అన్వేషించండి

iOS 17: ఈ ఐఫోన్లు వాడే వారికి బ్యాడ్ న్యూస్ - ఎందుకంటే ఇకపై!

కొన్ని ఐఫోన్ మోడళ్లకు ఐవోఎస్ 17 లేటెస్ట్ అప్‌డేట్‌ను అందించబోవడం లేదు.

యాపిల్ తన డబ్ల్యూడబ్లూడీసీ 2023 ఈవెంట్లో ఐవోఎస్ 17 అప్‌డేట్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అప్‌డేట్‌ను ప్రస్తుతం వినియోగంలో ఉన్న కొన్ని ఐఫోన్లకు అందించబోవడం లేదు. యాపిల్ కొత్త అప్‌డేట్‌ను రిలీజ్ చేసినప్పుడు కొన్ని పాత మోడల్స్‌కు నిలిపివేయడం సాధారణమే అయినా... ఈసారి ఇందులో ప్రీమియం ఫోన్లు కూడా ఉండటం విశేషం.

ఈ ఐఫోన్లకు నో అప్‌డేట్
ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ X... ఈ మూడు ఫోన్లూ ప్రస్తుతం ఐవోఎస్ 16 మీద పని చేస్తున్నాయి. వీటికి ఐవోఎస్ 17 అప్‌డేట్‌ను అందించబోవడం లేదని కంపెనీ తన అధికారిక సైట్లో ప్రకటించింది. ఈ ఐవోఎస్ 17 ప్రస్తుతం డెవలపర్ బీటా విడుదల అయింది. సెప్టెంబర్ తర్వాత స్టేబుల్ అప్‌డేట్ రానుంది.

వీటిలో ఐఫోన్ X యాపిల్ ఫేస్ ఐడీ 3డీ ఆథెంటికేషన్ టెక్నాలజీతో లాంచ్ అయిన మొదటి ఫోన్. అంచులు లేసి స్క్రీన్ కోసం యాపిల్ స్టెయిన్‌లెస్ స్టీల్ ఫ్రేమ్‌తో రూపొందించిన మొట్టమొదటి ఐఫోన్ మోడల్ కూడా ఇదే.

ఇక యాపిల్ టచ్ ఐడీ ఆథెంటికేషన్‌తో లాంచ్ అయిన చివరి ప్రీమియం ఫోన్లు ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్. కొన్ని ఐప్యాడ్ మోడళ్లు, మ్యాక్ బుక్‌ల్లో యాపిల్ ఇప్పటికీ ఈ టెక్నాలజీనే ఉపయోగిస్తుంది. ఐఫోన్ ఎస్ఈ మోడళ్లలో కూడా టచ్ ఐడీనే ఉన్నప్పటికీ ఇవి ఐఫోన్ 8 సిరీస్ అంత ప్రీమియం మోడళ్లు కాదు.

ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ 11 సిరీస్, ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ ఎస్ఈ (2020), ఐఫోన్ ఎస్ఈ (2022) స్మార్ట్ ఫోన్లకు ఈ అప్‌డేట్ అందుబాటులో ఉంది.

ఐవోఎస్ 17లో చాలా ఇంట్రస్టింగ్ ఫీచర్లు ఉన్నాయి. కొత్త ఆపరేటింగ్ సిస్టంతో వినియోగదారులు తమ ఫోటోలనే స్టిక్కర్‌లుగా ఉపయోగించవచ్చు. ఇది కాకుండా దాని కీప్యాడ్‌ను కూడా మాడిఫై చేశారు. దీని కారణంగా యాపిల్ డివైసెస్‌లో టైప్ చేయడం మరింత సులభం అవుతుంది.

ఈ కొత్త అప్‌డేట్‌తో నేమ్ డ్రాప్ ఫీచర్, ఫేస్‌టైమ్ వీడియో మెసేజ్ ఫీచర్లు అందించారు. దీంతోపాటు అన్నిటికన్నా ముఖ్యమైన స్టాండ్‌బై మోడ్ అందుబాటులోకి వచ్చింది. ఈ స్టాండ్ బై మోడ్ ద్వారా  ఐఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు లాక్ స్క్రీన్ హారిజంటల్‌గా మారుతుంది. ఇది ఐఫోన్‌ను స్మార్ట్ డిస్‌ప్లేగా మారుస్తుంది.  దీనిపై డేట్, టైం, లైవ్ యాక్టివిటీస్, విడ్జెట్స్‌ను చూడవచ్చు. ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి పక్కన పెట్టినప్పుడు ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది.

దీంతో పాటు జర్నల్ యాప్‌ను కూడా క్రియేట్ చేశారు. అంటే వినియోగదారుల డైలీ లైఫ్‌ను, వారి యాక్టివిటీస్‌ను ఇది ట్రాక్ చేస్తుంది. దాని ద్వారా వినియోగదారుల జీవితాన్ని జర్నల్‌లా రూపొందిస్తుంది. ఇందులో ఫొటోలు, వీడియోలను కూడా ఇముడ్చుతుంది. ఇలాంటి యాప్‌పై ప్రైవసీ ఎలా ఉంటుందో అని సందేహాలు ఉండటం సహజమే. కానీ ఇది ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను సపోర్ట్ చేస్తుంది.

నేమ్ డ్రాప్ అనే ఫీచర్‌ను కూడా యాపిల్ అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా ఇద్దరు యాపిల్ యూజర్లు సమీపంలోకి వచ్చినప్పుడు ఎయిర్ డ్రాప్‌లో ఫొటోలు, వీడియోలు ఎలా షేర్ చేసుకుంటారో, అలా తమ కాంటాక్ట్ డిటైల్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. అంటే మీకు సమీపంలో ఉన్న యాపిల్ యూజర్ల కాంటాక్ట్ డిటైల్స్‌ను మీరు రిక్వెస్ట్ చేయవచ్చు. వారు యాక్సెప్ట్ చేస్తే ఇద్దరి కాంటాక్ట్ డిటైల్స్ ఎక్స్‌ఛేంజ్ అవుతాయి.

టాప్ హెడ్ లైన్స్

WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Embed widget