అన్వేషించండి

KCR Mumbai Tour: నేడే కేసీఆర్ ముంబయి టూర్ - సీఎం ఉద్ధవ్, శరద్ పవార్‌తో వేర్వేరుగా భేటీ, షెడ్యూల్ ఇదీ

సీఎం కేసీఆర్‌ నేడు మహారాష్ట్ర వెళ్తున్నారు. ఉదయం 11 గంటలకు బయల్దేరి, సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం వేళ ఉద్ధవ్‌తో భేటీ అవుతారు.

టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ముంబయి పర్యటనకు వెళ్తున్నారు. ముంబయిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధిపతి ఉద్ధవ్‌ ఠాక్రేతో సమావేశం కానున్నారు. ఎన్సీపీ అధినేత శరద్‌ను కూడా ఆయన కలిసి చర్చలు జరపనున్నారు. కేసీఆర్‌తో కలిసి నడుస్తామని, ఆయనకు మద్దతిస్తామని ఇప్పటికే ఉద్ధవ్ ఠాక్రే సీఎంకు ఫోన్‌లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో పలువురు ప్రాంతీయ పార్టీల నేతలు కూడా స్పష్టం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ముంబయికి వచ్చి తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని కోరారు. అందుకే సీఎం కేసీఆర్‌ నేడు ఉదయం 11 గంటలకు బయల్దేరి ముంబయికి వెళ్తున్నారు. మళ్లీ సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం వేళ ఉద్ధవ్‌తో భేటీ అవుతారు.

సాయంత్రం శరద్ పవార్‌తో
ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం అనంతరం ఆయనతో కలిసి భోజనం చేయనున్నారు. అనంతరం కేసీఆర్ ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో భేటీ అవుతారు. సాయంత్రం 4 గంటలకు వీరి భేటీ జరుగుతుంది. కేసీఆర్‌ వెంట పలువురు పార్టీ నాయకులు కూడా వెళ్లనున్నారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ర్టాల హక్కుల్లో పెరుగుతున్న కేంద్రం జోక్యం, కేంద్రంపై పోరాటంలో భావసారూప్యం ఉన్న పక్షాల ఐక్యత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ వీరితో భేటీ అవుతున్నారు.

గతంలో వీరితో భేటీలు
బీజేపీ, కాంగ్రెస్సేతర కూటమి ఏర్పాటు కోసం తొలుత సీపీఎం అగ్రనేతలు సీతారాం ఏచూరి, ప్రకాశ్‌ కారాఠ్, కేరళ సీఎం పినరాయి విజయన్‌ కూడా కేసీఆర్‌కు మద్దతు పలికారు. తర్వాత ఆర్జేడీ యువ నాయకుడు తేజస్వీ యాదవ్‌‌ను కేసీఆర్ ప్రగతి భవన్‌కు పిలిపించుకున్నారు. ఆ సమయంలోనే ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ ఫోన్‌ చేసి కేసీఆర్‌కు మద్దతు పలికారు. గతంలో కేసీఆర్‌ తమిళనాడు పర్యటనకు వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తోనూ భేటీ అయ్యారు. ఇటు కర్ణాటక నుంచి జేడీఎస్‌ నేత దేవె గౌడ, సీపీఐ అగ్రనేత డీ రాజా, పలు రైతు సంఘాల నేతలు కేసీఆర్‌కు మద్దతు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సీఎం కేసీఆర్‌కు ఫోన్‌చేసి మేము సైతం మద్దతు పలికారు.

హరీశ్ రావు కూడా..
కేసీఆర్‌తో పాటు మంత్రి హరీశ్ రావు కూడా ముంబయి వెళ్లనున్నారని తెలుస్తోంది. ఇక ముంబయి పర్యటన అనంతరం కేసీఆర్‌ కర్ణాటక వెళ్లనున్నారని సమాచారం. అక్కడ మాజీ ప్రధాని దేవె గౌడతో భేటీ కానున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఢిల్లీలో మమతా బెనర్జీ నిర్వహించనున్న సమావేశానికి కూడా కేసీఆర్‌ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్‌ పర్యటన-సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌
నేడు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్‌ పర్యటన-సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Trainee IPS Uday Krishna Reddy Remand: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Bhuma Akhila Priya: అహోబిలం వివాదంపై అఖిలప్రియకు పల్లా వార్నింగ్ - పార్టీ వ్యవహారాల్లో భర్త జోక్యం ఉండకూడదని ఆదేశాలు!
అహోబిలం వివాదంపై అఖిలప్రియకు పల్లా వార్నింగ్ - పార్టీ వ్యవహారాల్లో భర్త జోక్యం ఉండకూడదని ఆదేశాలు!
Embed widget