అన్వేషించండి

ACB Trap: అవినీతి తిమింగలం - రూ.10 లక్షల లంచం డిమాండ్, ఏసీబీ వలలో శామీర్పేట తహసీల్దార్

Telangana News: రెవన్యూ శాఖలో అవినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పట్టాదార్ పాస్ బుక్ జారీకి లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్ ను మాటు వేసి అదుపులోకి తీసుకున్నారు.

ACB Caught Shamirpet MRO While Taking Bribe: రెవెన్యూ శాఖలో అవినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పట్టాదార్ పాస్ బుక్ జారీ చేసేందుకు ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేయగా.. బాధితుని ఫిర్యాదుతో పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు సదరు అధికారి పని పట్టారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట తహసీల్దార్ సత్యనారాయణ రూ.10 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన రామశేషగిరిరావుకు షామీర్ పేట మండలంలోని లాల్ గడి మలక్పేట్ గ్రామంలో 29 ఎకరాల భూమి ఉంది. తన భూమికి పట్టాదారు పాస్ పుస్తకం కోసం ధరణిలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే, పాస్ పుస్తకం జారీ చేసేందుకు ఎమ్మార్వో లంచం డిమాండ్ చేశారు. దీంతో రామశేషగిరి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు బాధితుడు.. ఎమ్మార్వో సత్యనారాయణకు డబ్బు సిద్ధం అయ్యాయని సమాచారం ఇచ్చాడు. మంగళవారం ఎమ్మార్వో డ్రైవర్ బద్రి రూ.10 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎమ్మార్వో తీసుకోమంటేనే తాను డబ్బు తీసుకున్నట్లు డ్రైవర్ అంగీకరించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో తహసీల్దార్ ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. తహసీల్దార్ ఇంటితో పాటు బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.

Also Read: CM Revanth Reddy: మేడిగడ్డకు చేరుకున్న సీఎం రేవంత్ బృందం - కుంగిన పిల్లర్లు పరిశీలించిన ప్రజా ప్రతినిధులు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
Hyderabad Crime News: హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
Telangana El Nino: ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget