అన్వేషించండి

Adilabad: స్కూల్లో దెయ్యం ఉందని విద్యార్థుల్లో వణుకు - దెబ్బకు భయం పోగొట్టిన టీచర్

Adilabad News: స్కూలు విద్యార్థుల్లో భయం పోగొట్టేందుకు ఓ టీచర్ చేసిన పని ప్రశంసనీయం అయింది. స్కూల్లోని ఐదో క్లాసులో దెయ్యం ఉందని విద్యార్థులు వణికిపోతుండగా అమావాస్య రోజున టీచర్ అక్కడ పడుకున్నారు.

Adilabad Teacher News: ఆదిలాబాద్ జిల్లా జైనధ్ మండలం ఆనంద్ పూర్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో దెయ్యం ఉందని భయపడుతున్నారు విద్యార్థులు. ఈ నెల రెండవ తేదీన పాఠశాలకు బదిలీపై నూతల రవీందర్ అనే ఉపాధ్యాయుడు రాగా.. ఆ రోజు మధ్యాహ్నం పాఠం చెబుతున్న సమయంలో బయట చప్పుడు కావడంతో విద్యార్థులు ఉలిక్కిపడి భయపడ్డారు. దీంతో ఆ ఉపాధ్యాయుడు గమనించి ఏమైందని విద్యార్థులను ప్రశ్నించగా.. వారు ఈ పాఠశాలలో దెయ్యం ఉంది సార్ అందుకే మేము భయపడుతున్నామని చెప్పారు. దీంతో విద్యార్థుల భయాన్ని పోగొట్టడం కోసం ఆ ఉపాధ్యాయుడు రాత్రి అమావాస్య రోజు పాఠశాలలోని ఐదో తరగతి గదిలో దెయ్యం ఉందని విద్యార్థులు చెప్పడంతో ఆ గదిలోనే ఒంటరిగా పడుకుని విద్యార్థులకు ఉన్న అనుమానాన్ని నివృత్తి చేస్తూ వారిలోని భయాన్ని తొలగించారు.

గతేడాది కేమ శ్రావణ్ అనే నాలుగో తరగతి విద్యార్థి దెయ్యం భయంతో పాఠశాల వదిలి వేరే ప్రైవేట్ పాఠశాలలో చేరడం జరిగిందని స్థానికులు తెలుపగా.. ఇలా మళ్లీ ఇతర విద్యార్థులు వెళ్లిపోకుండా విద్యార్థుల భయం పోగొట్టేందుకు జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆ ఉపాధ్యాయుడు నూతల రవీందర్ అమావాస్య రోజున రాత్రి పాఠశాలలో ఒంటరిగా పడుకొని విద్యార్థులకు ఉన్న దెయ్యం భయాన్ని పోగొట్టారు. దీంతో విద్యార్థుల్లోనూ భయం అనేది పోయింది. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్ఞానేశ్వర్ రెడ్డి, మిగతా ఉపాధ్యాయులు నూతల రవీందర్ ని అభినందించారు.

ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు నూతల రవీందర్ మాట్లాడుతూ.. జనవిజ్ఞాన వేదిక విద్యార్థులలో ఉన్న భయాలను పోగొట్టడమే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న ఏ పాఠశాలలోనైనా విద్యార్థులు పాఠశాలలో దెయ్యం ఉందని భావనతో భయపడుతున్నట్లయితే వారిని సంప్రదించినట్లయితే జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటిగా వెళ్లి ఆయా పాఠశాలల్లో విద్యార్థుల భయాన్ని నివృత్తి చేయడానికి సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Bhadrachalam Temple: 3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Rythu Bharosa Funds: నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
IPL orange cap winners: ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ సాధించిన బ్యాటర్ ఎవరు? విరాట్ కోహ్లీ కాదండోయ్
IPLలో అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ సాధించిన బ్యాటర్ ఎవరు? విరాట్ కోహ్లీ కాదండోయ్
LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
US Iran War: 48 గంటల్లోగా హర్మూజ్ తెరుచుకోకపోతే ఊహించని విధ్వంసం... ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
48 గంటల్లోగా హర్మూజ్ తెరుచుకోకపోతే ఊహించని విధ్వంసం... ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
Water Tank Cleaning Tips : ఇంట్లో వాటర్ ట్యాంక్ ఇలా క్లీన్ చేయండి.. స్టెప్ బై స్టెప్ గైడ్
ఇంట్లో వాటర్ ట్యాంక్ ఇలా క్లీన్ చేయండి.. స్టెప్ బై స్టెప్ గైడ్
Embed widget