అన్వేషించండి

Siddipet: తెలంగాణలో రోడ్లకు 1900 కోట్లు ఇచ్చాం - సిద్దిపేటలో జావడేకర్, బండి సంజయ్

కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలంగాణలో బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు.

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పెద్ద సముద్రాల వద్ద సిద్దిపేట నుండి ఎల్కతుర్తి వరకు జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులను మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ తో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. రహదారి నిర్మాణ పనుల తీరుతెన్నులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. సిద్దిపేట - ఎల్కతుర్తి 765 డీఎల్ జాతీయ రహదారి నిర్మాణానికి రూ.578 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. 9 సంవత్సరాలలో దేశ వ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణానికి మోదీ ప్రభుత్వం లక్ష కోట్లు కేటాయించిందని అన్నారు. తాను ఎంపీ అయినప్పటి నుండి నాలుగేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 వేల కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశానని అన్నారు. 

కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలంగాణలో బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. బండి సంజయ్ అడగ్గానే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సిద్దిపేట - ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం తక్కువ, అవినీతి ఎక్కువ జరిగిందని ఆరోపించారు. తెలంగాణలో 1948 నుండి 2014 వరకు జాతీయ రహదారుల నిర్మాణానికి కేవలం 2,500 కోట్లు కేటాయిస్తే, ఈ 9 ఏళ్లలో మోదీ ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.2,500 కోట్లు కేటాయించిందని అన్నారు. 

ఈ తొమ్మిదేండ్ల మోదీ పాలనలో కేంద్రంలోని ఒక్క మంత్రిపై, ఎంపీపై కూడా అవినీతి ఆరోపణలు రాలేదని అన్నారు. యూపీఏ ప్రభుత్వం కంటే రెండింతలు ఈ తొమ్మిది ఏండ్లలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని అన్నారు. తెలంగాణ కోసం ఆనాడు తాము కూడా కేంద్రంలో పోరాటం చేశామని, కానీ తెలంగాణలో ఇప్పుడు ఒకే కుటుంబం అవినీతి పాలన కొనసాగిస్తుందన్నారు. తొమ్మిదేళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి 1,900 కోట్లు కేటాయించిందని అన్నారు. వచ్చే సంవత్సరం నాటికి ఈ జాతీయ రహదారి నిర్మాణం పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Telangana Mass Killing:షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
Telangana Mass Killing: పోలీసుల నిర్లక్షంతోనే షాబాద్‌ మర్డర్స్‌! దైవాలగూడ ప్రజల ఆందోళన!
పోలీసుల నిర్లక్షంతోనే షాబాద్‌ మర్డర్స్‌! దైవాలగూడ ప్రజల ఆందోళన!
Telangana Mass Killing News: రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో దారుణం- పోక్సో కేసు పెట్టారని ఆరుగురి హత్య- నిందితుడి ఘాతుకంతో వణికిపోయిన గ్రామం
రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో దారుణం- పోక్సో కేసు పెట్టారని ఆరుగురి హత్య- నిందితుడి ఘాతుకంతో వణికిపోయిన గ్రామం

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
E20తో మైలేజ్‌ 5 శాతం వరకు తగ్గొచ్చని ఒప్పుకున్న కేంద్రం, కానీ ప్రయోజనాలే ఎక్కువని స్పష్టీకరణ
E20తో మైలేజ్ 5 శాతం వరకు తగ్గొచ్చు - అంగీకరించిన కేంద్రం, కానీ..!
Embed widget