అన్వేషించండి

Telangana Crime: యూట్యూబ్‌ వీడియోలు చేస్తోందని పరువు హత్య- ఇల్లందులో చెల్లిన చంపిన అన్న

పరువుగల కుటుంబమని వీడియోలు తీసి యూట్యూబ్‌లో పెట్టొద్దని ఓ అన్న తన చెల్లిని హెచ్చరించాడు. అయినా మాట వినకుండా వీడియోలు చేస్తుండడంతో ఆగ్రహించి రోకలితో కొట్టి హతమార్చాడు.

యూట్యూబ్ షార్ట్ వీడియోలు చేస్తూ దానికి బానిసైన చెల్లిని క్షణికావేశంలో హతమార్చాడో అన్న. తమది పరువుగల కుటుంబమని వీడియోలు తీసి యూట్యూబ్‌లో పెట్టి తమను బజారుకీడ్చొద్దని చెల్లిని హెచ్చరించాడు. అయినా చెల్లెలు తన మాట వినకుండా వీడియోలు చేస్తుండడంతో ఆగ్రహించిన అన్న విచక్షణ కోల్పోయి చంపేశాడు. ఇంట్లో ఉన్న రోకలి తీసుకుని చెల్లి తలపై కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన చెల్లి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించింది. ఈ ఘోరమైన ఘటన కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో ఈ ఘటన జరిగింది. 

వద్దని చెప్పినా వినకుండా
రాజీవ్‌నగర్‌ తండాకు చెందిన అజ్మీరా శంకర్‌, దేవీకు అమ్మాయి అజ్మీరా సింధు (20), అజ్మీరా హరిలాల్ సంతానం. సింధు మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో నర్సుగా పని చేస్తోంది. హరిలాల్‌ పనులకు వెళ్లేవాడు. తండ్రి అజ్మీరా శంకర్‌ రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తల్లి అజ్మీరా దేవి కూలీ పనులకు వెళుతోంది. నర్సుగా పనిచేస్తూనే సింధు సరదాగా యూట్యూబ్‌లో వీడియోలు కూడా చేస్తోంది. ఇది అన్న హరిలాల్‌కు నచ్చలేదు.

యూట్యూబ్‌లో వీడియోలు చేయొద్దని, తమది పరువు గల కుటుంబమని ఇంటి పరువు తీయొద్దని సూచించాడు. పలు మార్లు హెచ్చరించాడు. అయినా సింధు తన సోదరుడి మాటలు పట్టించుకోకుండా పోస్టు చేస్తోంది. ఈ విషయంలో సింధు, హరిలాల్‌ కొన్నాళ్లుగా గొడవ జరుగుతోంది. తల్లి వీరిని వారిస్తూ వచ్చింది. అన్న చెల్లెల్లు గొడవ పడొద్దని చెబుతూ వచ్చింది. అంతలోనే ఈ ఘోరం జరిగింది.

ప్రాణం తీసిన క్షణికావేశం
ఇదే విషయంపై గత సోమవారం కూడా ఇంట్లో సింధు, హరిలాల్ మధ్య  తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. యూట్యూబ్‌లో పోస్టు చేసిన వీడియోలన్నీ డిలీట్‌ చేయాలని, ఇకపై వీడియోలు చేయవద్దని హరిలాల్ సింధును హెచ్చరించాడు. ఇందుకు సింధు అంగీకరించలేదు. కోపోద్రిక్తుడైన హరిలాల్‌ ఇంట్లో ఉన్న రోకలిబండతో సింధు తలపై కొట్టాడు. తీవ్ర గాయాలైన ఆమెను కుటుంబసభ్యులు తొలుత ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్యం అందించారు. అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి, తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్‌ ఎంజీఎం వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో సింధు మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సోషల్ మీడియా ప్రభావం
ఆధునిక యుగంలో సాంకేతికత అందరికి అందుబాటులోకి వస్తోంది. 4G, 5G ఇంటర్నెట్ స్పీడ్ యువతను సోషల్ మీడియా వైపు తిప్పుతోంది. యువత తమ చేతిలోని సెల్‌ఫోన్‌లో ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. గుర్తింపు పొందుతున్నారు. ఈ క్రమంలో యువత తమ ఫాలోవర్ల్లను పెంచుకునేందుకు, గుర్తింపు తెచ్చుకునేందుకు ఇన్‌స్ట్రాగ్రాంలో రీల్స్, యూట్యూబ్‌లో షార్ట్, ట్విటర్,  ఇతర సామాజిక మాధ్యమాల్లో షార్ట్, వైరల్ వీడియోలో చేస్తున్నారు. ఇవి కొన్నిసార్లు శృతి మించుతున్నాయి. ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఇంట్లో పెద్దలు చెప్పిన మాట వినకుండా వీడియోలకే బానిసలవుతుండడంతో కుటుంబ సభ్యుల కోపానికి కారణమవుతున్నాయి.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఈనెల 18న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రకటన అంటూ వస్తున్న వార్తలో నిజం లేదు
ఈనెల 18న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రకటన అంటూ వస్తున్న వార్తలో నిజం లేదు
Special Intensive Revision Voters Telangana: పాతబస్తీలో ఓట్ల గల్లంతు గండం - SIRతో ఓవైసీ ఆందోళన - సగం ఓటర్లు తగ్గిపోతారా?
పాతబస్తీలో ఓట్ల గల్లంతు గండం - SIRతో ఓవైసీ ఆందోళన - సగం ఓటర్లు తగ్గిపోతారా?
Telangana Politics Mind Game: తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Telangana Politics Mind Game: తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
TG20 League Winner: టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
Veg Momos Recipe: ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
Embed widget