అన్వేషించండి

Eatala Rajender: అప్పట్లో ఇదే ధైర్యం ఇచ్చింది, రేవంత్ రెడ్డి ఆహ్వానంపై స్పందించిన ఈటల రాజేందర్

కాంగ్రెస్ లో చేరాలని గతంలో పార్టీ విడిచి వెళ్లిన వారిని, ఈటల రాజేందర్‌ను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. దీనిపై ఈటల స్పందించారు.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. కాంగ్రెస్ లోకి రావాలని గతంలో పార్టీ విడిచి వెళ్లిన వారిని, ఈటల రాజేందర్‌ను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ స్పందిస్తూ.. పార్టీ విడిచి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా‌ ఎవరూ బీజేపీని వదలబోరని, బీజేపీ నుంచి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తనను బయటకు పంపిన రోజున తనకు బీజేపీనే తగిన గౌరవం, ధైర్యం ఇచ్చిందని ఈటల గుర్తు చేశారు. పైగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేతలే బీజేపీలోకి రావడానికి రెడీగా ఉన్నారని అన్నారు. కేసీఆర్‌ను ఓడించగలిగే శక్తి బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు. 

కాంగ్రెస్ నుంచి లేదా ఇతర పార్టీల్లో నుంచి బీజేపీలో చేరిన వారు అందరూ ఆలోచనతోనే బీజేపీలో చేరారని చెప్పారు. ఈటల రాజేందర్ క్యారెక్టర్ అనేది తెరిచిన పుస్తకం అని, రేవంత్‌ రెడ్డి చిల్లర మాటలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదని ఈటల రాజేందర్ మండిపడ్డారు. బీజేపీ నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు నేతలందరూ సమష్ఠిగా పని చేస్తున్నట్లు చెప్పారు. పదే పదే పార్టీలు మారడం తన విధానం కాదని అన్నారు. తాను పార్టీ మారనున్నట్లు కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలను కూడా ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు నియంతృత్వ కేసీఆర్ సర్కారును అంతం చేయడమే తన లక్ష్యమని అన్నారు.

కర్ణాటక ఊపుతో తెలంగాణ కాంగ్రెస్ బలోపేతానికి యత్నాలు

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయంతో తెలంగాణలో పార్టీకి ఊపు తీసుకు  రావాలని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. పలువురు నేతలు మళ్లీ కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ప్రారంభం కావడంతో నేరుగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. పార్టీని వీడిపోయిన వాళ్లందరూ తిరిగి రావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీలు వివేక్, విశ్వేశ్వర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి పార్టీలోకి రావాలన్నారు. ఈటల రాజేందర్ కూడా పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు.  వివేక్, ఈటల, కొండా లాంటి వాళ్ళు క్షణికావేశంలో బీజేపీలో చేరారని, బీజేపీ సిద్దాంతంతో సంబంధంలేనివాళ్ళు కొందరు బీజేపీని నమ్మి ఆ పార్టీలో చేరారన్నారు. 

నా వల్ల ఇబ్బంది అవుతుందనుకుంటే ఓ మెట్టు దిగుతా - రేవంత్ రెడ్డి 

సీఎం కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ చేయాలనుకునే వాళ్ళు కాంగ్రెస్‌‌లోకి రావాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాను నాయకుడ్ని కాదని, సోనియా, ఖర్గేలే నాయకులన్నారు. తన వల్ల ఇబ్బంది అవుతుంది అనుకుంటే... ఒక మెట్టు కాదు పది మెట్లు దిగడానికి తాను సిద్ధమన్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాలని అనుకుంటున్నారని ..అయితే రేవంత్ రెడ్డి సారీ చెబితే చేరడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. ఈ కారణంగానే రేవంత్ రెడ్డి తాను ఓ మెట్టు దిగడానికి సిద్ధమని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీ మార్పు వ్యాఖ్యలను రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో ఖండించారు. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget