అన్వేషించండి

OnePlus Nord CE 2 5G Sale: వన్‌ప్లస్ కొత్త 5జీ ఫోన్ సేల్ ప్రారంభం - ధర రూ.24 వేలలోపే!

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది.ఈ స్మార్ట్ ఫోన్ ధర మనదేశంలో రూ.23,999 నుంచి ప్రారంభం కానుంది.

వన్‌ప్లస్ మనదేశంలో ఇటీవలే లాంచ్ చేసిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. అమెజాన్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌పై వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ 65W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999 కాగా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.24,999గా నిర్ణయించారు. బహామా బ్లూ, గ్రే మిర్రర్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అమెజాన్, వన్‌ప్లస్ అధికారిక వెబ్ సైట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఇందులో అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌పై వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా అందించారు. ఎలక్ట్రిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్471 కెమెరాను అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా... 65W సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఫోన్ మందం 0.78 సెంటీమీటర్లు కాగా... బరువు 173 గ్రాములుగా ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

X Down: ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్
ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ "ఎక్స్" డౌన్! వినియోగదారులు అసహనం!
Social Media Addiction: సోషల్ మీడియాను వ్యసనంగా మారుస్తున్న మెటా, యూట్యూబ్‌! కాలిఫోర్నియా జ్యూరీ సంచలన నిర్ణయం! బాధితురాలికి భారీ పరిహారం!
సోషల్ మీడియాను వ్యసనంగా మారుస్తున్న మెటా, యూట్యూబ్‌! కాలిఫోర్నియా జ్యూరీ సంచలన నిర్ణయం! బాధితురాలికి భారీ పరిహారం!
Instagram Reels Tips : ఇన్​స్టాలో రీల్స్ వైరల్ అవ్వాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే.. డబ్బు కూడా సంపాదించొచ్చు!
ఇన్​స్టాలో రీల్స్ వైరల్ అవ్వాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే.. డబ్బు కూడా సంపాదించొచ్చు!
Online Scams : ఆన్​లైన్​ మోసాల నుంచి తప్పించుకోవాలంటే.. ఈ 5 టిప్స్ గుర్తుంచుకోండి, లేకపోతే భారీ నష్టం తప్పదు
ఆన్​లైన్​ మోసాల నుంచి తప్పించుకోవాలంటే.. ఈ 5 టిప్స్ గుర్తుంచుకోండి, లేకపోతే భారీ నష్టం తప్పదు

వీడియోలు

Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam
Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LPG Connection: ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
Hyderabad Chicken Shops Close: హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
Revanth south Movement: రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
Venkatesh Nandamuri Kalyan Ram : వెంకీ, కల్యాణ్ రామ్‌లతో అనిల్ మల్టీ స్టారర్ - హీరోయిన్స్ ఫిక్స్ అయ్యారా?
వెంకీ, కల్యాణ్ రామ్‌లతో అనిల్ మల్టీ స్టారర్ - హీరోయిన్స్ ఫిక్స్ అయ్యారా?
Horror Movies : ఈ మూవీస్ ఒంటరిగా అస్సలు చూడొద్దు - యూట్యూబ్‌లో టాప్ హారర్ థ్రిల్లర్స్ లిస్ట్
ఈ మూవీస్ ఒంటరిగా అస్సలు చూడొద్దు - యూట్యూబ్‌లో టాప్ హారర్ థ్రిల్లర్స్ లిస్ట్
LPG Imports: చైనాకు వెళ్లాల్సిన ఎల్పీజీ ట్యాంకర్లు భారత్‌ మళ్లాయి! ఎనిమిదేళ్ల తర్వాత ఇరాన్ నుంచి వస్తున్న ఎల్పీజీ కార్గో !
చైనాకు వెళ్లాల్సిన ఎల్పీజీ ట్యాంకర్లు భారత్‌ మళ్లాయి! ఎనిమిదేళ్ల తర్వాత ఇరాన్ నుంచి వస్తున్న ఎల్పీజీ కార్గో !
HMPV Symptoms: ముక్కు దిబ్బడ ,గొంతు నొప్పి ఉందా? సాధారణ జలుబుగా పొరపాటు పడకండి! HMPV కావచ్చు! 
ముక్కు దిబ్బడ ,గొంతు నొప్పి ఉందా? సాధారణ జలుబుగా పొరపాటు పడకండి! HMPV కావచ్చు! 
Family Planning Operation : పిల్లలు పుట్టకుండా చేసే ఆపరేషన్ మగవారు చేయించుకుంటే మంచిదా? లేక ఆడవారికా? నిపుణుల సలహాలు ఇవే
పిల్లలు పుట్టకుండా చేసే ఆపరేషన్ మగవారు చేయించుకుంటే మంచిదా? లేక ఆడవారికా? నిపుణుల సలహాలు ఇవే
Embed widget