అన్వేషించండి

Raghunandan Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మేం అందుకే చేర్చుకోవట్లేదు - క్లారిటీ ఇచ్చిన రఘునందన్ రావు

Telangana News: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశం తర్వాత రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు.

Hyderabad News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్పించుకోని అంశంపై ఆ పార్టీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. పదవికి రాజీనామా చేస్తేనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. బీజేపీలో చేరడం కోసం.. చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని చెప్పారు. అయితే, తాము మాత్రం రాజీనామా చేసి బీజేపీలో చేరాలని షరతు పెట్టినట్లుగా రఘునందన్ రావు వెల్లడించారు. ఉప ఎన్నికకు సిద్ధంగా ఉంటేనే బీజేపీలోకి ఎంట్రీ అని తమతో టచ్‌లో ఉన్న ఎమ్మెల్యేలకు చెప్పామని అన్నారు. శుక్రవారం (జూలై 12) బీజేపీ కార్యాలయంలో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. 

మరోవైపు, కాంగ్రెస్ - బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను అరెస్ట్ చేయటానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన మంత్రులను అరెస్టు చేయడానికి కూడా ముందూ వెనక ఆలోచిస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే.. ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్, యూ ట్యాక్స్ ల పేరుతో వివిధ ట్యాక్సులు వేస్తున్నారని అన్నారు. 

తెలంగాణలో నిరుద్యోగులపై ప్రతిపక్షంలో ఒకమాట.. అధికారంలో వచ్చాక మరోమాట కాంగ్రెస్ చెబుతోందని రఘునందన్ విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇవ్వడానికి రూ.4,116 నిధులు లేవు కానీ.. రేవంత్ రెడ్డి మాత్రం ఏకంగా రూ.4 లక్షలు జీతం తీసుకుంటున్నాడని చెప్పారు. దేశంలో ఎక్కువ నెల జీతం తీసుకుంటున్న వ్యక్తి రేవంత్ రెడ్డే అని అన్నారు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వలేదని ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తోందని చెప్పారు. నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. 

ఎన్నికల హామీ మేరకు వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ, రైతు భరోసా కోసం పోరాటం చేయాలని కార్యవర్గ సమావేశాల్లో తీర్మానించామని అన్నారు. నిరుద్యోగ యువతకు అండగా ఉండాలని నిర్ణయించామని చెప్పారు. ధరణి పరిస్థితి ఏంటని.. ధరణి పేరు మీద లక్షల ఎకరాలు గత ప్రభుత్వ పెద్దలు తిన్నారని అన్నారు. కాంగ్రెస్ లో పీసీసీ అధ్యక్షుడు ఎవరో తేల్చడానికి, మంత్రి పదవుల భర్తీ కోసం ఢిల్లీకి వారం రోజుల పాటు వెళ్తున్నారని విమర్శించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
Telangana EdCET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
Vaibhav Sooryavanshi News: ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
Embed widget