Monsoon Mobile Tips: వానలో ఫోన్ తడిస్తే ప్రయోగాలొద్దు.. పేలే ఛాన్స్ ఉంది..
అసలే వర్షాకాలం.. ఇప్పటికే వానలు దంచికొడుతున్నాయి. ఏదో ఓ పని మీద కచ్చితంగా బయటకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఇలాంటప్పుడు ఫోన్ వెంట తీసుకెళ్తాం. మరీ వానలో ఫొన్ తడిస్తే.. పరిస్థితేంటి?
ఓ వైపు వర్షాలు విపరీతంగా వస్తున్నాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.. సరే.. కొన్నిసార్లు ఫోన్ తడిచిపోతుంది. ఆ వెంటనే స్క్రీన్ పనిచేయక.. ఒక్కొసారి ఏవేవో రంగులు వస్తుంటాయి. బ్యాటరీలోకి నీళ్లు వెళితే.. ఇక ఆఫ్ అయితే.. మన బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాని పరిస్థితి. అయితే ఫోన్ తడిచాక.. కొన్ని పనులు చేయకుండా ఉంటేనే మంచిది. ఆన్ అవ్వట్లేదుగా.. అని.. మనం చేసే ప్రయోగాలతో ఫోన్ పేలే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి..
వానలో మీరేదైనా.. పనిపై బయటకు వెళ్తే.. జాగ్రత్తలు లేకుండా ఉంటే ఫోన్ తడిసిపోవచ్చు. అలా తడిసిపోగానే.. కొంతమంది ఫోన్ పూర్తిగా విడగొట్టేసి.. ఆరబెడితే అయిపోతుందనే ఆలోచన వస్తుంది. పాట్లు పాట్లుగా ఫోన్ ను ఎలా విడగొట్టాలా అని.. ప్రయోగాలు చేస్తారు. కానీ అలా అసలు చేయకూడదు. ఇంకా లోపలికి నీరు వెళ్లే అవకాశం ఉంది. తడిసిన ఫోన్ ను జేబులో ఎక్కువ సేపు పెట్టుకోకుడదు. హెయిర్ డ్రైయర్ ను వాడే ప్రయత్నం చేస్తారు కొంతమంది. అందులో నుంచి వచ్చే.. ఎక్కువ వేడితో ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉందండి. తడిచిన ఫోన్ ను పాలిథిన్ కవర్లో పెట్టకపోవడమే మంచింది. తేమ ఉండడం వలన సర్క్యూట్లను దెబ్బతీస్తుంది. ఫోన్ తడిసిపోయినప్పుడు వెంటనే దాని భాగాలను విడదీయకూడదు.
తడిగా ఉన్న ఫోన్ కు హెడ్ ఫోన్ ఉపయోగించకపోవడమే ఉత్తమం. నీరు ఇంకా లోపలికి వెళ్లి.. పూర్తిగా సౌండ్ సమస్య వస్తే... అప్పుడు వినడానికి ఏమీ ఉండదు. చూస్తూ.. ఉండటం తప్ప. వానలో తడిచిన ఫోన్ కు ఛార్జింగ్ లేకపోయిన పర్వాలేదు... పూర్తిగా ఆరిన తర్వాతే.. ఛార్జింగ్ పెట్టండి. ఆ తడిలో ఛార్జింగ్ పెడితే పేలే అవకాశం ఎక్కువ. తడిచిన ఫోన్ ను బల్బ్ కింద, గ్యాస్ దగ్గర అసలే పెట్టకండి. నార్మల్ టెంపరేచర్లో మాత్రమే ఉంచాలి. ఫోన్ ను కొద్ది సమయం వరకు ఉపయోగించకూడదు. ఈ సమయంలో పేలిపోయే అవకాశం ఉంది.
- వానలో బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. మెుబైల్ వాటర్ ఫ్రూఫ్ కవర్ ఉండటం మంచిది. ఇది ఫోన్ ను పూర్తిగా కప్పేస్తుంది. ఫోన్ సురక్షితంగా ఉంటుంది. ఇవీ కావాలంటే ఆన్ లైన్ లో ఉంటాయి. రూ.100 నుంచి 400 వరకూ కాస్ట్ ఉన్నవి కూడా దొరుకుతాయి.
- మీరు బయట ఉన్నప్పుడు ఆకస్మాత్తుగా వర్షం పడితే.. వెంటనే మీ మొబైల్ను పాలిబాగ్ లేదా పాలిథిన్ కవర్తో గట్టిగా చూట్టాలి. ఇది ఫోన్ తడవకముందే చేయాలి. ఇలా చేయడం వలన ఫోన్ వర్షంలో తడవదు. వర్షం తగ్గిన తర్వాత పాలిథిన్ కవర్ తొలగించి.. వస్త్రంతో క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. ఫోన్ తడిచాక కవర్లో పెట్టడం మంచిది కాదు.
Also Read: OnePlus Nord 2 5G: వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్.. విడుదలైన నార్డ్ 2.. ధర, ఫీచర్లు ఇవే..