అన్వేషించండి

Bhatti vikramarka on ys Sharmila: వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరితే సంతోషమే, వైఎస్సార్ కుటుంబమంటే చాలా గౌరవం

Bhatti Vikramarka on YS Sharmila to Join Congress: వైఎస్ షర్మిల కాంగ్రెస్ లోకి వస్తుండడం చాలా సంతోషంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. వైఎస్ఆర్ కుటుంబం అంటే గౌరవం అన్నారు.

Bhatti Vikramarka on YS Sharmila to Join Congress: 

రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన పార్టీలలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు జంపింగ్ చేస్తుంటే.... మరికొన్ని పార్టీలో కీలక నేతలు గూటిని వీడుతున్నారు. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు జరుగుతున్నాయి.

వైఎస్సార్ ఫ్యామిలీ అంటే గౌరవం.. 
వైఎస్ షర్మిల కాంగ్రెస్ లోకి వస్తుండడం చాలా సంతోషంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. వైఎస్ఆర్ కుటుంబం అంటే కాంగ్రెస్ పార్టీకి చాలా గౌరవం అన్నారు. ఇవాళ తిరుమల శ్రీవారిని బట్టి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో ఆయన మాట్లాడాడు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ.... వారు భావోద్వేగాల వల్ల కాంగ్రెస్ పార్టీకి కొంతకాలం దూరం అయ్యారని తెలిపారు. ఇప్పుడు తిరిగి వైఎస్ షర్మిల సొంతింటికి వస్తున్నట్లు భావిస్తున్నామని బట్టి విక్రమార్క హర్షించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ బిజెపికి బీ టీం లాంటి పార్టీ అని విమర్శించారు. బిజెపి వ్యతిరేక కూటమిలో చీలికలు తీసుకొచ్చి.... బిజెపికి ఉపయోగపడేందుకే బిఆర్ఎస్ పార్టీ పెట్టారని ఎద్దేవా చేశారు. ఇక రాష్ట్రానికి బీఆర్ఎస్ వల్ల ఒరిగిందేమీ లేదని బట్టి విక్రమార్క దుయ్యబట్టారు. ఇప్పటికే బట్టి మార్గంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీలో కలుస్తానంటే స్వాగతిస్తామంటూ ఆహ్వానించారు.

 

షర్మిల చేరికపై  కాంగ్రెస్ లో పార్టీలో వ్యతిరేకగలం....

కాంగ్రెస్ లో  చేరుతారనే ఊహగానాల నడుమ కాంగ్రెస్ పార్టీలోనే మరో వర్గానికి చెందిన నాయకులకు మాత్రం షర్మిలను పార్టీలో చేర్చుకుంటే చాలా నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు. ఉద్యమ సమయంలో ఆమె సమైక్యాంధ్ర గళం వినిపించి... ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా పార్టీ పెట్టి తెలంగాణలో అడుగు పెట్టాను అంటున్నారు. ఆమె కాంగ్రెస్లో చేరితే కచ్చితంగా బిజెపి బీఆర్ఎస్ పార్టీలకు బలం ఇచ్చిన వారం అవుతామని కొందరు ముఖ్య నేతలు భావిస్తున్నారు. వైఎస్ షర్మిల పార్టీలో చేరితే పాలేరు నియోజకవర్గ టికెట్ ఇవ్వాలి ఇప్పుడు అదే నియోజకవర్గంలోని బలమైన నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు పార్టీలో చేరుతారన్న వార్తలు వస్తున్నాయి. ఆ టికెట్ ఆయనకు ఇవ్వడానికి పార్టీ సుముఖంగా ఉంది. అందుకని ఇప్పుడు షర్మిలను పార్టీలో చేర్చుకోకుండా ఉంటేనే మంచిదని ఆ వర్గం భావిస్తుంది.

తెలంగాణలో ఈసారి ఎలాగైనా రాజన్న రాజ్యం తీసుకురావాలని నినాదంతో వైఎస్ఆర్ టీపీ పార్టీని ని టీపీని స్థాపించి వైఎస్ షర్మిల తన పార్టీని రాష్ట్రంలో పాగా వేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు చేస్తూ... ప్రతి నియోజకవర్గంలో కలియ తిరిగారు. పాదయాత్ర సమయంలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పై తనదైన శైలిలో విమర్శలు చేశారు. దీంతో తీరికలేని సమయాన్ని గడుపుతూ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేస్తూ... సీఎం కేసీఆర్ ను మూడోసారి గెలవకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం-
అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం-
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Tesseract Company Land Allocation Controversy: రేవంత్ సోదరులే టార్గెట్‌గా బీఆర్ఎస్ పొలిటికల్ మైండ్‌గేమ్ - టెస్సరాక్ట్ భూముల వివాదంలో కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిందా?
రేవంత్ సోదరులే టార్గెట్‌గా బీఆర్ఎస్ పొలిటికల్ మైండ్‌గేమ్ - టెస్సరాక్ట్ భూముల వివాదంలో కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిందా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Embed widget