అన్వేషించండి

అసెంబ్లీ ఎన్నికలు 2026

(Source:  Poll of Polls)

Dasari Narayana Rao's Sons: దాసరి నారాయణ రావు కుమారులపై కేసు.. చంపుతామని బెదిరించినట్లు ఆరోపణలు

గతంలో దాసరి చనిపోయిన తర్వాత అన్నదమ్ములైన ప్రభు, కిరణ్ మధ్య వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ వివాదాల నేపథ్యంలో వారు పలుసార్లు పోలీస్ స్టేషన్‌ మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది.

టాలీవుడ్‌లో ప్రఖ్యాత సినీ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణ రావు కుమారులు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. వారిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. అప్పు తీర్చమని కోరినందుకు చంపేస్తామని దాసరి కుమారులు బెదిరించినట్లుగా వారిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించగా వారు దాసరి నారాయణ రావు కుమారులు దాసరి ప్రభు, అరుణ్‌‌లపై కేసు నమోదు చేశారు.

గుంటూరు జిల్లాకు చెందిన అట్లూరి సోమశేఖర్ రావు అనే వ్యక్తి ఎల్లారెడ్డి గూడలో నివసిస్తున్నారు. దాసరి నారాయణరావు చనిపోకముందు ఆయనతో సోమశేఖర్ రావు సన్నిహితంగా ఉండేవారు. ఓ దశలో దాసరి ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు పలుమార్లు సోమశేఖర రావు వద్ద నుంచి ఆయన రూ.2.10 కోట్లను అప్పు రూపంలో తీసుకున్నారని బాధితుడు చెబుతున్నాడు. అనంతర కాలంలో సినీ దర్శకుడు దాసరి మరణించారు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో ఆయన కుమారులు దాసరి ప్రభు, అరుణ్‌లు 2018 నవంబరు 13న రూ.2.10 కోట్ల అప్పునకు బదులుగా రూ.1.15 కోట్లు చెల్లించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.

అయితే, సోమశేఖర రావు ఈ నెల 27న జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 46లోని దాసరి నారాయణ రావు నివాసానికి వెళ్లి ప్రభు, అరుణ్‌లను డబ్బు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ క్రమంలోనే మరోసారి ఇంటికి వస్తే చంపేస్తామంటూ వారు ఆయనను భయపెట్టినట్లుగా బాధితుడు వాపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ప్రభు, అరుణ్‌లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే, గతంలో దాసరి చనిపోయిన తర్వాత అన్నదమ్ములైన ప్రభు, అరుణ్ మధ్య వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ వివాదాల నేపథ్యంలో వారు పలుసార్లు పోలీస్ స్టేషన్‌ మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది. అంతేకాక, దాసరి పెద్ద కుమారుడు ప్రభు అజ్ఞాతంలోకి వెళ్లారని కూడా రెండేళ్ల క్రితం వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన దాసరి ప్రభు.. తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2008లో కూడా ఆయన ఒకసారి ఇలాగే అదృశ్యమయ్యారు.

గతేడాది గోడ దూకిన వ్యవహారం హాట్ టాపిక్
దాసరి కుమారులు ప్రభు, అరుణ్ మధ్య ఆస్తి తగాదాలు కూడా జరిగాయి. గతేడాది జూన్‌లో చిన్న కుమారుడు అరుణ్ తన ఇంటి గోడను దూకడం హాట్ టాపిక్ అయింది. తన తమ్ముడు గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి బూతులు తిట్టి దౌర్జన్యం చేశారని కూడా ప్రభు ఆ సమయంలో ఆరోపించారు. అయితే, తన తండ్రి రాసిన వీలునామా ప్రకారం.. ఆ ఇల్లు ఇద్దరికీ చెందుతుందని అలాంటప్పుడు తన ఇంటి గోడ తాను దూకితే తప్పేంటని అరుణ్ వివరణ ఇచ్చారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Congress vs BRS: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో యాంకర్లు - ఈ రాజకీయం గీత దాటిపోతోంది !
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో యాంకర్లు - ఈ రాజకీయం గీత దాటిపోతోంది !
TS SSC Results 2026 District wise Results: తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లాటాప్, చివరి స్థానంలో హైదరాబాద్.. జిల్లాలవారీగా ఫలితాలు
తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లాటాప్, చివరి స్థానంలో హైదరాబాద్.. జిల్లాలవారీగా ఫలితాలు
Husky Dogs: ఖరీదైన హస్కీ కుక్కల్ని పెంచి రోడ్డున వదిలేశారు - కాపాడిన స్వచ్చంద సంస్థలు - ఎవరి పని?
ఖరీదైన హస్కీ కుక్కల్ని పెంచి రోడ్డున వదిలేశారు - కాపాడిన స్వచ్చంద సంస్థలు - ఎవరి పని?
Komatireddy Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు

వీడియోలు

RR vs PBKS IPL 2026 Highlights | రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం
Vaibhav Fun With Kids IPL 2026 | పిల్లలతో వైభవ్ సూర్యవంశీ ఫన్నీ ప్రాంక్
Yashasvi Jaiswal about Vaibhav IPL 2026 | వైభవ్ సూర్యవంశీపై యశస్వి జైస్వాల్ కామెంట్స్
RR vs DC IPL 2026 Suyash Sharma | ఐపీఎల్ చరిత్రలోనే సుయాశ్ శర్మ వరల్డ్ రికార్డ్
RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP SSC Exam Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు చూడటానికి ఉన్న మార్గాలేంటీ?
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు చూడటానికి ఉన్న మార్గాలేంటీ?
Congress vs BRS: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో యాంకర్లు - ఈ రాజకీయం గీత దాటిపోతోంది !
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో యాంకర్లు - ఈ రాజకీయం గీత దాటిపోతోంది !
Dhurandhar Japan Release: జపాన్‌లో రిలీజ్‌కు 'ధురంధర్' రెడీ... జూలైలో ఎప్పుడంటే?
జపాన్‌లో రిలీజ్‌కు 'ధురంధర్' రెడీ... జూలైలో ఎప్పుడంటే?
Bollywood Intimate Scenes:
"ఇంటిమేట్ సీన్స్‌లో రెచ్చిపోతున్నారు, కట్‌ చెప్పినా ఆగడం లేదు" బాలీవుడ్ నటులపై యాక్టర్ సంచలన ఆరోపణలు! 
Komatireddy Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
Delhi High Court: ఢిల్లీ హైకోర్టులో కలకలం - వర్చువల్ విచారణలో అశ్లీల వీడియోలు.. హ్యాకింగ్‌ చేసినట్లు అనుమానాలు!
ఢిల్లీ హైకోర్టులో కలకలం - వర్చువల్ విచారణలో అశ్లీల వీడియోలు.. హ్యాకింగ్‌ చేసినట్లు అనుమానాలు!
Raghurama: కోర్టులో రఘురామకు షాక్ - మీ పరిధి దాటొద్దని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
కోర్టులో రఘురామకు షాక్ - మీ పరిధి దాటొద్దని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
Hormuz: హోర్ముజ్ చిక్కులకు గల్ఫ్ దేశాల చెక్ - భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు సరఫరా!
హోర్ముజ్ చిక్కులకు గల్ఫ్ దేశాల చెక్ - భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు సరఫరా!
Embed widget