అన్వేషించండి

KCR: ఫటాఫట్ కేసీఆర్.. ఎన్నికల్లో లబ్ది పొందడానికే దళిత బంధు..! అయితే ఏంటి..? 

అవును.. బరాబర్రా జకీయ లబ్ధి కోసమే దళిత బంధు పథకం అయితే ఏంటి.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. సీఎం కేసీఆర్. ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు సమాధానం ఇచ్చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికేనని తేల్చేశారు.

 

హుజూరాబాద్ ఎన్నికల్లో లబ్ది కోసమే దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెడుతున్నారని విపక్షాలు చేస్తున్న విమర్శలను కేసీఆర్ స్వాగతించారు. నిజంగానే తాను ఎన్నికల్లో లబ్ది పొందడానికే ఆ పథకాన్ని పెడుతున్నానని తేల్చేశారు. వందకు వంద శాతం నిజం.. పెట్టిందే ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికేని తేల్చేశారు. కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి పార్టీలో చేరిన సందర్భంగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. గెలవాలంటే పెట్టుకోవాలి కాబట్టి పెట్టామని.. గెలవని వారే హామీలు ఇస్తూంటే.. గెలిచే పార్టీగా తామెందుకు ఇవ్వమని స్పష్టంచేశారు.  కేసీఆర్‌తో రాజకీయం ఇంతే ఉంటుంది. ఆయనపై.. ఎన్ని రకాల రాజకీయ విమర్శలు చేసినా.. చాలా వాటిని ఆయన బరాబర్ అంగీకరిస్తారు. రాజకీయలబ్ది కోసమే చేస్తున్నామని ప్రకటిస్తారు. ఇప్పుడూ అంతే. 

దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టాలని కేసీఆర్ ఇటీవల నిర్ణయించారు. అన్ని పార్టీల్లోని దళిత ప్రముఖుల్ని పిలిచి.. సమావేశం పెట్టారు. వారెన్ని సూచనలు చేసినా.. ముందుగానే నిర్ణయించుకున్నట్లుగా... దళిత బంధు పథకాన్ని వారి సమక్షంలోనే ప్రకటించారు. ప్రతి నియోజకవర్గానికి వంద మందికి...  అన్ని నియోజకవర్గాల్లో  11900 మందికి ఇస్తామని ప్రకటించారు. అయితే..  ఇప్పుడు అనూహ్యంగా నిర్ణయం మార్చుకున్నారు. ముందుగా.. హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులందరికీ.. పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి.. రూ. పది లక్షలు ఇవ్వాలని డిసైడయ్యారు. అంటే..  ఈ పథకం కోసం ఈ ఏడాది కేటాయిస్తున్న.. రూ. పన్నెండు వందల కోట్లు మొత్తం.. హూజూరాబాద్‌లోని దళిత కుటుంబాలకే పంపిణీ చేస్తారు. అక్కడ ఉన్న దాదాపుగా పదివేల దళిత కుటుంబాల్లో.. ఓ ఇరవై శాతం ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నాయని అనుకున్నా.. మిగతా ఎనభై శాతం మందికి పథకం వర్తింప చేయాల్సి ఉంటుంది. 

ప్రభుత్వం ప్రజా ధనం పెట్టి దళితుల ఓట్లను కొనుగోలు చేస్తోందని.. విపక్షాలు విమర్శలు ప్రారంభించాయి. ఎన్నికల్లో లబ్ది పొందడానికే.. ఇలాంటి పథకం తీసుకు వచ్చారని విమర్శిస్తున్నారు. అయితే ఇవి విమర్శలు కాదని.. నిజాలేనని కేసీఆర్ తేల్చేశారు. కేసీఆర్ వైపు నుంచి ఇలాంటి రియాక్షన్ వస్తుదని ఆశించని విపక్షాలు.,. ఇక ఆ దిశగా ఆరోపణలు చేయడం మానుకోక తప్పదు.  రాజకీయ నేతలు.. ఏం చేసినా తాము ప్రజల కోసమే చేస్తున్నామని రాజకీయ లబ్ది కోసం కాదని.. చెప్పుకునేందుకు తాపత్రయ పడుతూంటాయి.కానీ వారి లక్ష్యం రాజకీయ లబ్దే అని అందరికీ తెలుసు. కానీ వారు ఒప్పుకోరు. కానీ కేసీఆర్ అలాంటిలాంటి రాజకీయ నేత కాదు కాబట్టి.. బరాబర్ ఒప్పుకున్నారు. ఇప్పుడు విపక్షాలకు విమర్శించడానికి ఓ ఆయుద్ధం తగ్గిపోయినట్లే.

also read: huzurabad bypoll: కారెక్కిన కౌశిక్ రెడ్డి.. మరి టికెట్ ఎవరికో..?

టాప్ హెడ్ లైన్స్

Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Upasana Peddi Premiere: 'పెద్ది' ప్రీమియర్‌లో ఉపాసన... పేపర్లు ఎగరేసిన రామ్ చరణ్ భార్య
'పెద్ది' ప్రీమియర్‌లో ఉపాసన... పేపర్లు ఎగరేసిన రామ్ చరణ్ భార్య

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Lalit Modi :
"సోనియాగాంధీ సహా అప్పటి ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారు" బాంబులు పేలుస్తున్న లలిత్ మోడీ!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Opposition Crisis Deep Dive Analysis: ప్రాంతీయ పక్షాల కోటలకు బీటలు! ప్రశ్నార్థకంగా పార్టీల మనుగడ! అధికారంలో లేకపోతే అంతే సంగతులా?
ప్రాంతీయ పక్షాల కోటలకు బీటలు! ప్రశ్నార్థకంగా పార్టీల మనుగడ! అధికారంలో లేకపోతే అంతే సంగతులా?
Chiranjeevi On Peddi: చరణ్ తండ్రిగానే కాదు, నటుడిగానూ గర్విస్తున్నా - పెద్ది విజయంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్
చరణ్ తండ్రిగానే కాదు, నటుడిగానూ గర్విస్తున్నా - పెద్ది విజయంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్
Kerala Menstrual Leave for Schoolgirls:కేరళ విద్యార్థులకు మెన్‌స్ట్రువల్ హాలిడేస్ ! దేశవ్యాప్తంగా చర్చినీయాంశమైన మోడల్‌!
కేరళ విద్యార్థులకు మెన్‌స్ట్రువల్ హాలిడేస్ ! దేశవ్యాప్తంగా చర్చినీయాంశమైన మోడల్‌!
AP DSC 2025 Irregularities: మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
Peddi Vs Pushpa: పెద్ది వర్సెస్ పుష్ప... ఒక్క పాయింట్‌ మీద సినిమాలు తీసిన సుక్కు & బుచ్చి
పెద్ది వర్సెస్ పుష్ప... ఒక్క పాయింట్‌ మీద సినిమాలు తీసిన సుక్కు & బుచ్చి
Embed widget