అన్వేషించండి

Common Mobility Card: త్వరలోనే కామన్ మొబిలిటీ కార్డు అందుబాటులోకి, అన్ని ప్రయాణాలకు ఒకటే కార్డు

Common Mobility Card: ప్రజలకు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు కామన్ మొబిలిటీ కార్డును త్వరలోనే అందుబాటులోకి తేబోతున్నారు. ఆటో నుంచి మెట్రో రైలు వరకు ఎందులో వెళ్లినా ఈ కార్డు ఉపయోగించుకోవచ్చు. 

Common Mobility Card: ప్రజలకు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ సర్కారు సరికొత్త దిశగా అడుగులు వేస్తోంది. కామన్ మొబిలిటీ కార్డును అందుబాటులోకి తెచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. అయితే త్వరలోనే నేషనల్ కామన్ మొబలిటీ కార్డును ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగర ప్రజా రవాణా వ్యవస్థలో ఇది ఓ పెద్ద ముందడుగు కాబోతుంది. ఆర్టీసీ బస్సు నుంచి ఆటోల వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించడానికి వీలుగా ఈ కార్డు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ప్రధానమైన ప్రజా రవాణా మార్గాలుగా ఉన్న మెట్రో రైల్, ఆర్టీసీ బస్సులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడుకునేందుకు వీలుండే విధంగా ఈ కార్డు ఉండనుంది. ముఖ్యంగా ఈ కార్డు ద్వారా ప్రయాణించడం మాత్రమే కాకుండా షాపింగ్ కూడా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ కంపెనీ పూర్తి చేయబోతుంది. స్టేషన్లలో ఇప్పటికే కార్డు రీడర్లను కూడాఏర్పాటు చేశారు.

మొదట మెట్రో రైల్ , ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి వీలుగా ఈ కార్డుని జారీ చేస్తామని, ఇదే కార్డుతో సమీప భవిష్యత్తులో ఎంఎంటీఎస్, క్యాబ్ సేవలు, ఆటోలను కూడా వినియోగించుకునే విధంగా విస్తరిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇదే కార్డుతో భవిష్యత్తులో పౌరులు తమ ఇతర కార్డుల మాదిరే కొనుగోళ్లకు కూడా వినియోగించేలా వన్ కార్డ్ ఫర్ అల్ నీడ్స్ మాదిరి ఉండేలా చూస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా హైదరాబాద్ నగరం వరకు ఈ కార్డు జారీ ఉంటుందని అన్నారు. అలాగే త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా ఈ కార్డు సేవలు అందించేలా విస్తరించాలని ప్రభుత్వ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్డు కలిగిన పౌరులు దేశవ్యాప్తంగా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు వినియోగించేందుకు అవకాశం ఉన్న ప్రతి చోట వాడుకునే అవకాశం ఉంటుందని వివరించారు. 

సర్కారు త్వరలోనే అందజేయబోతున్న ఈ కార్డు వలన ఇతర మెట్రో నగరాలకు వెళ్లినప్పుడు అక్కడి ఆర్టీసీ బస్సులు లేదా మెట్రో రైల్ ఇతర ప్రజా రవాణా వ్యవస్థను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడుకునేందుకు వీలు కలుగుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్డును ప్రయోగాత్మకంగా మరికొన్ని రోజుల్లోనే నగర పౌరులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేయాలని చూస్తున్నారు. ఇందుకు సంబంధించి మెట్రో రైల్ మరియు ఆర్టీసీ సంస్థ అధికారులు సమన్వయంతో వేగంగా ముందుకు పోవాలని సూచించారు.  తెలంగాణ ప్రభుత్వం జారీ చేయనున్న ఈ కామన్ మొబిలిటీ కార్డుకి ఒక పేరును సూచించాలని కోరారు. ఇందుకు సంబంధించిన ఇటీవలే తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయంలో ఓ సమావేశం జరిగింది. ఇందులో ఆర్టీసీ, మెట్రో రైల్ సంస్థల ఉన్నతాధికారులు ఈ కార్డుకు సంబంధించిన పలు వివరాలను అందించారు. ఈ కార్డు జారీ ప్రక్రియ నుంచి మొదలుకొని వివిధ ప్రాంతాల్లో దాని ఉపయోగం వరకు నగర ప్రజలకు అందుబాటులో ఉండే సేవల వివరాలను అధికారులు మంత్రులకు తెలియజేశారు.

 

టాప్ హెడ్ లైన్స్

భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
Breaking News: భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
Embed widget