BRS MLC Kavitha: సోలాపూర్ లో బతుకమ్మకు హాజరుకానున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Bathukamma Celebrations In Solapur: తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం (అక్టోబర్ 22న) మహారాష్ట్రలో పర్యటించనున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం (అక్టోబర్ 22న) మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఆదివారం సోలాపూర్ లో జరగనున్న బతుకమ్మ సంబరాలకు ఎమ్మెల్సీ కవిత హాజరు కానున్నారు. నగరంలోని పుంజాల్ మైదాన్ లో జరిగే బతుకమ్మ పండుగ ఉత్సవం లో పెద్ద ఎత్తున పాల్గొననున్న ప్రవాస తెలంగాణ ఆడబిడ్డలతో కలిసి ఎమ్మెల్సీ కవిత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు ముమ్మరంగా చేస్తున్నారు.
సోలాపూర్ లోని దత్తవాడ నుంచి సాయంత్రం 5. గంటలకు ప్రారంభమయ్యే బతుకమ్మ శోభయాత్రలో కవిత పాల్గొంటారు. ఈ శోభయాత్ర సాయంత్రం 6.00 గంటలకు అక్కల్ కోట్ రోడ్ లోని పుంజాల్ మైదాన్ కు చేరుతుంది. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మలు తలకెత్తుకొని నగరం లోని ఆడబిడ్డలు పెద్ద ఎత్తున కార్యక్రమానికి తరలి రావలసిందిగా నిర్వాహకులు ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేశారు. సోలాపూర్ లో జరిగే కార్యక్రమానికి కవిత హాజరు కావడం తమకు ఆనందంగా ఉందని స్థానిక ఏర్పాట్లను బీఆర్ఎస్ నాయకులు నాగేష్ వల్యాల్, దశరథ్ గోప్ లు అన్నారు.
Before You Go
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
ట్రెండింగ్ వార్తలు





















