అన్వేషించండి

Dasoju In TRS : దాసోజు శ్రవణ్ మరోసారి జంపింగ్ - ఈ సారి టీఆర్ఎస్‌లోకి !

రెండు నెలల కిందట కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్ మరోసారి పార్టీ మారుతున్నారు. ఈ సారి తన పాత పార్టీ టీఆర్ఎస్‌ గూటికి చేరుతున్నారు.

Dasoju In TRS :  తెలంగాణ రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. మునుగోడు ఉపఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్‌ చేపట్టింది. కొంత మంది నేతలు టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరితే... ఆ పార్టీ నుంచి అంత కంటే ఎక్కువ మంది నేతల్ని టీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు ప్రణాళిక అమలు చేస్తున్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ కు పార్టీ కండువా కప్పిన కే్టీఆర్... ఇవాళ సాయంత్రం మరో బీజేపీ కీలక నేత దాసోజు శ్రవణ్‌కు టీఆర్ఎస్ తీర్థం ఇవ్వనున్నారు. దాసోజు శ్రవణ్ బీజేపీలో చేరి రెండు నెలలు కూడా కాలేదు. ఆగస్టు మొదటి వారంలోనే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరారు. అక్కడ సర్దుకోలేకపోయరో.. లేకపోతే.. టీఆర్ఎస్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చిందో కానీ రెండు నెలల్లోనే పార్టీ మారిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాజీనామా లేఖ పంపారు.  కేటీఆర్‌ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరనున్నారు.

మునుగోడులో డబ్బులతో బీజేపీ గెలవాలనుకుంటోందన్న శ్రవణ్ 

రాజీనామా లేఖలో దాసోజు శ్రవణ్ బీజేపీ నాయకత్వపై విమర్శలు చేశారు. దశ దిశ లేని నాయకత్వంతో..  మునుగోడులో డబ్బుల సాయంతో గెలవాలనుకుంటున్నారని విమర్శించారు. నిర్మాణాత్మక రాజకీయాలు లేని బీజేపీ వల్ల తెలంగాణకు ఒరిగేదం లేదని నిరసనగా రాజీనామా చేస్తున్నానని బండి సంజయ్‌కు రాసిన లేఖలో దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.
Dasoju In TRS : దాసోజు శ్రవణ్ మరోసారి జంపింగ్ - ఈ సారి టీఆర్ఎస్‌లోకి !

నేరుగా పార్టీలో చేరికల కోసం బీసీ నేతలుక ఫోన్లు చేస్తున్న కేసీఆర్ 

మునుగోడులో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండటం.. బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడంతో స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగినట్లుగా చెబుతున్నారు. ఆయన బీజేపీలోని సీనియర్ బీసీ నేతలు ముఖ్యంగా ఉద్యమ నేపధ్యం ఉన్న వారికి ప్రత్యేకంగా ఫోన్లు చేసి టీఆర్ఎస్‌లో చేరాలని ఆహ్వానిస్తున్నారని అంటున్నారు. స్వామిగౌడ్, విఠల్ వంటి ఉద్యమకారులతోనూ కేసీఆర్ మాట్లాడారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దాసోజు శ్రవణ్ .. వెంటనే టీఆర్ఎస్‌లో చేరేందుకు అంగీకరించారు. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన దాసోజు శ్రవణ్.. ఉద్యమ సమయంలో చిరంజీవి సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్‌లో ఆయనకు సీటు ఇవ్వకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

గతంలో టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వలేదని  రాజీనామా  చేసి మళ్లీ అదే పార్టీలోకి శ్రవణ్ 

కాంగ్రెస్ పార్టీలో కొంత  కాలం ఉన్న ఆయన.. ఖైరతాబాద్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ పరాజయం  పాలయ్యారు. మంచి వాగ్దాటి ఉన్న ఆయనకు జాతీయ అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు. అయితే రేవంత్ రెడ్డి టీ పీసీసీ చీఫ్ అయిన తర్వాత తనను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తితో రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కానీ రెండు నెలలు గడిచినా ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. మునుగోడులో బాధ్యతలు కూడా ఇవ్వలేదు. ఇదే సమయంలో ఆయనకు టీఆర్ఎస్ అధినేత నుంచి పిలుపు వచ్చింది. దీంతో టీఆర్ఎస్‌లో చేరిపోవాలని నిర్ణయించుకున్నారు.  బీజేపీలో చేరినప్పటికీ ప్రాధాన్యత లేని భావిస్తున్న స్వామిగౌడ్, విఠల్ వంటివారితోనూ నేరుగా కేసీఆర్ మాట్లాడటంతో వారు కూడా  పార్టీలో మళ్లీ చేరే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

KTR Complaints to Rahul Gandhi: రేవంత్‌పై రాహుల్‌కు కేటీఆర్ వరుస ఫిర్యాదులు - చర్యలు తీసుకోరని తెలిసీ బిఆర్ఎస్ వేస్తున్న మైండ్ గేమ్ ఏంటి?
రేవంత్‌పై రాహుల్‌కు కేటీఆర్ వరుస ఫిర్యాదులు - చర్యలు తీసుకోరని తెలిసీ బిఆర్ఎస్ వేస్తున్న మైండ్ గేమ్ ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Congress MLA Viral Video: చేయి పట్టుకుని, నడుము టచ్ చేసి.. విద్యార్థినితో ఎమ్మెల్యే అసభ్య ప్రవర్తనపై దుమారం!
చేయి పట్టుకుని, నడుము టచ్ చేసి.. విద్యార్థినితో ఎమ్మెల్యే అసభ్య ప్రవర్తనపై దుమారం!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
Embed widget