అన్వేషించండి

CM Revanth Reddy: హైదరాబాద్‌తో సమానంగా వరంగల్ అభివృద్ధి, 2050 మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

Telangana News: హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. వరంగల్ లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో  పర్యటిస్తున్నారు. హెలికాప్టర్‌లో గీసుకొండ మండలం శాయంపేటకు చేరుకున్న రేవంత్ రెడ్డికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి టెక్స్‌టైల్‌ పార్క్‌ నిర్మాణ పురోగతిని పరిశీలించారు. పార్క్ నిర్మాణం ఎక్కడి దాకా వచ్చిందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పనుల పై మంత్రులు, అధికారులకు సూచనలు చేశారు.

వనమహోత్సవంలో భాగంగా మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఆవరణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, అధికారులు మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. టెక్స్‌టైల్ పార్క్‌ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్‌గా అభివృద్ధి చేస్తామన్నారు.  టెక్స్‌టైల్‌ పార్క్ కోసం భూములు ఇచ్చిన వారికి ఇందిరమ్మ ఇళ్లు కట్టించేందుకు కృషి చేస్తామన్నారు. టెక్స్‌టైల్‌ పార్కు సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపడుతామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు.

గ్రేటర్‌ వరంగల్‌ అభివృద్ధి పనులపై సమీక్ష  
కలెక్టరేట్‌లో ప్లాంటేషన్‌తో పాటు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభిస్తామన్నారు.. తర్వాత  గ్రేటర్‌ వరంగల్‌ అభివృద్ధి పనులపై హనుమకొండ కలెక్టరేట్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. స్మార్ట్‌సిటీ పథకంలో భాగంగా చేపట్టినవి, ప్రగతిలో ఉన్నవి,  చేపట్టాల్సిన పనులపై రివ్యూ చేస్తారని తెలిపారు. సమీక్షలో ముఖ్యంగా వరంగల్‌ పాత మాస్టర్‌ప్లాన్‌ను మార్చాల్సిన అవసరం ఉందని, వరంగల్ సమగ్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ 2050ని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలో భూగర్భ డ్రైనేజీ, స్మార్ట్‌ సిటీ పథకంపై అధికారులకు పలు సూచనలు చేశారు. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, కాళోజీ కళాక్షేత్రం నిర్మాణంపై కూడా పలు సూచనలు చేశారు.  అంతే కాకుండా హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ను అభివృద్ధి చేయాలన్నారు.  హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 

నాలాల ఆక్రమణపై దృష్టి పెట్టాలి
ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.  భూసేకరణకు అవసరమయ్యే నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు. నేషనల్ హైవే నుంచి నేషనల్ హైవేకు కనెక్ట్ అయ్యేలా ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి టెక్స్‌టైల్ పార్కుకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డుమార్గం ఉండేలా చూడాలని సూచించారు.  స్మార్ట్ సిటీ మిషన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.  డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.  వరంగల్ నగర అభివృద్ధిపై ఇకనుంచి ప్రతీ 20రోజులకోసారి ఇన్ చార్జి మంత్రి సమీక్ష నిర్వహించాలని సీఎం ఆదేశించారు. నగర అభివృద్ధికి సంబంధించి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్లో డంపింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Hyderabad Crime News: ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
Jupally Krishna Rao: ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
Telangana Breakfast Scheme: ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా
ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
Garuda vs Lord Yama: బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
Maa Inti Bangaram Deleted Scenes : మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Mollywood Times OTT : సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
LPG Tanker Explosion: టోల్ గేట్‌ను ఢీకొట్టి పేలిపోయిన భారీ ఎల్పీజీ ట్యాంకర్ - ఈ వీడియో చూస్తే వణికిపోవాల్సిందే !
టోల్ గేట్‌ను ఢీకొట్టి పేలిపోయిన భారీ ఎల్పీజీ ట్యాంకర్ - ఈ వీడియో చూస్తే వణికిపోవాల్సిందే !
Embed widget