అన్వేషించండి

Xiaomi 14: ప్రీమియం ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - షావోమీ 14 ఎంట్రీ ఇచ్చింది - ‘హంటర్’ కెమెరాతో!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ తన ప్రీమియం స్మార్ట్ ఫోన్ అయిన షావోమీ 14ను లాంచ్ చేసింది.

షావోమీ 14 స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ గురువారం చైనాలో జరిగిన కార్యక్రమంలో లాంచ్ చేసింది. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ హంటర్ 900 సెన్సార్‌ను అందించారు. దీని ద్వారా ఫొటోలు అద్భుతంగా వస్తాయని కంపెనీ అంటోంది. 16 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. 3000 పీక్ బ్రైట్‌నెస్‌ను షావోమీ 14 అందించనుంది.

షావోమీ 14 ధర
షావోమీ 14లో నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,999 యువాన్లు (సుమారు రూ.45,500) కాగా, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 4,299 యువాన్లుగా (సుమారు రూ.48,000) నిర్ణయించారు. ఇక టాప్ ఎండ్ మోడల్స్ అయిన 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,599 యువాన్లుగానూ (సుమారు రూ.52,000), 16 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,999 యువాన్లుగానూ (సుమారు రూ.56,000) ఉంది.

క్లాసిక్ బ్లాక్, రాక్ బ్లూ, స్నో మౌంటెయిన్ పింక్, వైట్ కలర్ ఆప్షన్లలో షావోమీ 14ను కొనుగోలు చేయవచ్చు. చైనాలో వీటికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. అయితే మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతాయనేది మాత్రం తెలియరాలేదు.

షావోమీ 14 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
షావోమీ 14లో ఆండ్రాయిడ్ ఆధారిత హైపర్ఓఎస్ ఇంటర్‌ఫేస్‌ను అందించారు. 6.36 అంగుళాల ఎల్టీపీవో అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉంది. 1.5కే రిజల్యూషన్, 1 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు కూడా అందించారు. 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఈ ఫోన్ డెలివర్ చేయనుంది. ఈ మధ్యే మార్కెట్లో లాంచ్ అయిన 4ఎన్ఎం క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌‌పై షావోమీ 14 పని చేయనుంది. అంతే కాకుండా 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1 టీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి.

ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్‌ను అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ హంటర్ 900 సెన్సార్ ఉంది. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 4610 ఎంఏహెచ్ కాగా, 90W వైర్డ్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. అలాగే 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్ ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. దీని మందం 0.82 సెంటీమీటర్లు కాగా, బరువు 193 గ్రాములుగా ఉంది.

5జీ, వైఫై 7, యూఎస్‌బీ 3.2 పోర్టు, బ్లూటూత్, జీపీఎస్, గెలీలియో, గ్లోనాస్, బైదు, నావిక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, లీనియర్ మోటార్, ఐఆర్ బ్లాస్టర్, ఫ్లిక్కర్ సెన్సార్, కలర్ సెన్సార్లను కూడా షావోమీ ఇందులో అందించింది. ప్రైవసీ, సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎక్స్-యాక్సిస్ లీనియర్ వైబ్రేషన్ మోటార్‌ను ప్రత్యేకంగా గేమింగ్ కోసం అందించడం విశేషం. డాల్బీ అట్మాస్‌ను సపోర్ట్ చేసే స్టీరియో స్పీకర్లు కూడా షావోమీ 14లో చూడవచ్చు.

Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?

Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!

Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TDP Mahanadu:నెల్లూరు నుంచి మంగళగిరికి మహానాడు షిఫ్ట్‌... బాబు ప్లాన్ రివర్స్‌? టీడీపీలో వర్గపోరుకు చెక్ పడేనా!
నెల్లూరు నుంచి మంగళగిరికి మహానాడు షిఫ్ట్‌... బాబు ప్లాన్ రివర్స్‌? టీడీపీలో వర్గపోరుకు చెక్ పడేనా!
Machilipatnam Lecturer Joshua Arrested: మాయాటలతో యువతికి కామర్స్ లెక్చరర్ వల! గుట్టురట్టు చేసిన భార్య! రెడ్‌ హ్యాండెడ్‌గా పోలీసులకు అప్పగింత!
మాయాటలతో యువతికి కామర్స్ లెక్చరర్ వల! గుట్టురట్టు చేసిన భార్య! రెడ్‌ హ్యాండెడ్‌గా పోలీసులకు అప్పగింత!
Nowhera Shaik Arrested: నౌహీరా షేక్ అరెస్ట్.. ఫేక్ ఐడీతో దొరికిన హీరా గ్రూప్ ఎండీ
ఖురాన్ టీచర్ నుంచి కుబేరురాలి వరకు... హీరా గోల్డ్ కుంభకోణంలో అరెస్టైన నౌహీరా షేక్‌ బ్యాక్‌గ్రౌండ్!
Heatwave in Andhra Pradesh and Telangana:తెలుగు రాష్ట్రాల్లో హీట్‌వేవ్‌ దెబ్బ! పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు! పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!
తెలుగు రాష్ట్రాల్లో హీట్‌వేవ్‌ దెబ్బ! పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు! పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!

వీడియోలు

MI vs KKR IPL 2026 Highlights | ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ ఊచకోత
KKR Bowlers Destroy MI Batting IPL 2026 | ముంబైకు చుక్కలు చూపించిన నరైన్, గ్రీన్
Sanju Samson vs Heinrich Klaasen | క్లాసెన్‌తో గొడవకు ఎండ్ కార్డ్ వేసిన సంజూ
Virat Kohli Comments On Captaincy Stress | ద్రవిడ్ చేసిన సాయంపై కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
Hardik Pandya Shocking Comments IPL 2026 | కేకేఆర్ చేతిలో ఓటమిపై హార్దిక్ పాండ్యా అసంతృప్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Mahanadu:నెల్లూరు నుంచి మంగళగిరికి మహానాడు షిఫ్ట్‌... బాబు ప్లాన్ రివర్స్‌? టీడీపీలో వర్గపోరుకు చెక్ పడేనా!
నెల్లూరు నుంచి మంగళగిరికి మహానాడు షిఫ్ట్‌... బాబు ప్లాన్ రివర్స్‌? టీడీపీలో వర్గపోరుకు చెక్ పడేనా!
Machilipatnam Lecturer Joshua Arrested: మాయాటలతో యువతికి కామర్స్ లెక్చరర్ వల! గుట్టురట్టు చేసిన భార్య! రెడ్‌ హ్యాండెడ్‌గా పోలీసులకు అప్పగింత!
మాయాటలతో యువతికి కామర్స్ లెక్చరర్ వల! గుట్టురట్టు చేసిన భార్య! రెడ్‌ హ్యాండెడ్‌గా పోలీసులకు అప్పగింత!
Nowhera Shaik Arrested: నౌహీరా షేక్ అరెస్ట్.. ఫేక్ ఐడీతో దొరికిన హీరా గ్రూప్ ఎండీ
ఖురాన్ టీచర్ నుంచి కుబేరురాలి వరకు... హీరా గోల్డ్ కుంభకోణంలో అరెస్టైన నౌహీరా షేక్‌ బ్యాక్‌గ్రౌండ్!
Heatwave in Andhra Pradesh and Telangana:తెలుగు రాష్ట్రాల్లో హీట్‌వేవ్‌ దెబ్బ! పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు! పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!
తెలుగు రాష్ట్రాల్లో హీట్‌వేవ్‌ దెబ్బ! పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు! పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!
Cockroach Janta Party: జనతా పార్టీ గురించి చర్చ సందర్భంగా సెర్చింగ్‌లో 'బొద్దింక' ! దాని సంస్కృత నామం ఏంటో తెలుసా? డైనోసార్ కన్నా ముందే ఉనికిలో ఉన్నాయా?
జనతా పార్టీ గురించి చర్చ సందర్భంగా సెర్చింగ్‌లో 'బొద్దింక' ! దాని సంస్కృత నామం ఏంటో తెలుసా? డైనోసార్ కన్నా ముందే ఉనికిలో ఉన్నాయా?
Transfer Trimurthulu Teaser : కానిస్టేబుల్ త్రిమూర్తులు వెరీ స్ట్రిక్ట్ - పదేళ్ల తర్వాత హీరోగా వడ్డే నవీన్ రీఎంట్రీ
కానిస్టేబుల్ త్రిమూర్తులు వెరీ స్ట్రిక్ట్ - పదేళ్ల తర్వాత హీరోగా వడ్డే నవీన్ రీఎంట్రీ
IPL 2026 GT VS CSK Result Update: చెన్నై ఇంటికి.. జీటీ చేతిలో ఘోర ప‌రాజ‌యం.. రాణించిన సుద‌ర్శ‌న్, గిల్, సిరాజ్, రాబ‌డ‌
చెన్నై ఇంటికి.. జీటీ చేతిలో ఘోర ప‌రాజ‌యం.. రాణించిన సుద‌ర్శ‌న్, గిల్, సిరాజ్, రాబ‌డ‌
Hardik Pandya Fined: MI కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు జరిమానా - KKR మ్యాచ్ లో ప్రవర్తనపై సీరియస్ యాక్షన్
MI కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు జరిమానా - KKR మ్యాచ్ లో ప్రవర్తనపై సీరియస్ యాక్షన్
Embed widget