అన్వేషించండి

Valentines Day Scam: హాయ్ డార్లింగ్ అంటూ దోచేస్తారు? వాలెంటైన్ డే పేరుతో సైబర్ మోసాలు!

Valentines Day Scam: వాలెంటైన్స్ డే సందర్భంగా స్కామర్లు ఉచ్చులోకి లాగడానికి ప్రయత్నించవచ్చు. రొమాన్స్ స్కామ్‌లు , నకిలీ షాపింగ్ వెబ్‌సైట్‌లు మీ డేటా, డబ్బు చోరీ చేస్తారు.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వాలెంటైన్స్ డే పేరుతో ప్రేమ, నకిలీ IDలతో డబ్బు మోసాలు.
  • బహుమతి డెలివరీ పేరుతో OTP, వ్యక్తిగత వివరాలు అడుగుతారు.
  • ఆకర్షణీయమైన ఆఫర్లతో నకిలీ షాపింగ్ వెబ్‌సైట్లు మోసం చేస్తాయి.
  • గివ్‌అవే పేరిట ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేసి మోసం.

Valentines Day Scam: వాలెంటైన్స్ డే ఎంతో దూరంలో లేదు. ఆ రోజున, ప్రజలు తమ ప్రేమను వ్యక్తపరుస్తారు.  తమ ప్రేమికులకు బహుమతులు ఇస్తారు. ఇప్పుడు, దీన్ని సైబర్ మోసగాళ్లు ఒక ప్రధాన అవకాశంగా మార్చుకుంటున్నారు. ఇతర రోజుల మాదిరిగా కాకుండా, ఈ ప్రత్యేక రోజున స్కామర్లు ప్రజలను వివిధ మార్గాల్లో ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇవి రొమాన్స్ స్కామ్‌ల నుంచి గివ్‌అవే స్కామ్‌ల వరకు ఉండవచ్చు. వాలెంటైన్స్ డే నాడు మీరు ఏ రకమైన స్కామ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలో ఓసారి చూద్దాం. 

లవ్‌ పేరుతో స్కామ్ 

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రొమాన్స్ స్కామ్‌లు సర్వసాధారణం. ఇవి సాధారణంగా డేటింగ్ యాప్‌లు,  సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రారంభమవుతాయి. ఇలాంటి సందేలా చాలా టెంప్టింగ్‌గా ఉంటాయి. మిమ్మల్ని చాలా రొమాంటిక్‌గా పిలుస్తూ ఈ సందేశాలు ఉంటాయి. వాటిని నమ్మి క్లిక్ చేస్తే మీ డేటా, డబ్బులు రెండూ పోతాయి. మరోవైపు  స్కామర్‌లు వ్యక్తులను మోసం చేయడానికి మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తుల నకిలీ IDలను ఉపయోగిస్తారు. తెలిసిన వారే మాట్లాడుతున్నట్టు ప్రారంభించిన తర్వాత, వారు వైద్య అత్యవసర పరిస్థితి లేదా ఇతర అవసరాల కోసం డబ్బు అడుగుతారు. ఎవరైనా వాటిని నమ్మి డబ్బులు పంపిస్తే, అవతలి వ్యక్తి వాటిని తీసుకొని ఉడాయిస్తాడు. కాబట్టి, అటువంటి అభ్యర్థనలకు రియాక్ట్ కావద్దు. డబ్బు లేదా బహుమతి కార్డులను పంపవద్దు. 

నకిలీ డెలివరీ సందేశం

ఈ రకమైన స్కామ్‌లో, మీకు ఒక ఆశ్చర్యకరమైన బహుమతి వచ్చిందని పేర్కొంటూ మీకు సందేశం లేదా ఫోన్ కాల్ వస్తుంది. దానిని డెలివరీ చేయడానికి, వారు మిమ్మల్ని లింక్‌పై క్లిక్ చేయమని లేదా OTPని షేర్ చేయమని అడుగుతారు. అలా చేయడం వల్ల మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు. కాబట్టి, నిర్ధారణ లేకుండా ఎటువంటి సున్నితమైన సమాచారాన్ని షేర్ చేయవద్దు.

నకిలీ షాపింగ్ వెబ్‌సైట్

ఈ సమయంలో ప్రజలు విస్తృతంగా షాపింగ్ చేస్తారని స్కామర్లకు తెలుసు. దీని కోసం, వారు నిజమైన షాపింగ్ వెబ్‌సైట్‌లా కనిపించే నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టిస్తారు. ఈ వెబ్‌సైట్‌లకు ప్రజలను ఆకర్షించడానికి, వారు సోషల్ మీడియాలో టెంప్టింగ్ ఆఫర్‌లను అందిస్తారు. ఎవరైనా ఈ టెంప్టేషన్‌కు లొంగిపోతే, వారి వ్యక్తిగత వివరాలన్నీ  చోరీ చేస్తారు. అందువల్ల, ఎల్లప్పుడూ టెంప్టింగ్ ప్రకటనలు ఆకర్షితులు కావద్దు. అలాంటివి ఉంటే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం మంచిది.కొత్త వెబ్‌సైట్‌ను ధృవీకరించకుండా ఎప్పుడూ షాపింగ్ చేయవద్దు.

గివ్‌అవే స్కామ్

వాలెంటైన్స్ డే సందర్భంగా, ఉచిత డిన్నర్‌లు, సెలవులు, ఖరీదైన బహుమతులు గెలుచుకుంటారని చెప్పుకునే అనేక పోస్ట్‌లను మీరు సోషల్ మీడియాలో చూస్తారు. వారు మిమ్మల్ని ఒక ఫామ్ నింపి ప్రాసెసింగ్ రుసుము చెల్లించమని అడుగుతారు. ఈ స్కామ్‌లు మీ డేటా, డబ్బును దొంగిలించడానికి ప్రయత్నిస్తాయి.

ఇలాంటి సందేశాలు వచ్చినప్పుడు కచ్చితంగా ఆన్‌లైన్‌లో ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలి. ఫ్యాక్ట్ చెక్ చేసిన తర్వాత నిజమైనవని నిర్దారించుకోవడం చాలా అవసరం. లేకుంటే సైబర్‌ వలకు మీరు చిక్కుకున్నట్టే.  

Frequently Asked Questions

వాలెంటైన్స్ డే సందర్భంగా సైబర్ మోసగాళ్లు ఎలాంటి స్కామ్‌లకు పాల్పడతారు?

వాలెంటైన్స్ డే సందర్భంగా సైబర్ మోసగాళ్లు రొమాన్స్ స్కామ్‌లు, నకిలీ డెలివరీ సందేశాలు, నకిలీ షాపింగ్ వెబ్‌సైట్‌లు, గివ్‌అవే స్కామ్‌ల వంటి మోసాలకు పాల్పడతారు.

రొమాన్స్ స్కామ్‌ల నుండి ఎలా రక్షించుకోవాలి?

డేటింగ్ యాప్‌లు లేదా సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద, ఆకర్షణీయమైన సందేశాలను నమ్మవద్దు. మీకు బాగా తెలిసిన వారి నకిలీ IDల నుండి వచ్చే డబ్బు అభ్యర్థనలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దు.

నకిలీ డెలివరీ సందేశాల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలి?

మీకు ఆశ్చర్యకరమైన బహుమతి వచ్చిందని వచ్చే సందేశాలపై నమ్మకం ఉంచవద్దు. లింక్‌లపై క్లిక్ చేయడం లేదా OTPని షేర్ చేయడం వంటివి చేయకుండా, నిర్ధారణ లేకుండా సున్నితమైన సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు.

నకిలీ షాపింగ్ వెబ్‌సైట్‌లను ఎలా గుర్తించాలి?

ఆకర్షణీయమైన ఆఫర్లతో వచ్చే ప్రకటనలను గుడ్డిగా నమ్మవద్దు. ఏదైనా కొత్త వెబ్‌సైట్‌లో షాపింగ్ చేసే ముందు, దాని ప్రామాణికతను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవడం చాలా ముఖ్యం.

గివ్‌అవే స్కామ్‌లలో ఎలా మోసపోకుండా ఉండాలి?

ఉచిత డిన్నర్‌లు, సెలవులు, బహుమతులు గెలుచుకుంటామని చెప్పే పోస్ట్‌లను జాగ్రత్తగా పరిశీలించండి. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు అడిగితే, వాటిని చెల్లించవద్దు.

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget