అన్వేషించండి

Telangana BJP: ముగ్గురు ఫైర్ బ్రాండ్ నేతల పోటీ - బీజేపీ వ్యూహం ఇదేనా?

Telangana BJP: కొత్త, పాత నేతల కలయిక బీజేపీ సరికొత్త వ్యూహంతో రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ అభ్యర్థుల జాబితాలో ముగ్గురు ఫైర్ బ్రాండ్ నేతలను బరిలోకి దించింది.

Telangana BJP: కొత్త, పాత నేతల కలయిక బీజేపీ సరికొత్త వ్యూహంతో రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రధాన నేతలు, కీలక నాయకులు, ముఖ్యుల్లో దాదాపు అందరినీ బరిలో దింపాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ముగ్గురు ఫైర్ బ్రాండ్ నేతలను బరిలోకి దించింది. 52 మందితో బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈసారి రాజకీయ పోరు రసవత్తరంగా సాగనుంది. బీజేపీ ముగ్గురు ఫైర్ బ్రాండ్ నేతలు ఇక్కడి నుంచే పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌.. ఈసారి సీఎం కేసీఆర్ పై గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా నుంచి బండి సంజయ్, ఈటల రాజేందర్.. జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్‌ బరిలో నిలుస్తుండటంతో అందరి కళ్లూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైపే ఉన్నాయి.

ఈటల పట్టు

హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తాను చేసిన ప్రకటనకు అనుకూలంగానే బీజేపీ జాతీయ నాయకత్వాన్ని ఒప్పించినట్టుగా స్పష్టం అవుతోంది. మొదటి నుంచి తాను ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీ చేస్తానంటూ ప్రకటిస్తూ వచ్చారు. ఇటీవల హుజూరాబాద్ లో పర్యటించినప్పుడు కూడా తాను రెండు చోట్లా పోటీ చేస్తానని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగానే బీజేపీ విడుదల చేసిన జాబితాలో ఈటల రాజేందర్‌ను హుజూరాబాద్, గజ్వేల్‌లలో అభ్యర్థిగా ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

గట్టి పోటీ

సీఎం కేసీఆర్ పై గజ్వేల్ నుంచి ఈటల పోటీ చేయనుండడంతో ఇక్కడ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు కేసీఆర్ వెన్నంటి ఉన్న ఈటల రాజేందర్ ఇప్పుడు ఆయనపైనే పోటీ చేస్తుండడంతో ఫలితం ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ అందిరిలోనూ నెలకొంది. గజ్వేల్‌తో పాటు సిరిసిల్ల కూడా ప్రాధాన్యత సంతరించున్న నియోజకవర్గాల్లో ఒకటి. ఇక్కడి నుంచి రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ పోటీ చేస్తుండడంతో ఆయనపై బీజేపీ తరఫున రాణి రుద్రమ పోటీ చేస్తున్నారు. దీంతో ఇక్కడి ఫలితంపైనా అందరూ ఆసక్తి చూపుతున్నారు.

బీజేపీ ఫైర్ బ్రాండ్‌లుగా ముద్రపడ్డ ఇద్దరు ముఖ్య నేతలు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే పోటీ చేస్తుండడం విశేషం. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. కరీంనగర్ నుంచి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి పోటీ చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నాయకుల్లో ఈ ఇద్దరు ఎంపీలు ప్రత్యర్థి పార్టీల నాయకులపై విమర్శనాస్త్రాలు సంధించే తీరుతో ఫైర్ బ్రాండ్లుగా పేరు తెచ్చుకున్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ఎన్నికల్లో పార్టీల కీలక నేతల మధ్య కొన్ని స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Telangana Congress Rift: కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Embed widget