అన్వేషించండి

TRS Formation Day: ఏప్రిల్ 27 బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం - కేటీఆర్ ఇచ్చిన పిలుపు ఇదే

Telangana News : బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని సింపుల్ గా నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నందున జిల్లా కార్యాలయాల్లో జెండా వందనం చేయాలని కేటీఆర్ పార్టీ క్యాడర్ కు సూచించారు.

 BRS Formation Day  :  భారత రాష్ట్ర సమితిగా మారిన తెలంగాణ  రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27న నిర్వహించనున్నారు. శనివారం అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండాను ఎగురవేయాలని   కేటీఆర్ క్యాడర్ కు  పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల  ప్రచారంలో అందరూ బిజీగా ఉన్నందున  హంగామా  కార్యక్రమాలేమీ వద్దని సూచించారు. జిల్లా పార్టీ కార్యవర్గంతో పాటు, పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు జెండా వందనం కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. పార్టీ నేతలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

2001, ఏప్రిల్ 27 న టీఆర్ఎస్‌ను ప్రారంభించిన కేసీఆర్                                 

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి సొంత రాష్ట్రం తెలంగాణ ను సాధించాలన్న లక్ష్యంతో కేసీఆర్ 2001 ఏప్రిల్ 27న హైదరాబాద్ లోని జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రకటించారు. ఆ రోజు తనతో పాటు వచ్చిన కొంత మంది నేతలతో ఆయన తెలంగాణ ఉద్యమం ప్రారంభించారు. అనేక ఒడి దుడుకులు ఎదుర్కొన్నారు. చివరికి తెలంగాణ ఉద్యమాన్ని ఉద్దృత స్థాయికి తీసుకెళ్లారు. రాష్ట్ర విభజనను పూర్తి చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ సాధారణ మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చింది. 2019లో  భారీ మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చింది. 

గత ఏడాది బీఆర్ఎస్‌గా మార్పు - పేరు ఒక్కటే మార్పు                       

అయితే తెలంగాణ చాలా వరకూ అభివృద్ధి చెందిందని ఇక దేశవ్యాప్తంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా కేసీఆర్ మార్చారు. కానీ అలా మార్చడంతో మొదటికే మోసం వచ్చినట్లయింది. ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. పేరు ఒక్కటే మారింది. గుర్తు .. రంగు ఏదీ మారలేదు. తెలంగాణ మ్యాప్ ప్లేస్ ఇండియా ఫోటో కూడా పెట్టలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ అనే పేరు ఉన్నా  తెలంగాణ లోగోనే వాడుతున్నారు. తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ప్రజలు పట్టించుకుంటారా లేదా అన్నది పార్లమెంట్ ఎన్నికల్లో తేలిపోతుంది. 

గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్                                         

పార్టీ ఆవిర్భావం తర్వాత ఎప్పుడూ లేనంత  గడ్డు పరిస్థితిని బీఆర్ఎస్ .. టీఆర్ఎస్ ఎదుర్కొంటోంది.  బీఆర్ఎస్ పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే టీఆర్ఎస్ అనే పేరును .. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరును ఈసీ ఫ్రీజ్ చేసిందని కేసీఆర్ చెబుతున్నారు. పార్టీ పేరు మార్పు సాధ్యం కాదంటున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించే  సీట్లను బట్టి ఆ పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉందని ఇప్పటికే రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress new AICC incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
Telangana Assembly Clash: అసెంబ్లీ ఘర్షణల రగడ - కాంగ్రెస్‌ది అతి రాజకీయమా? KTR పీఏ, పీఆర్వోల విచారణతో తిరగబడ్డ వ్యూహం!
అసెంబ్లీ ఘర్షణల రగడ - కాంగ్రెస్‌ది అతి రాజకీయమా? KTR పీఏ, పీఆర్వోల విచారణతో తిరగబడ్డ వ్యూహం!
PM Awas Yojana Scheme: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
Adilabad Crime News: ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
Telangana Congress new AICC incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
OTT లాగే కొత్త కార్లనీ సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు, కొనకుండానే దర్జాగా తిరగొచ్చు, బోర్‌ కొడితే మార్చేయొచ్చు
కారు కొనాల్సిన పని లేదు.. సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే చాలు, కొత్త మోడల్‌ మీ ఇంటి ముందు ఉంటుంది
AP Fake Liquor Case: ములకలచెరువు నకిలీ మద్యం కేసు.. కోర్టులో లొంగిపోయిన జయచంద్రారెడ్డి, గిరిధర్‌ రెడ్డి
AP Fake Liquor Case: ములకలచెరువు నకిలీ మద్యం కేసు.. కోర్టులో లొంగిపోయిన జయచంద్రారెడ్డి, గిరిధర్‌ రెడ్డి
Srikakulam Politics: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
Top Automatic Cars: ఆటోమేటిక్ కార్ కోసం చూస్తున్నారా? రూ. 9 లక్షల కంటే తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్లు ఇవే
ఆటోమేటిక్ కార్ కోసం చూస్తున్నారా? రూ. 9 లక్షల కంటే తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్లు ఇవే
Embed widget