అన్వేషించండి

Redmi Pad SE 8.7: రెండు బడ్జెట్ ట్యాబ్‌లు లాంచ్ చేసిన రెడ్‌మీ - రూ.13 వేలలోపే!

Redmi New Tab: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ తన కొత్త ట్యాబ్‌లను లాంచ్ చేసింది. దీని ధర రూ.13 వేలలోపే అందుబాటులో ఉంది.

Redmi Pad SE 8.7 Launched: రెడ్‌మీ ప్యాడ్ ఎస్ఈ 8.7 4జీ, రెడ్‌మీ ప్యాడ్ ఎస్ఈ 8.7 ట్యాబ్లెట్లు ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయ్యాయి. చైనీస్ బ్రాండ్ లాంచ్ చేసిన లేటెస్ట్ ట్యాబ్లెట్లు ఇవే. ఈ రెండు మోడల్స్‌లోనూ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్‌లు పని చేయనున్నాయి. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది. ఇందులో 8.7 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్‌ను అందించారు. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 6650 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న డ్యూయల్ స్పీకర్లను అందించారు.

రెడ్‌మీ ప్యాడ్ ఎస్ఈ 8.7, రెడ్‌మీ ప్యాడ్ ఎస్ఈ 8.7 4జీ ధర ఎంత?
రెడ్‌మీ ప్యాడ్ ఎస్ఈ 8.7 ధర 119 పౌండ్లుగా (మనదేశ కరెన్సీలో రూ.13,000) నిర్ణయించారు. రెడ్‌మీ ప్యాడ్ ఎస్ఈ 8.7 4జీ వెర్షన్ ధర 149 పౌండ్లుగా (మనదేశ కరెన్సీలో 16,000) ఉంది. అరోరా గ్రీన్, గ్రాఫైట్ గ్రే, స్కై బ్లూ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతానికి ఇవి యూకేలో అందుబాటులో ఉండనున్నాయి. ఇవి మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానున్నాయో తెలియరాలేదు.

రెడ్‌మీ ప్యాడ్ ఎస్ఈ 8.7, రెడ్‌మీ ప్యాడ్ ఎస్ఈ 8.7 4జీ స్పెసిఫికేషన్లు
రెడ్‌మీ ప్యాడ్ ఎస్ఈ 8.7, రెడ్‌మీ ప్యాడ్ ఎస్ఈ 8.7 4జీ ట్యాబ్లెట్లు రెండిట్లోనూ 8.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్సీడీ స్క్రీన్‌ను అందించారు. ఎల్సీడీ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఫీచర్లు కూడా ఉన్నాయి. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్‌లు రన్ కానున్నాయి. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.

వీటిలో 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ముందువైపు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది. ఈ ట్యాబ్‌లు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సర్టిఫికేషన్‌తో రానున్నాయి. వైఫై 5, బ్లూటూత్ వీ5.3, ఎఫ్ఎం రేడియో, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటి బ్యాటరీ సామర్థ్యం 6650 ఎంఏహెచ్ బ్యాటరీగా ఉంది. ఇవి 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. వీటి మందం 0.88 సెంటీమీటర్లు కాగా, బరువు 375 గ్రాములుగా ఉంది.

టాప్ హెడ్ లైన్స్

IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget