అన్వేషించండి

'సిద్ధిపేట రుణం తీర్చుకోలేను' - ఈ గడ్డతో అనుబంధమే సీఎంగా గెలిపించిందన్న కేసీఆర్

సిద్ధిపేట అందించిన బలంతోనే తాను తెలంగాణ సీఎం స్థాయికి ఎదిగినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ గడ్డ రుణాన్ని తాను ఎన్నటికీ తీర్చుకోలేనని చెప్పారు.

సిద్ధిపేట స్ఫూర్తితోనే తాను ముందుకు సాగుతున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ గడ్డతో అనుబంధమే తనను తెలంగాణ సీఎం అయ్యేంత ఎత్తుకు తీసుకెళ్లిందని చెప్పారు. సిద్ధిపేటలోని ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఇవాళ తెలంగాణ దేశమే ఆశ్చర్యపోయేలా అభివృద్ధి సాధించిందని, అలా పాలన సాగిస్తున్నామంటే అది సిద్ధిపేట గడ్డ తనకు అందించిన బలమేనని అన్నారు. ప్రతి సందర్భంలోనూ తనను విజేతగా నిలబెట్టిన ఈ గడ్డ రుణం ఎన్నటికీ తీర్చుకోలేనని చెప్పారు.

సిద్ధిపేట అందించిన స్ఫూర్తే 

దేశమే ఆశ్చర్యపోయేలా  తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నానంటే అది సిద్ధిపేట అందించిన స్పూర్తే అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ గడ్డ నాకు అందించిన బలమే తనను నడిపిస్తుందని, ఈ ఊరి పేరు వింటే నా జన్మభూమి గొప్పదనే భావన కలుగుతుందని అన్నారు. 'ఈ గడ్డ నన్ను పెంచి పెద్ద చేసింది. చదువు చెప్పింది. రాజకీయంగా నాకు జన్మనిచ్చింది. నన్ను తెలంగాణ ముఖ్యమంత్రిని చేసే స్థాయికి తీసుకెళ్లింది. ప్రతి సందర్భంలో నన్ను విజేతగా నిలబెట్టిన ఈ గడ్డ రుణం ఎన్నటికీ తీర్చుకోలేను.' అని పేర్కొన్నారు. 'నా చిన్నతనంలో మా అమ్మకు ఆరోగ్యం దెబ్బతింటే ఆ ఊర్లో ఓ ముదిరాజ్ తల్లి నాకు చనుబాలు ఇచ్చింది. తనకు ఈ గడ్డతో అంతటి అనుబంధం ఉంది.' అంటూ కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.

మిషన్ భగీరథకు అదే పునాది

సిద్ధిపేట మంచినీళ్ల పథకమే, మిషన్ భగీరథ పథకానికి పునాది అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీటిని అందిస్తున్నామంటే దానికి కారణం సిద్ధిపేట స్ఫూర్తే అని చెప్పారు. ఈ ప్రాంతంలో కరువు వస్తే ట్యాంకర్లతో నీళ్లు తెప్పించామని గుర్తు చేశారు. ఆనాడే లోయర్ మానేరు డ్యామ్ నుంచి నీరు తెచ్చి జల జాతర చేసుకున్నామని వివరించారు.

'హరీష్.. ఆరడుగుల బుల్లెట్'

తెలంగాణ ఉద్యమానికి పునాది వేసింది కూడా సిద్ధిపేట గడ్డమీదేనని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఢిల్లీలో పోరాడాల్సి వచ్చినప్పుడు రాష్ట్రాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చిందని, అప్పుడు కరీంనగర్ లో సమావేశమై కన్నీళ్లు పెట్టుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఉప ఎన్నికలో ఆరడుగుల బుల్లెట్ హరీశ్ ను మీకు అప్పగిస్తే తాను ఊహించని దాని కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా పని చేశారని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమం, పథకం సిద్ధిపేటలో తీసుకొచ్చేందుకు హరీశ్ ఎంతో కృషి చేశారని కేసీఆర్ ప్రశంసించారు. తెలంగాణలో సిద్ధిపేటకు ప్రత్యేక స్థానం ఉందని, ఈసారి భారీ మెజార్టీతో హరీశ్ రావును గెలపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

'సస్యశ్యామలం చేసుకున్నాం'

సిద్ధిపేట ప్రాంతాన్ని ఇంతటి అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి హరీశ్ రావు ప్రశంసించారు. దశాబ్దం క్రితం రాష్ట్రంలో కరువు తాండవించగా ప్రస్తుతం తెలంగాణ 10 రాష్ట్రాలకు అన్నం పెడుతుందన్నారు. కేవలం మూడేళ్లలోనే కాళేశ్వరం పూర్తి చేసుకుని సిద్ధిపేటను సస్యశ్యామలం చేసుకున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 11 సార్లు అవకాశం ఇచ్చినా, కనీసం తాగడానికి నీళ్లు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు.

 

టాప్ హెడ్ లైన్స్

Telangana Secretariat: తెలంగాణ సచివాలయానికి తాగునీటి సరఫరా బంద్! ఇదెక్కడి వింత సమస్య
తెలంగాణ సచివాలయానికి తాగునీటి సరఫరా బంద్! ఇదెక్కడి వింత సమస్య
Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
SLBC Tunnel పనుల్లో కీలక పరిణామం.. ప్రమాదకరమైన షియర్‌జోన్‌‌ దాటుకుని తవ్వకాలు: మంత్రి ఉత్తమ్
SLBC Tunnel పనుల్లో కీలక పరిణామం.. ప్రమాదకరమైన షియర్‌జోన్‌‌ దాటుకుని తవ్వకాలు: మంత్రి ఉత్తమ్
Rising Fine Rice Prices: సన్న బియ్యం ధరల భారం.. నాలుగు నెలల్లో 25శాతం పైకి!
న్న బియ్యం ధరల భారం.. నాలుగు నెలల్లో 25శాతం పైకి!

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Embed widget