అన్వేషించండి

Rajasingh What Next : సస్పెన్షన్ ఎత్తివేయని బీజేపీ - రాజాసింగ్ ఏం చేయబోతున్నారు ?

రాజా సింగ్ సస్పెన్షన్ పై బీజేపీ హైకమాండ్ ఎటూ తేల్చడం లేదు. గోషామహల్ లో ముఖేష్ గౌడ్ కమారుడికి టిక్కెట్ ివ్వాలన్న ఆలోచన చేస్తున్నారు.

 

Rajasingh What Next :  తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. కానీ బీజేపీ తమ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయలేదు.    2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఈసారి పోటీ చేసే ఛాన్స్ దక్కుతుందా? పార్టీ సస్పెన్షన్ వేటు తొలగిస్తుందా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  వేటు ఇలాగే కొనసాగితే రాజాసింగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది  రాజకీయవర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది. 

సస్పెన్షన్ ఎత్తి వేసే ఉద్దేశంలో లేని బీజేపీ                  

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కరుడు గట్టిన హిందూత్వ వాదిగా వివాదాల్లో నిలుస్తూ ఉంటారు.   2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. పార్టీలో సీనియర్ నేతగా పేరు తెచ్చుకున్న రాజాసింగ్.. వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా సస్పెన్షన్ వేటు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో మునావర్ ఫారూక్ షో ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఓ వర్గాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ ఘాటు విమర్శలు చేశారు.  ఓ వీడియో రిలీజ్ చేశారు. రాజాసింగ్ వ్యవహారం తీవ్ర వివాదాస్పదమయింది.  రాజాసింగ్ పార్టీ లైన్ దాటారని.. సస్పెండ్ ఎందుకు చేయవద్దో చెప్పాలని బీజేపీ హైకమాండ్ నోటీసులు జారీ చేసింది. నేరుగా కేంద్ర నాయకత్వమే రాజాసింగ్ పై వేటు వేయడంతో.. రాష్ట్ర నాయకత్వం ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది.

తనకు  బీజేపీ మాత్రమే కరెక్ట్ అంటున్న రాజాసింగ్                                

ఎన్నికల షెడ్యూల్ రావడంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం గోషామహల్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది. అయితే బీజేపీ టికెట్ ఇవ్వకపోతే ఎన్నికల నుంచే తప్పకుంటానని రాజాసింగ్ ఇటీవల తెలిపారు. కాగా ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేత అంశంపై కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర పార్టీ చేతుల్లో ఉందని చెబుతున్నారు.  రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసినా ఆయన్ను అసెంబ్లీకి కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం కల్పించే అవకాశముందనే చర్చ జరుగుతోంది.గోషామహల్ నుంచి మరో నేతకు టికెట్ ఇవ్వాలని ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. విక్రమ్ గౌడ్ కు ఇవ్వాలని భావి్సతున్నరు. దానికి రాజాసింగ్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 

రాజాసింగ్ తీసుకునే నిర్ణయం బట్టే గోషామహల్ ఫలితం              

గోషామహల్ నియోజకవర్గంలో ఉత్తరాదికి చెందిన వారు ఎక్కువగా ఉంటారు. అలాగే్ ముస్లిం జనాభా కూడా ఎక్కువగానే ఉంటారు. అయితే హిందువులు మెజార్టీ కావడంతో   మజ్లిస్ వ్యూహాత్మకంగా .. అభ్యర్థిని నిలబెట్టుకుండా బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తూ వస్తోంది. తెలంగాణలో ఉన్న అతి చిన్న నియోజకవర్గాల్లో ఒకటి అయిన గోషామహల్ కు ఎమ్మెల్యే అయిన రాజాసింగ్ తిరుగులేని నేతగా మారారు. ఆయనకు సొంత ఫాలోయింగ్ ఉంది. ఒక వేళ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.                                                

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Telangana SIR Voter List: తెలంగాణలో సగం  ఓట్లు పెండింగ్.. నాలుగో వంతు మాయం.. ఏంటీ SIR మాయాజలం.. ? 
తెలంగాణలో సగం  ఓట్లు పెండింగ్.. నాలుగో వంతు మాయం.. ఏంటీ SIR మాయాజలం.. ? 
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget