అన్వేషించండి

ChatGPT Spotify Integration: స్పాటిఫైకి చాట్‌జీపీటీ హంగులు- పాటల ఎంపికలో సరికొత్త విప్లవం 

ChatGPT Spotify Integration:పాటల ఎంపికలో సరికొత్త శకం ప్రారంభమైంద. మీ 'మూడ్'కు తగ్గట్టుగా పాటు అందించేందుకు చాట్‌జీపీటీతో స్పాటిఫై టైఅప్‌ అయ్యింది. ఇకపై మీకు సరికొత్త అనుభూతి పంచనుంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • స్పాటిఫై, చాట్‌జీపీటీ అనుసంధానం: వ్యక్తిగత సిఫార్సులకు AI సాయం.
  • మూడ్‌, సందర్భాన్ని బట్టి పాటలు, పాడ్‌కాస్ట్‌లు పొందవచ్చు.
  • ఖాతా లింకింగ్ ద్వారా ప్లేలిస్ట్‌లు, సిఫార్సులను సులభంగా సృష్టించవచ్చు.
  • ప్రీమియం వినియోగదారులకు మరింత మెరుగైన, విస్తృతమైన సేవలు అందుబాటులో.

ChatGPT Spotify Integration: సంగీత ప్రియుల అనుభవాన్ని పూర్తిగా మార్చేందుకు సిద్ధమైంది స్పాటిఫై. కృత్రిమ మేధస్సు చాట్‌బాట్ అయిన చాట్‌జీపీటీతో కలిసి మరిన్ని అద్భుతాలు చేసేందుకు సిద్ధమైంది. ఈ సేవలు పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. ఈ విప్లవాత్మక కలయికతో వినియోగదారుల మనసులోని భావాలను, మూడ్‌లను లేదా ప్రయాణాల నేపథ్యాన్ని కేవలం పదాల రూపంలో చెబితే చాలు, చాట్‌జీపీటీ దానికి తగ్గట్టుగా ప్రత్యేకమైన, పర్సనలైజ్డ్‌ పాటలు, కళాకారులు, ఆల్బమ్‌లు, ప్లేలిస్ట్‌లు లేదా పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లు స్పాటిఫై నుంచి సిఫార్సు చేస్తుంది.

మీరు కారులో ఉన్నా, టీవీ చూస్తున్నా, లేదా గేమింగ్ చేస్తున్నా 2,000 కంటే ఎక్కువ పరికరాల్లో స్పాటిఫై సేవలు అందుబాటులో ఉంది. ఈ యూప్ వాడే వినియోగదారులు ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిరుచి. అందుకే వారి అభిరుచికి తగ్గట్టుగా పాటలు ప్లే చేయాలనే ఉద్ధేశంలో ఈ ముందడుగు వేసింది. మీరు ఉన్న సిచ్యుయేషన్‌ను వివరిస్తే దానికి తగ్గట్టుగా పాటలు, లేదా పాడ్‌కాస్ట్‌లు, ప్లేలిస్ట్‌లు మీకు వినిపిస్తుంది. ఒక్క ట్యాప్ దూరంలో ఈ సేవలను అందుబాటులో ఉంచింది.  

వినియోగం ఎలా? నిమిషాల్లో ప్లేలిస్ట్ సృష్టి!

ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించడం చాలా సులభం, ఇది స్పాటిఫై ఫ్రీ, ప్రీమియం వినియోగదారులిద్దరికీ అందుబాటులో ఉంచింది. 

1. సంభాషణ ప్రారంభం: ముందుగా, మీరు చాట్‌జీపీటీలో మాట్లాడాలి. మీ చెప్పే ప్రాంప్ట్‌లో కచ్చితంగా 'స్పాటిఫై' అని ప్రస్తావించాలి. అప్పుడే మీకు రెండు అనుసంధానమై మీకు కావాల్సిన పాటలు, పాడ్‌కాస్ట్‌లు అందిస్తుంది. 

2. అకౌంట్‌ లింకింగ్: మీరు మొదటిసారి ఈ సేవను ఉపయోగిస్తున్నట్లయితే, మీ స్పాటిఫై ఖాతాను చాట్‌జీపీటీకి కనెక్ట్ చేయమని అడుగుతుంది. ఈ అనుసంధానం పూర్తిగా ఆప్ట్-ఇన్ ద్వారా జరుగుతుంది. మీరు ఎప్పుడైనా కనెక్ట్ చేయవచ్చు లేదా డిస్‌కనెక్ట్ చేయవచ్చు, పూర్తి నియంత్రణ మీ చేతుల్లోనే ఉంటుంది.

3. సిఫార్సు అడగడం: ఆ తర్వాత, మీరు నేరుగా పాటలు, ఆర్టిస్ట్‌లు, ఆల్బమ్‌లు, ప్లేలిస్ట్‌లు లేదా పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లను అడగవచ్చు.

4. ఆటోమేటిక్ ప్లే: చాట్‌జీపీటీ మీరు అడిగిన సందర్భాన్ని ఆటోమేటిక్‌గా గ్రహించి, స్పాటిఫై యాప్‌ను చాట్‌లో ఓపెన్ చేస్తుంది. కావాల్సిన పని పూర్తి చేస్తుంది.

5. వివరాలు చెప్పాలి: మీరు మెరుగైన ఫలితాలు రావాలంటే, మీ అభ్యర్థనలకు జానర్ (genre), మూడ్ (mood), లేదా ఆర్టిస్ట్ వంటి వివరాలు ఇవ్వాలి. పాడ్‌కాస్ట్‌ల కోసం అయితే, ఒక అంశం (topic), హోస్ట్, లేదా అతిథి పేరు జత చేయవచ్చు.

ఉదాహరణకు, మీరు లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్తున్నారు. అప్పడు చాట్‌జీపీటీతో మాట్లాడి స్పాటిఫైను పిలిచి లాంగ్‌ డ్రైవ్‌కు  సరిపోయే పెర్‌ఫెక్ట్‌ సౌండ్‌ ట్రాక్‌ ఇవ్వమని అడగాలి. మీకు ఇష్టమైన కె-పాప్ స్టార్ నుంచి కొత్త పాటలు కావాలన్నా, లేదా మీరు ఎక్కువగా వినే స్వదేశీ, విదేశీ ఆర్టిస్ట్‌ల ప్లేలిస్ట్ కావాలని కూడా అడగవచ్చు.

ప్రీమియం వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలు:

స్పాటిఫై ఈ సేవను అందించడంలో ఫ్రీ, ప్రీమియం వినియోగదారుల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. దీని ద్వారా ప్రీమియం వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు  అందిస్తోంది.

• స్పాటిఫై ఫ్రీ యూజర్‌లు స్పాటిఫై కేటలాగ్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న 'వీక్లీ డిస్కవర్ ' 'న్యూ మ్యూజిక్ ఫ్రైడే' వంటి ప్లేలిస్ట్‌లను మాత్రమే పొందగలుగుతారు.

• స్పాటిఫై ప్రీమియం యూజర్‌లు ఒక అడుగు ముందుకు వేయవచ్చు. వారు ఇచ్చే మరింత విస్తృతమైన ప్రాంప్ట్‌లను తీసుకుని, స్పాటిఫై వాటిని ఫ్రెష్‌ ఫుల్‌ పర్సనలైజ్డ్‌ ట్రాక్‌లను ఎంపిక చేస్తుంది. 

భద్రతపై హామీ:

ఈ కొత్త అనుసంధానం స్పాటిఫై వేదికపై ఉన్న ఆర్టిస్ట్‌లు పాడ్‌కాస్టర్‌లకు 'డిస్కవరీకి కొత్త వేదిక'గా నిలుస్తుంది. ఈ సేవ విస్తృతంగా అందుబాటులోకి రావడం వల్ల, వినియోగదారులు వారు ఇష్టపడే కొత్త వాటిని కనుగొనడానికి ఇది సరికొత్త మార్గం అవుతుంది. అయితే, వినియోగదారులు, క్రియేటర్స్‌ భద్రతకు గట్టిగా భరోసా ఇచ్చింది స్పాటిఫై. స్పాటిఫై తమ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న సంగీతం, పాడ్‌కాస్ట్‌లు లేదా ఏదైనా ఇతర ఆడియో లేదా వీడియో కంటెంట్‌ను ఇతర OpenAIతో పంచుకోదని స్పష్టం చేసింది. ఈ స్పాటిఫై యాప్ ప్రస్తుతం లాగిన్ అయిన ChatGPT ఫ్రీ, ప్లస్, ప్రో ఖాతాలన్నింటికీ 145 దేశాలలో అందుబాటులోకి వచ్చింది. ఇది వెబ్, మొబైల్ రెండింటిలోనూ పనిచేస్తుంది. 

టాప్ హెడ్ లైన్స్

Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
Android Phone Running Slow : మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
SIM No Service Problem: మీ ఫోన్‌
మీ ఫోన్‌ "నో సర్వీస్" అని చూపిస్తుందా?.. సిమ్ మార్చే ముందు ఈ సెట్టింగ్‌లను చెక్ చేయండి!

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BC Reservations In AP: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
పితృపక్షంలో ఇందిరా ఏకాదశి: పూర్వీకులకు మోక్షం ప్రసాదించే ఇందిరా ఏకాదశి రోజు తప్పనిసరిగా చదువుకోవాల్సిన కథ ఇది!
పితృపక్షంలో ఇందిరా ఏకాదశి: పూర్వీకులకు మోక్షం ప్రసాదించే ఇందిరా ఏకాదశి రోజు తప్పనిసరిగా చదువుకోవాల్సిన కథ ఇది!
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Embed widget