IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK
IPL, 2022 | Match 69 | Wankhede Stadium, Mumbai - 21 May, 07:30 pm IST
(Match Yet To Begin)
MI
MI
VS
DC
DC

Samsung Galaxy S22 Ultra 1TB: 1000 జీబీకి పైగా స్టోరేజ్‌తో శాంసంగ్ ఫోన్ - ఫీచర్లు, లుక్ ఎలా ఉన్నాయంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన గెలాక్సీ ఎస్22 అల్ట్రాలో 1 టీబీ స్టోరేజ్ వేరియంట్‌ను లాంచ్ చేసింది.

FOLLOW US: 

శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రాలో కొత్త వేరియంట్ లాంచ్ అయింది. ఇందులో 1 టీబీ స్టోరేజ్‌ను అందించారు. ఈ ఫోన్ గతంలో మనదేశంలో 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ అయింది. ఇప్పుడు ఇందులో 1 టీబీ వేరియంట్‌ను కూడా అందించారు. ఇవి తప్ప మిగతా ఫీచర్లన్నీ దాదాపు ఒకేలా ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా ధర
తాజాగా లాంచ్ అయిన 12 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను మనదేశంలో రూ.1,34,999గా నిర్ణయించారు. గతంలో లాంచ్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.1,09,999గానూ, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,18,999గా ఉంది. బర్గండీ, ఫాంటం బ్లాక్, ఫాంటం వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్ బాడీలోనే మొదటిసారి ఇన్‌బిల్ట్ ఎస్-పెన్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపైనే శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా పనిచేయనుంది. ఇందులో 6.8 అంగుళాల ఎడ్జ్ క్యూహెచ్‌డీ+ డైనమిక్ అమోఎల్ఈడీ 2X డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను ఇందులో అందించారు. 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్‌ను శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రాలో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా, మరో 10 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 40 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు.

5జీ, 4జీ ఎల్టీఈ, యూడబ్ల్యూబీ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు శాంసంగ్ ఇందులో అందించింది. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారోమీటర్, జియోమ్యాగ్నటిక్, గైరో స్కోప్, హాల్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 45W ఫాస్ట్ చార్జింగ్‌ను, 15W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.89 సెంటీమీటర్లు కాగా, బరువు 229 గ్రాములుగా ఉంది.

Published at : 25 Mar 2022 04:15 PM (IST) Tags: Samsung New Phone Samsung Galaxy S22 Ultra Samsung Galaxy S22 Ultra 1TB Storage Samsung Galaxy S22 Ultra New Variant Samsung Galaxy S22 Ultra 1TB Price

సంబంధిత కథనాలు

Moto G71s 5G: రూ.20 వేలలోపే మోటొరోలా కొత్త 5జీ ఫోన్ - సూపర్ ఫీచర్లు కూడా - ఎలా ఉందో చూశారా?

Moto G71s 5G: రూ.20 వేలలోపే మోటొరోలా కొత్త 5జీ ఫోన్ - సూపర్ ఫీచర్లు కూడా - ఎలా ఉందో చూశారా?

Whatsapp Premium: త్వరలో వాట్సాప్ ప్రీమియం - డబ్బులు కట్టాల్సిందేనా?

Whatsapp Premium: త్వరలో వాట్సాప్ ప్రీమియం - డబ్బులు కట్టాల్సిందేనా?

Apple Event 2022: యాపిల్ ఈవెంట్ డేట్ లీక్ - ఐఫోన్లతో పాటు లాంచ్ అయ్యేవి ఇవే - ధరలు కూడా!

Apple Event 2022: యాపిల్ ఈవెంట్ డేట్ లీక్ - ఐఫోన్లతో పాటు లాంచ్ అయ్యేవి ఇవే - ధరలు కూడా!

Vivo X80 Pro: సూపర్ కెమెరాలతో వచ్చిన వివో ఫ్లాగ్ షిప్ ఫోన్లు - ఫీచర్లు మామూలుగా లేవుగా!

Vivo X80 Pro: సూపర్ కెమెరాలతో వచ్చిన వివో ఫ్లాగ్ షిప్ ఫోన్లు - ఫీచర్లు మామూలుగా లేవుగా!

Realme Narzo 50 5G: రూ.14 వేలలోపే రియల్‌మీ 5జీ ఫోన్ - ఫీచర్లు అదుర్స్ - ఫోన్ ఎలా ఉందంటే?

Realme Narzo 50 5G: రూ.14 వేలలోపే రియల్‌మీ 5జీ ఫోన్ - ఫీచర్లు అదుర్స్ - ఫోన్ ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

Nikhat Zareen Profile: ఓవర్‌నైట్ గెలుపు కాదిది - నిఖత్ జరీన్‌ది 12 ఏళ్ల శ్రమ!

Nikhat Zareen Profile: ఓవర్‌నైట్ గెలుపు కాదిది - నిఖత్ జరీన్‌ది 12 ఏళ్ల శ్రమ!

CM Jagan Davos Tour : సీఎం జగన్ దావోస్ పర్యటన, పెట్టుబడులే టార్గెట్!

CM Jagan Davos Tour : సీఎం జగన్ దావోస్ పర్యటన, పెట్టుబడులే టార్గెట్!

Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!

Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!

NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు

NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు