అన్వేషించండి

Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం

Rahul Gandhi Arrest Protest: కాంగ్రెస్ చేపట్టిన చలో లోక్ భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. సీఈసీ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులను అరెస్ట్ చేశారు.

 Telangana Congress Chalo Lok Bhavan Arrest:   హైదరాబాద్‌లో   ఓటర్ల సవరణ ప్రక్రియలో భారీగా అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చిన  చలో లోక్ భవన్  ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు నగరంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి.

నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ లోక్ భవన్ వైపు దూసుకెళ్లింది. వందలాది మంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు లోక్ భవన్‌ను ముట్టడించేందుకు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో నిరసన తెలుపుతున్న టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి మరియు కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్‌లను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

అరెస్టుల అనంతరం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు నెలకొన్నాయని, ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమైన ఓటు హక్కును కాపాడటంలో సిఇసి విఫలమయ్యారని ఆరోపించారు. పారదర్శకమైన రీతిలో ఎన్నికల వ్యవస్థ సాగాలంటే సిఇసి జ్ఞానేశ్వర్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

ఢిల్లీలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీతో పాటు ఇండియా కూటమికి చెందిన పలువురు ఎంపీలను కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేయించడాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ చర్యలు ముమ్మాటికీ అక్రమమని, అప్రజాస్వామికమని పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య సూత్రాలను కాలరాస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఓటర్ల జాబితాలో అక్రమాలను అరికట్టి పారదర్శకమైన ప్రక్రియను చేపట్టే వరకు తమ పోరాటం ఆగదని తెలంగాణ కాంగ్రెస్ స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం వీధిపోరాటాలు చేస్తుందని తేల్చిచెప్పింది. ముట్టడి నేపధ్యంలో రాజ్‌భవన్, లోక్ భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా భద్రతను పెంచారు. 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
N Ramchander Rao: 15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
US Military Aircraft Attack: గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
LeT Commander Encounter: వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
FIVA Award: భారత్‌లో కార్ల విప్లవానికి నాంది పలికిన Maruti 800.. గ్లోబల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ కారు!
కామన్‌మ్యాన్‌ తొలి కారు మారుతి 800 గుర్తుందిగా.. ఇప్పుడు ఈ కారుకు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ అవార్డ్‌
Morne Morkel Comments: తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు ఆచరించాలి?
కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు ఆచరించాలి?
Embed widget