అన్వేషించండి

Nokia G21 Launch: రూ.14 వేలలోపే నోకియా కొత్త ఫోన్, భారీ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా తన కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే నోకియా జీ21

Nokia G21: నోకియా జీ21 స్మార్ట్ ఫోన్ ఎంపిక చేసిన మార్కెట్లలో లాంచ్ అయింది. మనదేశంలో గతేడాది లాంచ్ అయిన నోకియా జీ20కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లేను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5050 ఎంఏహెచ్‌గా ఉంది.

నోకియా జీ21 ధర
ఈ ఫోన్ ధరను రష్యాలో 15,999 రూబుల్స్‌గా (సుమారు రూ.15,600) నిర్ణయించారు. ఇందులో కేవలం 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. బ్లూ కలర్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. నోకియా జీ20 మనదేశంలో రూ.12,999 ధరతో లాంచ్ అయింది. నోకియా జీ21 మనదేశంలో లాంచ్ అయితే దాని ధర రూ.14 వేలలోపే ఉండే అవకాశం ఉంది.

నోకియా జీ21 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. పిక్సెల్ డెన్సిటీ 269 పీపీఐగా ఉంది. 

4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5050 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను ఇందులో నోకియా అందించింది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు రెండు 2 మెగాపిక్సెల్ షూటర్లు కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

వైఫై, 4జీ, బ్లూటూత్ వీ5, జీపీఎస్, గ్లోనాస్, బైదు, గెలీలియో, ఎన్‌పీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో అందించారు. యాక్సెలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్ కూడా ఇందులో అందించారు. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు... గూగుల్ అసిస్టెంట్‌కు ప్రత్యేకమైన బటన్ కూడా ఉంది. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా... బరువు 190 గ్రాములుగా ఉంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pricebaba (@pricebaba)

టాప్ హెడ్ లైన్స్

ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
Apple iPhone 17 Pro Offer: ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!
ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!
1980s Retro Photos Trend: 1980 రెట్రో ఫొటో ట్రెండ్‌‌తో నిలువునా ముంచేస్తారు జాగ్రత్త.. సైబర్ బ్యూరో వార్నింగ్
1980 రెట్రో ఫొటో ట్రెండ్‌‌తో నిలువునా ముంచేస్తారు జాగ్రత్త.. సైబర్ బ్యూరో వార్నింగ్
AI Danger: మూడేళ్లలో ఏఐ మానవులను అంతం చేస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?
మూడేళ్లలో ఏఐ మానవులను అంతం చేస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rashmika Mandanna : బేబీ బంప్‌తో రష్మిక లుక్... భర్త విజయ్‌కు హగ్ - రణబాలి సెట్‌లో క్యూట్ మూమెంట్
బేబీ బంప్‌తో రష్మిక లుక్... భర్త విజయ్‌కు హగ్ - రణబాలి సెట్‌లో క్యూట్ మూమెంట్
Konda Surekha: పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
Buses To Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్, బాలాపూర్‌ గణేష్ దర్శనానికి RTC ప్రత్యేక బస్సులు
ఖైరతాబాద్ గణేష్, బాలాపూర్‌ గణేష్ దర్శనానికి RTC ప్రత్యేక బస్సులు
AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బ్లాక్‌ కీ దక్కించుకొని పవర్ పోగొట్టుకుందెవరు? ఎలిమినేషన్ జరిగిందా! రేపటి నుంచి రెండో అవతారం!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బ్లాక్‌ కీ దక్కించుకొని పవర్ పోగొట్టుకుందెవరు? ఎలిమినేషన్ జరిగిందా! రేపటి నుంచి రెండో అవతారం!
IND VS AFG 1st T20 Result Update: అభిషేక్ వీర‌విహారం.. 22 బంతుల్లోనే ఫిఫ్టీ.. ఆఫ్గాన్ పై టీమిండియా బంప‌ర్ విక్ట‌రీ.. స‌త్తా చాటిన ఇషాన్, అర్ష‌దీప్
అభిషేక్ ఊచకోత.. 22 బంతుల్లోనే ఫిఫ్టీ.. ఆఫ్గాన్ పై టీమిండియా బంప‌ర్ విక్ట‌రీ.. స‌త్తా చాటిన ఇషాన్, అర్ష‌దీప్
Aussie Star Cameron Green Wedding: కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన‌ గ్రీన్.. ప్రేయసి ఎమిలీ రెడ్‌వుడ్‌తో ఏడడుగులు
ఓ ఇంటివాడైన గ్రీన్.. ప్రేయసి ఎమిలీ రెడ్‌వుడ్‌తో ఏడడుగులు నడిచిన ఆసీస్ స్టార్
Arvind Kejriwal: గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
Embed widget