అన్వేషించండి

Etala Counter To KTR: సినిమా చూపించేది ప్రజలు - చూసేది బీఆర్ఎస్ నేతలు - కేటీఆర్‌కు ఈటల కౌంటర్

కేటీఆర్ పై ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే సినిమా చూపిస్తారన్నారు.


Etala Counter : బోయే ఎన్నికల్లో సినిమా చూపించేది ప్రజలని, సినిమా చూసేది మాత్రం బీఆర్ఎస్‌ పార్టీ నేతలని బీజేపీ నేత ఈటల రాజేందర్ మంత్రి కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. ఇది ట్రైలర్ మాత్రమేనని.. ప్రతిపక్షాలకు అసలు సినిమా ముందు ఉందని స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఈటల ఈ విధంగా సమాధానం ఇచ్చారు.  సినిమా అయినా, ట్రయల్ అయినా అది ప్రజలే చూపిస్తారని, నాయకులు కాదని అన్నారు. సినిమా చూపించేది ప్రజలైతే, చూడాల్సింది బీఆర్ఎస్ నాయకులు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌కు సినిమా చూపించబోతున్నారన్నారు. అందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉండాలని ఎద్దేవా చేశారు.          

 

 

కేసీఆర్  గారి ఏలుబడిలో గిరిజన, దళిత మహిళలకు రక్షణ లేకుండా పోయింది... అన్నిరంగాల్లో తెలంగాణ నంబర్ వన్ అని  బుకాయుస్తున్నారు ఈటల విమర్శించారు.  రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్లు భయపెట్టిస్తున్నాయని..  గిరిజన మహిళపై జరిగిన దాడి చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుందని ఆరోపించారు.  షీ టీమ్ పెట్టినం అని చెప్తున్నారు. అర్ధరాత్రి కూడా స్వేచ్చగా తిరగవచ్చు అని చెప్పారు. కానీ ఎల్ బి నగర్ లో కూతురు పెళ్లి కోసం వెళ్ళి వస్తున్న మహిళను పోలీసులే తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారన్నారు.   క్యారెక్టర్ లేని మహిళగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.  ఆమెను కొట్టిన తీరును తీవ్రంగా ఖండించారు.                

సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మహిళ మీద జరిగిన దౌర్జన్యం మీద సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  వత్ తెలంగాణ గమనిస్తోందని  చెప్పరానిచోట్ల కొట్టిన తీరుపై స్పందించాలన్నారు.  చిన్న ఉద్యోగుల మీద చర్యలు తీసుకొని చేతులు దులుపుకుంటే సరిపోదన్నారు.   మరియమ్మ అనే దళిత మహిళను యాదాద్రి భుమనగిరి జిల్లా  అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో కొట్టి చంపారని గుర్తు చేశారు.  దళిత, గిరిజన మహిళలపై జరుగుతున్న సంఘటనలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.  పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.  ప్రభుత్వం బేషరుతుగా క్షమాపణ చెప్పాలన్నారు.  కెసిఆర్ చేస్తున్న పనులని ప్రజలు మర్చిపోరు.. మర్లపడతారని హెచ్చరించారు. 

సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్ లో  దళితబంధు, డబుల్ బెడ్ రూం కోసం రోడ్డు ఎక్కుతున్నారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులను పెట్టీ అరెస్ట్ చేయించారు. పోలీసులతో ఎన్నాళ్ళు రాజ్యం నడిపిస్తారని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.                                       

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget