అన్వేషించండి

Poco C65: రూ.10 వేలలోనే 8 జీబీ + 256 జీబీ ఫోన్ - మార్కెట్లోకి పోకో సీ65 ఎంట్రీ!

Poco C65: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన కొత్త సీ65 బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను గ్లోబల్ లాంచ్ చేసింది.

Poco C65: పోకో సీ65 స్మార్ట్ ఫోన్ గ్లోబల్‌గా లాంచ్ అయింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో లాంచ్ అయిన పోకో సీ55కి తర్వాతి వెర్షన్‌గా పోకో సీ65 వచ్చేసింది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. పోకో సీ65లో మెరుగైన కెమెరాలు అందుబాటులో ఉన్నాయి.

పోకో సీ65 ధర (Poco C65 Price)
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 129 డాలర్లుగా (సుమారు రూ.10,700) నిర్ణయించారు. కానీ ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద 109 డాలర్లకే (సుమారు రూ.9,100) కొనుగోలు చేయవచ్చు. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 149 డాలర్లుగా (సుమారు రూ.12,400) ఉంది. ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద ఈ ఫోన్‌ను 129 డాలర్లకే (సుమారు రూ.10,700) దక్కించుకోవచ్చు. బ్లాక్, బ్లూ, పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో పోకో అధికారికంగా వెల్లడించలేదు.

పోకో సీ65 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Poco C65 Specifications, Features)
పోకో సీ65 స్మార్ట్ ఫోన్‌లో 6.74 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, యాస్పెక్ట్ రేషియో 20.6:9గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో దీన్ని ప్రొటెక్ట్ చేయనున్నారు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.

మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై పోకో సీ65 రన్ కానుంది. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు ఈఎంఎంసీ 5.1 ఇన్‌బిల్ట్ స్టోరేజ్ అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, గ్లోనాస్ కనెక్టివిటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎం రేడియో సపోర్ట్ కూడా అందించారు. సెక్యూరిటీ కోసం ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందుబాటులో ఉంది. దీని మందం 0.8 సెంటీమీటర్లు కాగా, బరువు 192 గ్రాములుగా ఉంది.

మరోవైపు పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఇటీవలేత లాంచ్ అయింది. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌పై పోకో ఎం6 ప్రో 5జీ పని చేయనుంది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా కాగా, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను పని చేయనుంది. 6.79 అంగుళాల భారీ డిస్‌ప్లే కూడా ఇందులో ఉంది. పోకో ఫోన్లలో ఇదే అత్యంత భారీ డిస్‌ప్లే అని కంపెనీ తెలుపుతోంది.

Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?

Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!

Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?

టాప్ హెడ్ లైన్స్

Laptop Overheating : ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget