అన్వేషించండి

Samsung Galaxy S22 Series: 1024 జీబీతో శాంసంగ్ కొత్త ఫోన్, ఆండ్రాయిడ్ 12, 5జీ ఫీచర్లు కూడా, శాంసంగ్ బెస్ట్ ఫోన్ ఇదే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన గెలాక్సీ ఎస్22 సిరీస్ స్మార్ట్ ఫోన్ సిరీస్‌ను లాంచ్ చేసింది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో ఈ ఫోన్లు లాంచ్ అవ్వడం విశేషం. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మూడు కొత్త ఎస్-సిరీస్ ఫోన్లు వచ్చేశాయ్. శాంసంగ్ గెలాక్సీ ఎస్22, శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా ఫోన్లు ఈ కార్యక్రమంలో లాంచ్ అయ్యాయి. ఈ మూడు శాంసంగ్ హైఎండ్ ఫోన్లు కావడం విశేషం. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రాలో 1 టీబీ (1024 జీబీ) వరకు స్టోరేజ్ ఉండటం విశేషం.

శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో ఈ వేరియంట్లు లాంచ్ అయ్యాయి. దీని ధర 799 డాలర్ల (సుమారు రూ.59,900) నుంచి ప్రారంభం కానుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ప్లస్ ధర
ఇందులో కూడా రెండు వేరియంట్లే లాంచ్ అయ్యాయి. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తోనే ఈ వేరియంట్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. ఈ స్మార్ట్ ఫోన్ ధర 999 డాలర్ల (సుమారు రూ.74,800) నుంచి ప్రారంభం కానుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా ధర
ఇందులో మాత్రం నాలుగు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ, 12 జీబీ ర్యామ్ + 1 టీబీ (1024 జీబీ) వేరియంట్లలో ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. దీని ధర 1,199 డాలర్ల (సుమారు రూ.89,700) నుంచి ప్రారంభం అయింది. అమెరికాలో వీటి సేల్ ఫిబ్రవరి 25వ తేదీ నుంచి జరగనుంది. మనదేశంలో ఈ ఫోన్లు ఎప్పుడు లాంచ్ అవుతాయో తెలియరాలేదు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్22 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.1 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డైనమిక్ అమోఎల్ఈడీ 2X డిస్‌ప్లేను అందించారు. గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్‌ను ఇందులో అందించారు. ఆర్మర్ అల్యూమినియం చాసిస్ కూడా ఇందులో ఉంది. ఇందులో అడాప్టివ్ 120 హెర్ట్జ్ ఫీచర్‌ను అందించారు. 8 జీబీ ర్యామ్ ఇందులో ఉంది.

ఇక కెమెరా విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 10 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారోమీటర్, జియోమ్యాగ్నటిక్, గైరో స్కోప్, హాల్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఇందులో శాంసంగ్ అందించింది. దీని బ్యాటరీ సామర్థ్యం 3700 ఎంఏహెచ్‌గా ఉంది. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను, 15W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.76 సెంటీమీటర్లు కాగా, బరువు 168 గ్రాములుగా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్22+ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపైనే ఈ ఫోన్ కూడా పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డైనమిక్ అమోఎల్ఈడీ 2X డిస్‌ప్లేను అందించారు. ఇందులో అడాప్టివ్ 120 హెర్ట్జ్ ఫీచర్‌ను అందించారు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించడం విశేషం.

ఇక కెమెరా విషయానికి వస్తే.. ఇందులో కూడా వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా ఇందులో శాంసంగ్ అందించింది. గెలాక్సీ ఎస్22 తరహాలోనే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 10 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో కూడా ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారోమీటర్, జియోమ్యాగ్నటిక్, గైరో స్కోప్, హాల్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా శాంసంగ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించింది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 45W ఫాస్ట్ చార్జింగ్‌ను, 15W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.76 సెంటీమీటర్లు కాగా, బరువు 196 గ్రాములుగా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్ ఫోన్‌కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఫోన్ బాడీలోనే మొదటిసారి ఇన్‌బిల్ట్ ఎస్-పెన్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.8 అంగుళాల ఎడ్జ్ క్యూహెచ్‌డీ+ డైనమిక్ అమోఎల్ఈడీ 2X డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను ఇందులో అందించారు. 12 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ (1024 జీబీ) వరకు స్టోరేజ్ ఇందులో అందుబాటులో ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా, మరో 10 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 40 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

5జీ, 4జీ ఎల్టీఈ, యూడబ్ల్యూబీ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు శాంసంగ్ ఇందులో అందించింది. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారోమీటర్, జియోమ్యాగ్నటిక్, గైరో స్కోప్, హాల్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 45W ఫాస్ట్ చార్జింగ్‌ను, 15W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌ను శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.89 సెంటీమీటర్లు కాగా, బరువు 229 గ్రాములుగా ఉంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samsung India (@samsungindia)

టాప్ హెడ్ లైన్స్

October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
Laptop Overheating : ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget