అన్వేషించండి

Bandi Sanjay: కేసీఆర్ ఎకరాకు కోటి సంపాదిస్తరట.. ఆ పంటనే వేస్తరేమో! బండి సంజయ్ ఎద్దేవా

వికారాబాద్ సమీపంలోని శివారెడ్డిపేటలో శనివారం మధ్యాహ్నం రైతులతో రచ్చబండ కార్యక్రమం జరిగింది. దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రి చంద్రశేఖర్ రచ్చబండలో పాల్గొన్నారు.

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఇవాల్టి యాత్రలో మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పాల్గొన్నారు. 8వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో వికారాబాద్ సమీపంలోని శివారెడ్డిపేటలో శనివారం మధ్యాహ్నం రైతులతో రచ్చబండ కార్యక్రమం జరిగింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రి చంద్రశేఖర్ రచ్చబండలో పాల్గొన్నారు. తొలుత రైతులు మాట్లాడుతూ వారి సమస్యలను విన్నవించుకున్నారు. అనంతరం బండి సంజయ్, దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడారు.

‘‘మీ ఆశీర్వాదంతో రైతు, పేదల ప్రభుత్వం రావాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నం. 2023లో మీ ఆశీస్సులతో బీజేపీ అధికారంలోకి వస్తం. పేదల ప్రభుత్వాన్ని తీసుకొస్తం. పేద ప్రజలకు అండగా ఉన్న వ్యక్తి దేవేంద్ర ఫడ్నవీస్. ఈ రోజు డబుల్ బెడ్రూం, రుణమాఫీ, ఫ్రీ యూరియా అని కేసీఆర్ కోతలు కోస్తున్నడు కానీ ఒక్కటి కూడా అమలు  చేయలేదు. కానీ ఫడ్నవీస్ మహారాష్ట్రలో అవన్నీ అమలు చేసిండ్రు. ఆయన నోటితో చెప్పిస్తే కేసీఆర్‌కు బుద్ది అయినా వస్తది అని ఇక్కడికి ఫడ్నవీస్ వచ్చిండు. ఈ సీఎం కేసీఆర్ రైతు బంధు తెచ్చి అన్ని సబ్సిడీలు బంద్ చేసిండు. బ్యాంకులో వేసుకున్న సొమ్మును కూడా బ్యాంకోళ్లు లాక్కుంటుంటే రైతులు హరిగోస పడుతున్నా పట్టించుకోవడం లేదు.
Bandi Sanjay: కేసీఆర్ ఎకరాకు కోటి సంపాదిస్తరట.. ఆ పంటనే వేస్తరేమో! బండి సంజయ్ ఎద్దేవా

కేసీఆర్ ఏం పండిస్తున్నడో..
వందలాది ఎకరాల ఫాంహౌజ్ కేసీఆర్‌కు ఉంది. ఎకరాకు కోటి రూపాయలు సంపాదిస్తుండట. మరి ఏం పండిస్తుండో.. గంజాయి గిట్ల పండిస్తున్నడేమో.. ఆయన ఫాంహౌజ్‌లో సాయిల్ టెస్ట్ చేసుకుంటడు. దొడ్డు వడ్లు పండిస్తడు. రైతులు మాత్రం సన్న వడ్లు పండించాలని చెప్తడు. పండించిన పంటను మీ దగ్గరే అమ్మి మీ ఇంటికే డబ్బులు పంపిస్తామని చెప్పిన కేసీఆర్.. అవేమీ చేయలేదు. దీంతో రైతులు ధాన్యం అమ్ముకోలేక, కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడి నానా గోస పడుతున్నరు.

కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం తెచ్చింది. కౌలు సహా ప్రతి రైతు ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తోంది. మరి కేసీఆర్ కౌలు రైతులకు ఎందుకు రైతు బంధును అమలు చేయడం లేదు? కేంద్ర ప్రభుత్వం రైతులకు ఈ ప్రాంతంలో 1,30,895 మందికి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రూ.244 కోట్ల నిధులిచ్చింది. ధరణి యాప్ కూడా ఫెద్ద స్కాం. ఎవరి పట్టా ఎవరి స్థలం ఎవరి పేరు మీద ఉందో అంతా గందరగోళం. 

మహారాష్ట్రలో 70 వేల ఇళ్లు
ఓ పెద్దాయన ప్రాణహిత- చేవెళ్ల డిజైన్ పేరిట మీద కాల్వలు తవ్వి డబ్బులు దొబ్బుకుపోయిండు. ఈయన వచ్చిన రీ డిజైన్ పేరు మీద అంచనాలు పెంచి కోట్లు దండుకున్నడు తప్ప ఈ ప్రాంతానికి నీళ్లు మాత్రం రాలేదు. అందరూ కలిసి ఈ ప్రాంత ప్రజల నోట్లో మట్టి కొట్టిండ్రు. నిలువనీడలేని పేదలకు ఇల్లు కావాలని మనం అడుగుతుంటే. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానని చెప్పి 7 ఏండ్ల నుండి ఊరిస్తుండే తప్ప చేసిందేమీ లేదు. కానీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఒకేసారి 70 వేల ఇండ్లు మహారాష్ట్రలో నిర్మించి పేదలకు అందజేసి ఆదర్శంగా నిలిచారు.’’ అని బండి సంజయ్ అన్నారు.
Bandi Sanjay: కేసీఆర్ ఎకరాకు కోటి సంపాదిస్తరట.. ఆ పంటనే వేస్తరేమో! బండి సంజయ్ ఎద్దేవా

ఈ పాద యాత్ర మార్పు తెస్తుంది: దేవేంద్ర ఫడ్నవీస్
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘‘బండి సంజయ్ చేపడుతున్న యాత్ర తెలంగాణలో మార్పు తెచ్చే యాత్ర. కేవలం తన కుటుంబం కోసమే మీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నరు. బండి సంజయ్ మాత్రం రైతుల మధ్య కూర్చుని రైతుల కష్టాలు తెలుసుకుంటున్నరు. కేసీఆర్ ఎప్పుడైనా రైతులతో కూర్చున్నరా? మీరే ఒకసారి ఆలోచించండి. సీఎం ఫాంహౌజ్‌లో కూర్చుని పథకాలను రచించి ఏ విధంగా దోపిడీ చేయాలో ప్రణాళిక రూపొందించి దోచుకుంటున్నరు. ఈ సీఎం అనేక సబ్సిడీలను నిలిపేశారు. ధరణిని అమలు చేయడం లేదు. రుణమాఫీ పూర్తిగా అమలు లేదు.


రైతుల సర్కార్, ప్రజా స్వామిక సర్కార్ రావాలంటే బండి సంజయ్ పాదయాత్రను ఆశీర్వదించాలని కోరుతున్నా. పోరాటం ప్రారంభమైంది. అందులో భాగంగా బండి సంజయ్‌కు మీ ఆశీర్వాదం అందించాలని కోరుతున్నా.’’ అని ఫడ్నవీస్ అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget