అన్వేషించండి

Realme Q5i: రూ.15 వేలలోపే రియల్‌మీ కొత్త 5జీ ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త 5జీ ఫోన్ రియల్‌మీ క్యూ5ఐని లాంచ్ చేసింది.

రియల్‌మీ క్యూ5ఐ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. రియల్‌మీ క్యూ5 సిరీస్‌లో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇదే సిరీస్‌లో రియల్‌మీ క్యూ5 ప్రో స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ కానుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.

రియల్‌మీ క్యూ5ఐ ధర
రియల్‌మీ క్యూ5ఐ ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,199 యువాన్లుగా (సుమారు రూ.14,300) ఉంది. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,299 యువాన్లుగా (సుమారు రూ.15,500) నిర్ణయించారు. గ్రాఫైట్ బ్లాక్, ఆబ్సిడియన్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో రియల్‌మీ క్యూ5ఐ ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.

రియల్‌మీ క్యూ5ఐ ఫీచర్లు
6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని డిస్‌ప్లే డిజైన్ వాటర్ డ్రాప్ నాచ్ తరహాలో ఉంది. సెల్ఫీ కెమెరా నాచ్‌లోనే ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా దీంతోపాటు మరో ఏఐ లెన్స్ అందించారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉంది. ఇది 33W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.

దీని మందం కేవలం 8.1 మిల్లీమీటర్లు మాత్రమే ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. హైరెస్ సర్టిఫైడ్ డ్యూయల్ స్పీకర్లు ఇందులో ఉన్నాయి. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. డైనమిక్ ర్యామ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. దీని ద్వారా ర్యామ్‌ను మరో 5 జీబీ పెంచుకోవచ్చు.

View this post on Instagram
 
A post shared by TechAdreno (@techadreno)

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Vinukonda Guntur Highway Expansion: వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Embed widget