అన్వేషించండి

KTR: 'తెలంగాణ సోయి లేనోడు సీఎం కావడం మన ఖర్మ' - సీఎం రేవంత్ పై కేటీఆర్ సంచలన ట్వీట్

Telangana News: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మోదీ వద్ద తాకట్టు పెట్టారని మండిపడ్డారు.

KTR Slams CM Revanth Reddy: సీఎం రేవంత్ కు తెలంగాణ ఆత్మ, రాష్ట్రంపై గౌరవం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. తెలంగాణ సోయి లేనోడు మన సీఎం కావడం మన ఖర్మ.. తెలంగాణ ఆత్మ గౌరవం విలువ తెలీనోడు సీఎంగా ఉండడం మన దౌర్భాగ్యం అంటూ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలంగాణ ఆత్మ గౌరవంపై దాడి చేశారని అన్నారు. 'అసలు గోల్ మాల్ గుజరాత్ మోడల్ కు, గోల్డెన్ తెలంగాణ మోడల్ తో పోలికెక్కడిది.? ఘనమైన గంగా జమునా తెహజీబ్ మోడల్ కన్నా.. గోద్రా అల్లర్ల మోడల్ మీకు నచ్చిందా.? నిన్న మొన్నటి వరకూ గుజరాత్ మోడల్ పై నిప్పులు చెరిగిన రేవంత్.. ఇవాళ ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే ఆయన గురించి గొప్పలు మాట్లాడుతున్నారు. ఇదేం నీతి.?.' అంటూ దుయ్యబట్టారు.

'తాకట్టు పెడతారా.?'

తెలంగాణ మోడల్ అంటే అనేక రాష్ట్రాలు మెచ్చిన 'సమున్నత సంక్షేమ నమూనా.. సమగ్ర అభివృద్ధికి చిరునామా' అని కేటీఆర్ పేర్కొన్నారు. 'అనేక రాష్ట్రాలు మెచ్చిన మోడల్. యావత్ దేశానికే నచ్చిన మోడల్. బుడి బుడి అడుగుల వయసులో బుల్లెట్ వేగంతో దూసుకెళ్లిన సమగ్ర, సమ్మిళిత, సమీకృత మోడల్. అలాంటి దేశం మెచ్చిన ఈ తెలంగాణ నమూనాను నమో ముందు కించ పరుస్తావా.?. నమ్మి ఓటేసిన తెలంగాణపై ఎందుకీ నయవంచన. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెడతారా.?. తెలంగాణ దేనినైనా సహిస్తుంది. కానీ.. ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకోదు.' కేటీఆర్ పేర్కొన్నారు.

'నాడేమో తెలంగాణ ఉద్యమకారులపై రైఫిల్ ఎత్తావ్. నేడేమో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టావ్. నిన్ను చరిత్ర క్షమించదు.' అంటూ సీఎం రేవంత్ పై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అటు, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సైతం సీఎం రేవంత్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో ఏం సాధించారని మండిపడ్డారు. తమ ఎంపీలను బీజేపీ లాగేసుకుంటోందని ఆరోపించారు. సీఎం రేవంత్ ప్రజలనే కాదని.. కాంగ్రెస్ పార్టీని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 'మీ 100 రోజుల పాలనలో ఏముంది.?. వైట్ పేపర్, బ్లాక్ పేపర్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లవ్ లెటర్ రాశారు. మోదీ మరోసారి ప్రధాని అవుతారన్నట్లు సీఎం రేవంత్ మాట్లాడారు. తద్వారా కాంగ్రెస్ గెలవదని చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ నిరంకుశమని అన్నారు. కానీ, రేవంత్ మాత్రం గుజరాత్ మోడల్ కావాలంటున్నారు. వరికి బోనస్ ఇవ్వకుండా ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతారు.?. రైతులకు ఇచ్చిన 4 హామీల విషయంలో రేవంత్ మాట తప్పారు. 6 గ్యారంటీలు అమలు చేస్తేనే ఓటు అడిగే హక్కు ఉంటుంది.' అంటూ విమర్శించారు.

Also Read: Revanth Reddy: సన్నాసుల్లారా! నేను మోదీని లోపలింట్ల కలవలే, నిధులు రాకుంటే ఉతికి ఆరేస్తా - రేవంత్ రెడ్డి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Embed widget