అన్వేషించండి

Congress Protest: ఇంటి గేటు దూకబోయిన రేవంత్‌- అరెస్టుతో కాసేపు హైటెన్షన్!

Congress Protest: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను ధర్నా చౌక్ వద్దకు వెళ్లి ధర్నా చేయకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటి వద్ద టెన్షన్ ఉద్రిక్త నెలకొంది. 

Congress Protest: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ధర్నా చేపట్టేందుకు వెళ్తున్న ఆయనను ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టగానే పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లోంచి అడుగు బయట పెట్టగానే ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు. అసలు ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ పోలీసులను నిలదీశారు. మీకు అంతగా అభ్యంతరం ఉంటే ధర్నాచౌక్ వద్దకు వెళ్లాక అరెస్ట్ చేయాలని సూచించారు. 

సర్పంచుల నిధుల విడుదల, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై టీపీసీసీ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. అయితే ఈ రోజు ఇందిరా పార్కు వద్ద జరగాల్సిన ధర్నాకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అయినప్పటికీ తాము ధర్నా చేస్తామని కాంగ్రెస్ నేతలు తెగేసి చెప్పడంతో.. ఈరోజు ఉదయం నుంచి కాంగ్రెస్ ముఖ్య నేతలను బయటకు రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. వారి ఇళ్ల వద్దకు వెళ్లి భారీ సిబ్బందితో పహారా కాశారు. చాలా మందిని గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలోనే ఉదయం నుంచి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. ముందుగా బయటకు వెళ్లే పరిస్థితి లేదని భావించిన రేవంత్ రెడ్డి చాలా సేపు ఇంట్లోనే ఉండిపోయారు. చివరకు బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. పోలీసుల నిర్బంధాన్ని కాదని గేటు దూకి బయటకు రాబోయారు. అయినా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు.  

ఉదయం నుంచీ కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధాలు..

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు. సర్పంచుల నిధుల సమస్యలపై హైదరాబాద్ లోని ధర్నా చౌక్ చేపట్టే ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ.. కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహిస్తామని చెప్పారు. దీంతో పోలీసులు నేతలను ఎక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్‌ సీనియర్ నేత వి. హనుమంతరావు, కిసాన్ కాంగ్రెస్ జాతీయ నాయకులు కోదండరెడ్డి తదితరులను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల వాహనాలు, వ్యాన్లను సిద్ధం చేసుకొని నేతల ఇంటి దగ్గర భారీ సిబ్బందితో పోలీసులు పహారా కాస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Rains: తెలంగాణలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు.. ఏపీలో 124 మండలాల్లో వడగాల్పులు
తెలంగాణలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు.. ఏపీలో 124 మండలాల్లో వడగాల్పులు
Karimnagar Robbery: కరీంనగర్‌లో పట్టపగలే దోపిడీ.. జ్యువెలరీ షాపులో కాల్పులు జరిపి బంగారం ఎత్తుకెళ్లిన గ్యాంగ్
కరీంనగర్‌లో పట్టపగలే దోపిడీ.. జ్యువెలరీ షాపులో కాల్పులు జరిపి బంగారం ఎత్తుకెళ్లిన గ్యాంగ్
Hyderabad Viral Video: బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
Telangana Cabinet Expansion: తెలంగాణ కేబినెట్ విస్తరణకు మరింత సమయం! రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా? రేసులో ఉన్నదెవరు?
తెలంగాణ కేబినెట్ విస్తరణకు మరింత సమయం! రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా? రేసులో ఉన్నదెవరు?

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akividu Rama Temple: ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
Hyderabad Viral Video: బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
US Iran Tension: అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
Bandla Ganesh Daughter Engagement : బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుక - టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల సందడి
బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుక - టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల సందడి
Beer in Summer : వేసవిలో బీర్ తాగితే నిజంగా కూల్ అవుతారా? సైడ్ ఎఫెక్ట్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
వేసవిలో బీర్ తాగితే నిజంగా కూల్ అవుతారా? సైడ్ ఎఫెక్ట్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Telangana Cabinet Expansion: తెలంగాణ కేబినెట్ విస్తరణకు మరింత సమయం! రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా? రేసులో ఉన్నదెవరు?
తెలంగాణ కేబినెట్ విస్తరణకు మరింత సమయం! రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా? రేసులో ఉన్నదెవరు?
Mumbai Indians Major Record: ఓడినా రికార్డులు సృష్టించిన ముంబై ఇండియన్స్‌.. టీ20 చరిత్రలో తొలిసారి..
ఓడినా రికార్డులు సృష్టించిన ముంబై ఇండియన్స్‌.. టీ20 చరిత్రలో తొలిసారి..
This Week Theatrical Releases : మెగా కోడలి సతీ లీలావతి To స్పిరిట్ - ప్రభాస్, సందీప్ వంగా మూవీ కాదు... ఈ వారం థియేటర్లలో సినిమాలివే!
మెగా కోడలి సతీ లీలావతి To స్పిరిట్ - ప్రభాస్, సందీప్ వంగా మూవీ కాదు... ఈ వారం థియేటర్లలో సినిమాలివే!
Embed widget