అన్వేషించండి

Samsung A54 5G Sale: శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ సేల్ షురూ - మిడ్‌రేంజ్ ఫ్లాగ్‌ఫిప్‌లో విన్నర్ అవుతుందా?

శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది.

Samsung Galaxy A54 5G: శాంసంగ్ గెలాక్సీ ఏ-సిరీస్‌లో గెలాక్సీ ఏ53 5జీ మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫోన్. దాని తర్వాతి వెర్షన్‌గా శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీని కంపెనీ ఇటీవలే లాంచ్ చేసింది. దీనికి సంబంధించిన సేల్ కూడా నేటి నుంచి మనదేశంలో ప్రారంభం అయింది. ఈ ఫోన్‌లో సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఎక్సినోస్ 1380 ప్రాసెసర్‌ను ఇందులో అందుబాటులో ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ రేటు
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.38,999గా నిర్ణయించారు. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధరను రూ.40,999గా ఉంది.

అసమ్ లైమ్, అసమ్ గ్రాఫైట్, అసమ్ వయొలెట్ కలర్ ఆప్షన్లలో శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీని కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ ఆఫర్ కింద ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికి కొన్ని ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.3,000 వరకు క్యాష్ బ్యాక్ లభించనుంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ పని చేయనుంది. నాలుగు జనరేషన్ల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్లు, ఐదు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లను కూడా అందిస్తామని కంపెనీ తెలిపింది. 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండటం విశేషం. శాంసంగ్ ఎక్సినోస్ 1380 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను ఉన్నాయి.

8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఈ ఫోన్‌లో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. 5జీ, వైఫై, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్, గ్లోనాస్, బైదు, గెలీలియో, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. డాల్బీ టెక్నాలజీ ఉన్న స్టీరియో స్పీకర్లను ఈ ఫోన్‌లో అందించారు. దీని మందం 0.82 సెంటీమీటర్లు కాగా, బరువు 202 గ్రాములుగా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్04 స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఇటీవలే లాంచ్ అయింది. 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇందులో అందించారు. ఫ్రంట్ కెమెరా కోసం వాటర్ డ్రాప్ తరహా నాచ్ అందుబాటులో ఉంది. ఇందులో ర్యామ్ ప్లస్ ఫీచర్ అందించారు. ఈ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను 8 జీబీ వరకు పెంచుకోవచ్చు. 64 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంది. ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను రూ.7,499గా నిర్ణయించారు.

టాప్ హెడ్ లైన్స్

Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
High Court On Tuni Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
Embed widget