అన్వేషించండి

Poco New Phone: 108 మెగాపిక్సెల్ కెమెరా, 5జీ ఫీచర్లతో పోకో కొత్త ఫోన్.. లాంచ్ త్వరలోనే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన కొత్త స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది. అదే పోకో ఎక్స్4 5జీ.

పోకో ఎక్స్4 స్మార్ట్ ఫోన్ సిరీస్ త్వరలో మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వీటిలో ఒక ఫోన్ ఇటీవలే సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో కూడా కనిపించింది. మలేషియా సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ కనిపించినట్లు తెలుస్తోంది. ఇదే స్మార్ట్ ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (బీఐఎస్) వెబ్‌సైట్‌లో కూడా కనిపించింది. అయితే పోకో దీని గురించి అధికారికంగా ప్రకటించలేదు.

పోకో ఎక్స్ 5జీ గీక్ బెంచ్ వెబ్‌సైట్లో కూడా కనిపించిందని ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ తెలిపారు. ఇప్పటివరకు వస్తున్న లీకుల ప్రకారం.. ఈ ఫోన్ షియోమీ 2201116PG అనే మోడల్ నంబర్‌తో కనిపించింది. ఇదే ఫోన్ పోకో ఎక్స్4 5జీగా లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. ఇదే స్మార్ట్ ఫోన్ బీఐఎస్ వెబ్‌సైట్‌లో 2201116PI మోడల్ నంబర్‌తో కనిపించింది. కాబట్టి మనదేశంలో కూడా ఈ ఫోన్ లాంచ్ కానుందని అర్థం చేసుకోవచ్చు. ఈ లిస్టింగ్ ప్రకారం.. ఇందులో 5జీ సపోర్ట్ కూడా ఉండనుంది.

ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఎన్‌ఎఫ్‌సీ సపోర్ట్‌ను కూడా ఇందులో అందించారు. గతంలో వచ్చిన కథనం ప్రకారం.. రెడ్‌మీ నోట్ 11 ప్రో 5జీకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా పోకో ఎక్స్4 5జీ లాంచ్ కానుంది. రెడ్‌మీ నోట్ 11 స్మార్ట్ ఫోన్‌ను పోకో ఎం4 ప్రో 5జీగా లాంచ్ చేసింది. ఇప్పుడు పోకో ఎక్స్4 5జీ విషయంలో కూడా కంపెనీ దాన్నే ఫాలో అవుతుందని తెలుస్తోంది.

రెడ్‌మీ నోట్ 11 ప్రో స్మార్ట్ ఫోన్ కూడా అధికారిక లాంచ్‌కు సిద్ధం అయింది. పోకో ఎక్స్4 5జీలో ఏ ఫీచర్లు ఉండనున్నాయో.. ఈ లాంచ్‌లో తెలిసే అవకాశం ఉంది. రెడ్‌మీ నోట్ 11 ప్రో 5జీలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను అందించే అవకాశం ఉంది.

ఇందులో 6.67 అంగుళాల డిస్‌ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నట్లు సమాచారం. వీటిలో 108 మెగాపిక్సెల్ కెమెరా ప్రధాన సెన్సార్‌గా ఉండనుంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, రెండు 2 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. అంటే పోకో ఎక్స్4 5జీలో కూడా 108 మెగాపిక్సెల్ కెమెరా ఉండనున్నట్లు సమాచారం.

టాప్ హెడ్ లైన్స్

AI analyzes Characters: ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
AI Chatbots: ఒకే ప్రశ్నకు ChatGPT, Gemini, Claude వేర్వేరు సమాధానాలు.. ఇలా ఎందుకు వస్తాయంటే?
ఒకే ప్రశ్నకు ChatGPT, Gemini, Claude వేర్వేరు సమాధానాలు.. ఇలా ఎందుకు వస్తాయంటే?
Wired vs Wireless Internet: వైర్డ్ వర్సెస్ వైర్‌లెస్ ఇంటర్నెట్.. మీ ఇంటికి ఏ కనెక్షన్ బెస్ట్?
వైర్డ్ వర్సెస్ వైర్‌లెస్ ఇంటర్నెట్.. మీ ఇంటికి ఏ కనెక్షన్ బెస్ట్?
Open AI Hacking: ఓపెన్ ఏఐని హ్యాక్ చేసిన భారత టెకీలు.. ఏపీకి చెందిన ఒకరు.. లోపాన్ని సరిదిద్దుకున్న సంస్థ!
ఓపెన్ ఏఐని హ్యాక్ చేసిన భారత టెకీలు.. ఏపీకి చెందిన ఒకరు.. లోపాన్ని సరిదిద్దుకున్న సంస్థ!

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medaram Jatara Dates: మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ
సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Vijayawada News: అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
Hyderabad Metro Rail Project:హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి ముహూర్తం ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి ముహూర్తం ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: బరాబర్‌ అమన్‌కి ఇచ్చే పడేసిన త్రిగుణ్, ముకేశ్! విన్నర్ డబ్బు ఎలా ఇస్తారంటూ గొడవ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: బరాబర్‌ అమన్‌కి ఇచ్చే పడేసిన త్రిగుణ్, ముకేశ్! విన్నర్ డబ్బు ఎలా ఇస్తారంటూ గొడవ!
Tiger Tension: వికారాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం.. గోశాల ఆవులపై దాడి, భయాందోళనలో స్థానిక ప్రజలు
వికారాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం.. గోశాల ఆవులపై దాడి, భయాందోళనలో స్థానిక ప్రజలు
Dementia Signs : మతిమరుపు లేదా డిమెన్షియా? ఈ 7 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త, వైద్యుల సూచనలివే
మతిమరుపు లేదా డిమెన్షియా? ఈ 7 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త, వైద్యుల సూచనలివే
Embed widget