే పేరు తీయొద్దంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.   ఈ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు రఘునందన్‌ రావు. ప్రస్తుతం మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక కాంగ్రెస్‌ నుంచి నీలం మధు ముదిరాజ్‌, బీఆర్ఎస్ నుంచి మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నారు.


హరీశ్ రావుపై మళ్లీ విమర్శలు

ఫోన్​ ట్యాపింగ్​ కేసులో కేసీఆర్​ మొదటి ముద్దాయిగా, హరీశ్ రావును రెండో ముద్దాయిగా చేర్చాలంటూ మెదక్​ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన రావు డిమాండ్​ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్​ నేతలపై విమర్శలు గుప్పించారు. ఫోన్​ ట్యాపింగ్​లో దేవుడిని కూడా వదిలిపెట్టలేదన్నారు. యాదగిరి గుట్ట దేవాలయాన్ని కట్టడానికి బంగారం దుకాణదారులను భయపెట్టినట్లు అనిపిస్తుందని ఆరోపించారు.

 కాంగ్రెస్, బీఆర్​ఎస్​ అండర్ ​స్టాండింగ్​తో ఫోన్​ ట్యాపింగ్​ కేసు విచారణ చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్​లో మొదటి ముద్దాయి కేసీఆర్, రెండో ముద్దాయి హరీశ్​ రావు, మూడో ముద్దాయిగా వెంకట రామిరెడ్డి, నాలుగో ముద్దాయిగా కేటీఆర్ పేరు చేర్చాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో మూడున్నర కోట్లు పట్టుకున్నా, రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని ప్రశ్నించారు. వివేక్​ వెంకటస్వామి కూడా బాధితుడే కదా, మరి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని అడిగారు. ఎమ్మెల్సీ వెంకట రామిరెడ్డిని కొత్త వియ్యంకుడు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కాపాడుతున్నారా? అని ప్రశ్నించారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో స్టీఫెన్ రవీంద్ర చెప్పిన రూ.30 కోట్లు ఎక్కడికి పోయాయన్న ఆయన, రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారాన్ని పక్కన పెట్టి, మునుగోడు, దుబ్బాక ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారని నిలదీశారు.

టాప్ హెడ్ లైన్స్

SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
CM Revanth Reddy: హైదరాబాద్‌లో హ్యుందాయ్ ఆర్‌ అండ్ డీ కేంద్రం.. సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధులు భేటీ!
హైదరాబాద్‌లో హ్యుందాయ్ ఆర్‌ అండ్ డీ కేంద్రం.. సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధులు భేటీ!
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Embed widget