అన్వేషించండి

Palamuru Rangareddy: పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్‌కు ముహుర్తం ఖరారు, కేసీఆర్ చేతుల మీదుగా

వెట్‌ రన్‌లో భాగంగా 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న నార్లాపూర్‌ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోయనున్నారు.

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు ఎత్తిపోతల వెట్ రన్ కు ముహూర్తం ఖరారు అయింది. ప్రపంచంలోనే భారీ పంపులతో ఈ ఎత్తిపోతలను నిర్మించినట్లుగా ప్రభుత్వం చెబుతోంది. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల డ్రైన్‌ను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. ఈ క్రమంలో తాజాగా వెట్‌ రన్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 16న వెట్‌ రన్‌ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నార్లాపూర్‌ ఇన్‌టేక్‌ వద్ద స్విచ్ ఆన్‌ చేసి వెట్ రన్ ప్రారంభం చేయనున్నారు. 

వెట్‌ రన్‌లో భాగంగా 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న నార్లాపూర్‌ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోయనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కృష్ణా నదికి పూజలు చేస్తారు. వెట్‌ రన్‌ జరిగిన అనంతరం అక్కడే భారీ బహిరంగంగా నిర్వహించనున్నారు. ఈ సభలో సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టు గురించి, దానివల్లే లాభాల గురించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.ఎత్తిపోతల కృష్ణమ్మ జలాలను కలశాలతో ప్రతి గ్రామానికి తీసుకెళ్లి ఈ నెల 17న ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రతి గ్రామంలో దేవుళ్ల పాదాలకు అభిషేకం చేయనున్నారు.

దక్షిణ తెలంగాణకు పండుగ రోజు : సీఎం కేసీఆర్‌

పర్యావరణ అనుమతులతో పాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో దక్షిణ తెలంగాణలోని పల్లెపల్లెకు తాగునీరు, సాగునీరు అందనుందని, బంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానుందని సీఎం పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అడ్డంకులు తొలిగి కొలిక్కి వచ్చినందుకు గ్రామాల్లోని దేవాలయాల్లో స్వామివారి పాదాలను పాలమూరు జలాలతో అభిషేకం చేసి మన మొక్కులు చెల్లించుకుందామంటూ సీఎం కేసీఆర్‌ పిలుపు ఇచ్చారు. ఎన్నో మొక్కులు మొక్కితే, దైవకృపతో, ఇంజినీర్ల కృషితో, పాలమూరు ఎత్తిపోతల పథకం అడ్డంకులు అధిగమించి సాకారమైందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన స్ఫూర్తితో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలని, పట్టుదలతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను కొలిక్కి తేవడానికి జరిగిన కృషి లో కీలక పాత్ర పోషించిన సీఎంఓ అధికారులకు, ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలిపారు. 

టాప్ హెడ్ లైన్స్

Prakash Goud Son Santosh Goud Allegations: రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఇంట్లో ప్రేమ చిచ్చు - తండ్రి ప్రకాష్ గౌడ్‌పై కుమారుడు సంచలన ఆరోపణలు
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఇంట్లో ప్రేమ చిచ్చు - తండ్రి ప్రకాష్ గౌడ్‌పై కుమారుడు సంచలన ఆరోపణలు
Medaram Latest News: మేడారం వనదేవతల గద్దెల వద్ద జువ్వి చెట్టు పునఃదర్శనం!
మేడారం వనదేవతల గద్దెల వద్ద జువ్వి చెట్టు పునఃదర్శనం!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Telangana Graduate MLC Elections: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Embed widget